న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోటోలు: ద్యుతీ చంద్‌కు రూ.3 కోట్ల ప్రైజ్‌మనీ అందజేత

By Nageshwara Rao
Odisha Chief Minister Naveen Patnaik Felicitates Ace Sprinter Dutee Chand
Odisha Chief Minister Naveen Patnaik felicitates ace sprinter DuteeChand

హైదరాబాద్: ఇండోనేషియా వేదికగా జరిగిన ఆసియా గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసిన భారత యువ స్ప్రింటర్ ద్యుతీ చంద్‌కు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ. 3 కోట్ల నగదు బహుమతిని అందజేశారు. తొలుత 100 మీటర్ల పరుగు పందెంలో ద్యుతీ చంద్‌ రజతం సాధించిన సంగతి తెలిసందే.

దీంతో ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోటిన్నర రూపాయల పారితోషికం ప్రకటించారు. ఈ సందర్భంగా తమ రాష్ట్రం నుంచి ఏషియాడ్‌కు వెళ్లి, దేశం గర్వించేలా చేసిన ద్యుతీ చంద్‌కి అభినందనలు కూడా తెలిపారు. ఆ తర్వాత జరిగిన 200 మీటర్ల పరుగుల పందెంలో కూడా ద్యుతీ రజతం నెగ్గిన సంగతి తెలిసిందే.

ద్యుతి చంద్‌కు రూ. 3 కోట్ల నజరానా

దాంతో మరో కోటిన్నర రూపాయల నజరానా ప్రకటించారు. ఈ మొత్తం ప్రైజీ మనీని ఆసియా గేమ్స్ నుంచి స్వదేశానికి చేరిన ద్యుతి చంద్‌కు రూ. 3 కోట్ల నజరానా బహుకరించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆయన తన ట్విట్టర్‌లో పంచుకున్నారు.

హాకీ అమ్మాయిలకు రూ. కోటి పారితోషికం

హాకీ అమ్మాయిలకు రూ. కోటి పారితోషికం

ఆసియా గేమ్స్‌లో‌ ఫైనల్‌కు చేరి, రజత పతకం సాధించిన హాకీ మహిళల జట్టులోని ఒడిసా రాష్ట్ర అమ్మాయిలకు కూడా నవీన్ పట్నాయక్ భారీ నజరానా ప్రకటించారు. భారత మహిళల హాకీ జట్టులో సభ్యులుగా ఉన్న ఒడిషాకు చెందిన అమ్మాయిలు సునీతా లక్రా, నమితా టొప్పో, లిలిమ మిన్జ్, డీప్ గ్రేస్‌లకు రూ. కోటి పారితోషికం ఇచ్చారు.

ఏషియాడ్ ఫైనల్ చేరిన హాకీ మహిళల జట్టు

ఏషియాడ్ ఫైనల్ చేరిన హాకీ మహిళల జట్టు

20 ఏళ్ల తర్వాత ఆసియా గేమ్స్‌లో ఫైనల్ చేరిన హాకీ మహిళల జట్టు తుది పోరులో జపాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పురుషుల జట్టు కంటే మెరుగైన ప్రదర్శనే కనబర్చింది ఉమెన్స్ టీం. వారికి ప్రోత్సాహకంగా ఈ నగదు నజరానా ఇవ్వబోతున్నట్టు ఒడిస్సా ప్రభుత్వాధికారులు ప్రకటించారు.

హాకీ ఇండియా పురుషుల, మహిళల జట్లకు స్పాన్సర్‌గా ఓడిషా

హాకీ ఇండియా పురుషుల, మహిళల జట్లకు స్పాన్సర్‌గా ఓడిషా

ఇదిలా ఉంటే, ప్రస్తుతం హాకీ ఇండియా పురుషుల, మహిళల జట్లకు ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం స్పాన్సర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. నవంబర్ 28 నుంచి జరగబోయే పురుషుల హాకీ వరల్డ్ కప్‌కు ఆతిథ్యం కూడా ఇవ్వనుంది. పతకాలు గెలిచిన ఆటగాళ్లతో పాటు కోచ్‌లకు కూడా ఒడిషా ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది. కోచ్‌లకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలను ప్రైజ్ మనీగా చెల్లించారు.

Story first published: Monday, September 3, 2018, 19:42 [IST]
Other articles published on Sep 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X