న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Tokyo Olympics 2021: భారత హాకీ టీమ్ సంచ‌ల‌నం.. 41 ఏళ్ల త‌ర్వాత సెమీఫైన‌ల్లోకి!!

Tokyo Olympics 2021: India Mens Hockey Team enters Semifinals after 41 Years
Tokyo Olympics: Men's Hockey Quarter Final | India vs Great Britain | Oneindia telugu

టోక్యో: జపాన్ వేదికగా జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత పురుషుల హాకీ టీమ్ సంచ‌ల‌నం సృష్టించింది. 41 ఏళ్ల త‌ర్వాత ఒలింపిక్స్ సెమీఫైన‌ల్లో భారత్ అడుగుపెట్టింది. ఆదివారం జ‌రిగిన క్వార్ట‌ర్‌ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియా 3-1 గోల్స్ తేడాతో గ్రేట్ బ్రిట‌న్‌పై అద్భుత విజ‌యం సాధించింది. ఒలింపిక్స్‌లో ఒక‌ప్పుడు 8 గోల్డ్ మెడ‌ల్స్ సాధించినా.. త‌ర్వాత క‌ళ త‌ప్పిన భార‌త హాకీ జట్టు ఈసారి అద్భుత‌మే చేసింది. టోర్నీ మొత్తం నిల‌క‌డ‌గా రాణిస్తున్న మ‌ణ్‌ప్రీత్ సింగ్ సేన.. లీగ్ స్టేజ్‌లో 5 మ్యాచ్‌ల‌కు గాను ఏకంగా 4 విజయాలు అందుకుంది.

భారత్ త‌ర‌ఫున దిల్‌ప్రీత్ సింగ్‌, హార్దిక్ సింగ్‌, గుర్జిత్ సింగ్ తలో గోల్స్ చేశారు. మ్యాచ్‌ ప్రారంభమైనప్పటి నుంచి భారత జట్టు బ్రిటన్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడింది. గోల్‌ చేయనీకుండా అడ్డుకుంది. మ్యాచ్‌ తొలి క్వార్టర్‌లో ఏడో నిమిషంలో దిల్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌ చేయగా.. రెండో క్వార్టర్‌లో 16వ నిమిషంలో గుర్జత్‌సింగ్‌ మరో గోల్‌ సాధించాడు. దీంతో మ్యాచ్‌ విరామ సమయానికి భారత్‌ 2-0 పాయింట్ల ఆధిక్యంతో కొనసాగింది.

45వ నిమిషంలో బ్రిటన్‌ తొలి గోల్‌ చేసింది. దీంతో మూడో క్వార్టర్‌ పూర్తయ్యేసరికి బ్రిటన్‌ ఒక గోల్‌ చేసి స్కోర్‌ 2-1గా మార్చింది. నాలుగో క్వార్టర్‌లో 57వ నిమిషంలో హార్దిక్‌ సింగ్‌ మూడో గోల్‌ చేసి భారత్‌ జట్టు ఆధిక్యాన్ని పెంచాడు. ఆ తర్వాత బ్రిట‌న్‌ మరో గోల్ చేయలేదు. ఇండియా ఆధిక్యాన్ని బ్రిట‌న్‌ కాస్త త‌గ్గించినా.. ఫలితం లేకుండా పోయింది. ఫలితంగా భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకొని సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

Tokyo Olympics 2021: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. భారత్‌ ఖాతాలో మరో పతకం!!Tokyo Olympics 2021: చరిత్ర సృష్టించిన పీవీ సింధు.. భారత్‌ ఖాతాలో మరో పతకం!!

Story first published: Sunday, August 1, 2021, 19:27 [IST]
Other articles published on Aug 1, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X