న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల హాకీ వరల్డ్‌కప్: ఇంగ్లాండ్‌ Vs భారత్, గెలుపెవరిదో!

By Nageshwara Rao
Womens Hockey World Cup 2018: India vs England, Telecast, date, start time and where to watch online

హైదరాబాద్: భారత మహిళల హాకీ జట్టు మరో ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు సిద్ధమైంది. లండన్ వేదికగా శనివారం నుంచి ఆరంభమయ్యే మహిళల వరల్డ్‌కప్ హాకీ టోర్నీలో భారత జట్టు తొలి రోజు ఆతిథ్య ఇంగ్లాండ్‌తో తలపడనుంది. 44 ఏళ్ల క్రితం తొలిసారి మహిళల హాకీ ప్రపంచకప్‌ నిర్వహించినపుడు భారత జట్టు తమ అత్యుత్తమ ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత మరో ఐదుసార్లు ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొన్నప్పటికీ మహిళల జట్టు ఏనాడూ మళ్లీ సెమీఫైనల్‌కు చేరుకోలేదు. అయితే కొంతకాలంగా భారత మహిళల హాకీ జట్టు అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తోంది. గతేడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గి తమ సత్తా చాటుకుంది. అదే జోరును ఈ టోర్నీలో కొనసాగించాలని ఊవిళ్లూరుతోంది.

టోర్నీలో మొత్తం 16 జట్లు

టోర్నీలో మొత్తం 16 జట్లు

టోర్నీలో కనీసం టాప్‌-8లో నిలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. శనివారం మొదలయ్యే ఈ టోర్నీలో16 జట్లు పాల్గొంటున్నాయి. మొత్తం జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లకు చోటు కల్పించారు. గ్రూప్‌ ‘బి'లో భారత్‌తోపాటు ఆతిథ్య ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా జట్లు ఉన్నాయి. లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూప్‌ల్లో అగ్రస్థానం పొందిన నాలుగు జట్లు క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత పొందుతాయి. ఆయా గ్రూప్‌ల్లో రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు మరో నాలుగు క్వార్టర్‌ ఫైనల్‌ బెర్త్‌ల కోసం పోటీపడతాయి.

తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆడనున్న భారత్‌

తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆడనున్న భారత్‌

ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా పదో స్థానానికి చేరుకున్న భారత్‌.. తన సామర్థ్యానికి తగ్గట్లు ఆడితే నాకౌట్‌కు చేరడం సాధ్యమే. కెప్టెన్‌ రాణి రాంపాల్‌తో పాటు గోల్‌కీపర్‌ సవితా పూనియా, వందన కటారియా, దీపిక ఠాకూర్‌ లాంటి సీనియర్లపై భారత్‌ ఆశలు పెట్టుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇతిమరపు రజని భారత్‌ తరఫున రెండో గోల్‌కీపర్‌గా వ్యవహరించనుంది. ఇక తొలి మ్యాచ్‌లో ప్రపంచ ఛాంపియన్‌ అయిన ఇంగ్లాండ్‌ను దాని సొంతగడ్డపై ఢీకొనడం భారత్‌కు సవాలే. శనివారం జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో ఆడనున్న భారత్‌... ఆ తర్వాత 26న ఐర్లాండ్‌తో... 29న అమెరికాతో తలపడుతుంది.

ఒత్తిడంతా ఇంగ్లండ్‌పైనే

ఒత్తిడంతా ఇంగ్లండ్‌పైనే

"సొంతగడ్డపై ఆడటం ఇంగ్లాండ్‌కు కలిసొచ్చే విషయమే. ఒత్తిడంతా ఇంగ్లండ్‌పైనే ఉంటుంది. కానీ వేరే దేశాల్లో జనాలతో కిక్కిరిసిన స్టేడియాల్లో ఆడటం మాకు కొత్తేమీ కాదు. అయితే ఇటీవల కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఇంగ్లండ్‌ను మేము ఓడించిన సంగతి మర్చిపోవద్దు. ఆ విజయం తాలూకు ఆత్మవిశ్వాసాన్ని కొనసాగిస్తాం. ఈసారి అలాంటి ఫలితమే సాధిస్తామన్న నమ్మకం ఉంది" అని వ్యాఖ్యానించింది. 16 జట్లు పోటీపడుతున్న ఈ టోర్నీ ఆగస్టు 5 వరకు జరుగుతుంది. భారత్‌ చివరగా 2010లో ప్రపంచకప్‌ ఆడింది. ఆ టోర్నీలో తొమ్మిదో స్థానానికి పరిమితమైన భారత్‌.. ఈసారి ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలనే పట్టుదలతో ఉంది.

వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రదర్శన

వరల్డ్ కప్‌లో భారత జట్టు ప్రదర్శన

ఏడాది వేదిక స్థానం

1974 ఫ్రాన్స్‌ 4

1978 స్పెయిన్‌ 7

1983 మలేసియా 11

1998 నెదర్లాండ్స్‌ 12

2006 స్పెయిన్‌ 11

2010 అర్జెంటీనా 9

జట్ల వివరాలు

జట్ల వివరాలు

గ్రూప్‌ ‘ఎ': చైనా, ఇటలీ, కొరియా, నెదర్లాండ్స్‌

గ్రూప్‌ ‘బి': భారత్, ఇంగ్లండ్, ఐర్లాండ్, అమెరికా

గ్రూప్‌ ‘సి': అర్జెంటీనా, దక్షిణాఫ్రికా, స్పెయిన్, జర్మనీ

గ్రూప్‌ ‘డి': ఆస్ట్రేలియా, బెల్జియం, జపాన్, న్యూజిలాండ్‌

టోర్నీ: మహిళల హాకీ వరల్డ్ కప్ 2018

టోర్నీ: మహిళల హాకీ వరల్డ్ కప్ 2018

వేదిక: London, The United Kingdom

తేదీ: 21 July, 2018

సమయం: 6:30 pm Indian Standard Time (IST)

ప్రత్యక్ష ప్రసారం: Star Sports 2, Star Sports HD2

లైవ్ స్ట్రీమింగ్: హాట్ స్టార్

Story first published: Saturday, July 21, 2018, 10:38 [IST]
Other articles published on Jul 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X