న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Rajiv Gandhi Khel Ratna రేసులో స్టార్​ హాకీ ప్లేయర్లు!!

PR Sreejesh, Deepika Thakur named Hockey Indias nominees for Rajiv Gandhi Khel Ratna Award

ఢిల్లీ: దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌ ఖేల్‌రత్న అవార్డ్‌కు పురుషుల హాకీ గోల్‌కీపర్‌ పీఆర్ శ్రీజేష్‌ పేరును నామినేట్‌ చేస్తున్నట్లు హాకీ ఇండియా శనివారం ప్రకటించింది. మరోవైపు హాకీ మహిళా జట్టుకు ప్రాతినిథ్యం వహించిన క్రీడాకారిణి దీపిక ఠాకూర్ (డిఫెండర్) పేరును కూడా ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు నామినేట్‌ చేసింది. భారత మహిళా కెప్టెన్ రాణి రాంపాల్ 2020లో ఖేల్ రత్నను గెలుచుకున్న విషయం తెలిసిందే.

ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైం అవార్డుకు దిగ్గజాలు డాక్టర్‌ ఆర్పీ సింగ్‌, సంగాయి ఇబెంహాల్‌ పేర్లను హాకీ ఇండియా ప్రతిపాదించింది. ద్రోణాచార్య పురస్కారానికి కోచ్​లు బీజే కరియప్ప, సీఆర్‌ కుమార్‌ పేర్లను నామినేట్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక అర్జున పురస్కారానికి హర్మన్‌ప్రీత్‌ సింగ్‌, వందనా కటారియాతో పాటు నవజోత్‌ కౌర్‌ పేర్లను హాకీ ఇండియా సిఫార్సు చేసింది. మే 20న జాతీయ క్రీడా అవార్డులకు నామినేషన్లను ఆహ్వానిస్తున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నామినేషన్ల సమర్పణకు చివరి గడువు జూన్ 21 కాగా.. ఈ నెల మొదట్లో జూన్ 28 వరకు పొడిగించబడింది.

1983 vs 2011: ధోనీసేనపై మేమే గెలిచేవాళ్లం.. ప్రపంచకప్‌ను అసలు వదిలేవాళ్లం కాదు: కపిల్‌ సేన1983 vs 2011: ధోనీసేనపై మేమే గెలిచేవాళ్లం.. ప్రపంచకప్‌ను అసలు వదిలేవాళ్లం కాదు: కపిల్‌ సేన

2018 హాకీ ఛాంపియన్స్​ ట్రోఫీలో వెండి పతకం, అదే ఏడాది ఆసియా గేమ్స్​లో కాంస్యం, ఎఫ్​ఐహెచ్​ మెన్స్​ సిరీస్​లో భారత్​ బంగారు పతకం సాధించడంలో పీఆర్ శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు. ఇక 2018 ఆసియా​ గేమ్స్​, ఆసియా ఛాంపియన్స్​ ట్రోఫీలో భారత మహిళల జట్టు రజతాలు సాధించడంలో దీపిక ఠాకూర్ ముఖ్య భూమిక పోషించింది.

గతేడాది 74 మంది గ్రహీతలకు అవార్డులు అందజేశారు. ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు రూ .25 లక్షలు, అర్జున అవార్డు గ్రహీతలు రూ .15 లక్షలు, ధ్రోనాచార్య (జీవితకాలం) అవార్డు గ్రహీతలు రూ .15 లక్షలు, ధ్యాన్‌చంద్ విజేతలు రూ .10 లక్షలు అందుకున్నారు. గతంతో పోలిస్తే పోయినసారి ప్రైజ్ మనీ గణనీయంగా పెరిగింది.

Story first published: Saturday, June 26, 2021, 19:45 [IST]
Other articles published on Jun 26, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X