న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల హాకీ వరల్డ్‌కప్: భారత్‌కు చావో రేవో, యుఎస్‌తో ఢీ

By Nageshwara Rao
Women’s Hockey World Cup: India women to take on USA in must-win game

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న మహిళల హాకీ వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఐర్లాండ్‌ చేతిలో ఓడిపోయి క్వార్టర్స్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత జట్టు ఆదివారం జరిగే మ్యాచ్‌లో అమెరికాతో తలపడనుంది.

టోర్నీలో క్వార్టర్స్‌ రేసులో నిలవాలంటే రాణి రాంపాల్‌ నేతృత్వంలోని భారత్‌ జట్టు ఈ మ్యాచ్‌ను కనీసం డ్రా చేసుకోవాలి లేదా మ్యాచ్‌లో విజయం సాధించాలి. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి లీగ్‌మ్యాచ్‌ను డ్రా చేసుకున్న భారత్.. అనూహ్యంగా ఐర్లాండ్ చేతిలో 0-1తో ఓటమిపాలై నాకౌట్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

 అమెరికాను ఓడించాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే

అమెరికాను ఓడించాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే

ఈ నేపథ్యంలో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఏడోస్థానంలో కొనసాగుతున్న అమెరికాను ఓడించాలంటే భారత్ తీవ్రంగా శ్రమించాల్సిందే. మరోవైపు అమెరికా జట్టు సైతం ఇంగ్లాండ్‌తో మ్యాచ్ డ్రా చేసుకోగా.. ఐర్లాండ్‌తో 1-3 స్కోరుతో ఓడి వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది. దీంతో భారత్‌కు మాత్రం ఈ మ్యాచ్ చాలా కీలకంగా మారింది.

 అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌‌కు

అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌‌కు

నాలుగు గ్రూప్‌ల్లో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్స్‌ చేరతాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య మ్యాచ్‌లు నిర్వహించి వాటిలో విజయం సాధించిన జట్లతో మరో నాలుగు క్వార్టర్స్‌ స్థానాలు భర్తీ చేస్తారు. ఇప్పటికే నెదర్లాండ్స్, ఐర్లాండ్, జర్మనీ నేరుగా క్వార్టర్స్ చేరగా గ్రూప్‌డీ నుంచి ఇంకా ఏ జట్టుకూడా అర్హత సాధించలేదు.

భారత్ సహా 9 జట్లు నాకౌట్ చేరేందుకు పోటీ

దీంతో క్వార్టర్స్‌లో ఐదు బెర్తులు మిగిలి ఉండగా.. భారత్ సహా 9 జట్లు నాకౌట్ చేరేందుకు పోటీ పడుతున్నాయి. భారత్‌ ప్రస్తుతం గ్రూప్‌- బిలో ఒక పాయింట్‌తో మూడో స్థానంలో ఉంది. అమెరికా ఖాతాలో కూడా ఒక్క పాయింట్‌ ఉన్నా కూడా గోల్స్‌ తేడాతో అది నాలుగో స్థానంలో కొనసాగుతోంది. దాంతో యుఎస్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా భారత్‌కు క్వార్టర్స్‌ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి

‘‘అమెరికాతో మ్యాచ్‌లో కచ్చితంగా విజయం సాధించాలి. దాంట్లో ఏం సందేహం లేదు. జట్టు కూర్పు, వ్యూహాలు సరిగానే ఉండడంతో అవకాశాలు వస్తున్నాయి కానీ వాటిని గోల్స్‌గా మలచడంలో విఫలమవుతున్నాం. తొలి రెండు మ్యాచ్‌ల్లో చాలా అవకాశాలే లభించాయి. కానీ ఫలితం లేకుండా పోయింది. కానీ యుఎస్‌ఏతో మ్యాచ్‌లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం'' అని కోచ్‌ జోర్డ్‌ మారిజ్నె తెలిపాడు.

భారత్‌ Vs అమెరికా జట్ల మధ్య మ్యాచ్‌ రాత్రి 9.30 గంటల నుంచి స్టార్‌స్పోర్ట్స్‌-2లో ప్రసారమవుతుంది.

Story first published: Sunday, July 29, 2018, 10:28 [IST]
Other articles published on Jul 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X