చివరి నుంచి మొదటి స్థానంలో భారత్.. ఫైనల్‌కు కష్టమే

Posted By:
Azlan Shah Cup: Australia outplay India 4-2

హైదరాబాద్: సుల్తాన్‌ అజ్లాన్‌ షా కప్‌లో భారత జట్టుకు వరుసగా రెండో పరాజయం ఎదురైంది. అదే తీరు, అదే వైఫల్యం.. ఓటమి నుంచి పాఠాలు నేర్వని భారత హాకీ జట్టు 2-4తో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచుకుందామనుకున్న సర్దార్ సింగ్ సేనకు భంగపాటు తప్పలేదు.


మంగళవారం తమ మూడో మ్యాచ్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ ఆస్ట్రేలియాపై 2-4 తేడాతో చిత్తుగా ఓడింది. సుల్తాన్ అజ్లాన్‌షా హాకీ టోర్నీలో భాగంగా లీగ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు భారత గోల్‌పోస్ట్‌పై వరుస దాడులు చేశారు. మొదటి మూడు రౌండ్లు ముగిసే సరికి 4 గోల్స్ సంధించారు. మార్క్ నోవ్లెస్, అరన్ జల్వెస్కి, డేనియల్, బ్లేక్‌లు తలో గోల్ చేశారు.

నాలుగో రౌండ్‌లో రమణ్‌దీప్ సింగ్ భారత్‌కు రెండు గోల్స్ అందించి వైట్‌వాష్‌ను తప్పించాడు. మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను రమణ్‌దీప్‌ సింగ్‌ (52, 53 నిమిషాల్లో) సాధించాడు. ఆసీస్‌కు వరుసగా ఇది మూడో విజయం. తొలి మ్యాచ్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి.. ఇంగ్లండ్‌పై డ్రా, ఇప్పుడు ఓటమితో భారత్‌ కేవలం ఒక్క పాయింట్‌తో ఐదో స్థానంలో ఉంది.

మరో రెండు మ్యాచ్‌లే మిగిలిఉన్న దశలో భారత్‌ ఫైనల్‌కు చేరడం దాదాపు అసాధ్యమే.. భారత్ బుధవారం మలేసియాతో తలపడుతుండగా, శుక్రవారం ఐర్లాండ్‌తో చివరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది.

Story first published: Wednesday, March 7, 2018, 9:07 [IST]
Other articles published on Mar 7, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి