న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హాకీ వరల్డ్‌కప్: భారత్ శుభారంభం, దక్షిణాఫ్రికాపై ఘన విజయం

Hockey World Cup 2018: India Make Good Start, Beat South Africa 5-0 | Oneindia Telugu
Hockey World Cup 2018, India vs South Africa, Live Score: Manpreet Singh and Co start campaign with comfortable win

హైదరాబాద్: భువనేశ్వర్ వేదికగా ఆరంభమైన హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం చేసింది. భారీ అంచనాల మధ్య టోర్నీలోకి అడుగుపెట్టిన భారత్ తన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 5-0తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది. కొత్త కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలో భారత హాకీ జట్టు ఈ మ్యాచ్‌లో ఆద్యంతం తన దూకుడుని కనబర్చింది.

మ్యాచ్‌లో ఎక్కువ శాతం బంతిని తమ నియంత్రణలోనే ఉంచుకున్న భారత జట్టు పదే పదే దక్షిణాఫ్రికా గోల్‌పోస్టుపై దాడులు చేస్తూ ప్రత్యర్ధి జట్టుని ఉక్కిరిబిక్కిరి చేసింది. దీంతో భారత దాడిని అడ్డుకోవడానికి దక్షిణాఫ్రికాకు సమయం సరిపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు కనీసం ఒక గోల్ కూడా కొట్టలేకపోయింది.

మ్యాచ్ 10వ నిమిషంలోనే మన్‌దీప్ సింగ్ పెనాల్టీ కార్నర్‌ను గోల్‌‌గా మలిచి భారత్‌‌ని 1-0తో ఆధిక్యంలో నిలపగా.. తర్వాత రెండు నిమిషాల్లో అక్షదీప్‌సింగ్ గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 2-0కి చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా ఒక్కసారిగా ఒత్తిడిలోకి పడిపోయింది. ఆ తర్వాత భారత్‌కి గోల్ అవకాశం ఇవ్వకుండా పూర్తిగా డిఫెన్స్‌పైనే ఆధారపడింది.

అయితే, మ్యాచ్ 43వ నిమిషంలో సిమ్రాన్‌జీత్ సింగ్ గోల్ చేయగా, 45వ నిమిషంలో లలిత్, 46వ నిమిషంలో మళ్లీ సిమ్రాన్‌జీత్ వరుస గోల్స్‌‌ చేశారు. దీంతో భారత్ 5-0తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు గోల్స్ చేసిన సిమ్రాన్‌జీత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

తాజా విజయంతో దక్షిణాఫ్రికాపై తన విజయాల సంఖ్యను భారత్ మరింతగా మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు 11 సార్లు ముఖాముఖిగా తలపడ్డాయి. భారత్‌ ఏడు మ్యాచ్‌ల్లో గెలుపొందగా... దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్‌లో నెగ్గింది. మరో ఐదు మ్యాచ్‌లు 'డ్రా'గా ముగిశాయి.

ఈ టోర్నీలో మొత్తం 16 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ వరల్డ్‌కప్‌లో 19 రోజుల పాటు 36 మ్యాచ్‌లు జరగనున్నాయి. గ్రూపులో తొలి స్థానంలో నిలిచిన జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఒక్కో గ్రూపు నుంచి రెండు జట్లు క్రాస్ ఓవర్ మ్యాచ్‌ల ద్వారా తలపడి క్వార్టర్స్‌లోకి ప్రవేశిస్తాయి.

2010లో సొంతగడ్డపై జరిగిన వరల్డ్‌కప్‌లో దారుణంగా విఫలమై ఎనిమిదో స్థానంలో నిలిచిన భారత్‌, ఈసారి తొలి మ్యాచ్‌లోనే బోణీ చేసింది. ప్రపంచ హాకీ వరల్డ్‌కప్‌లో గత నాలుగు దశాబ్దాలుగా నెదర్లాండ్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా జట్లు హాకీలో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. 1994 సిడ్నీలో జరిగిన టోర్నీలో ఐదోస్థానంలో నిలువడం ఇప్పటివరకు మన అత్యుత్తమ ప్రదర్శన.

Story first published: Wednesday, November 28, 2018, 21:20 [IST]
Other articles published on Nov 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X