న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారత్-పాక్‌ల హోరాహోరీ సమరానికి వేళైంది!!

Asian Hockey Champions Trophy, Preview: India To Face Pakistan In High-Voltage Final Clash

హైదరాబాద్: ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ హాకీలో ఆసక్తికర సమరానికి సమయం ఆసన్నమైంది. ఆధివారం డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను ఢీకొననుంది. శనివారం జరిగిన సెమీఫైనల్లో భారత్‌ 3-2తో జపాన్‌ను ఓడించగా.. పాకిస్థాన్‌ పెనాల్టీ షూటౌట్‌లో 3-1తో మలేసియాపై గెలిచింది. సెమీ ఫైనల్ పోరులో భాగంగా జరిగిన జపాన్‌తో మ్యాచ్‌లో ఆరంభం నుంచి భారత్‌దే ఆధిపత్యం కొనసాగింది.

ఇలా.. డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆసియా హాకీ చాంపియన్స్‌ ట్రోఫీలో నాలుగోసారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. జకార్తా ఆసియా క్రీడల విజేత జపాన్‌తో శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్‌ 3-2తో గెలిచింది.

భారత హాకీ జట్టు కోచ్ హరేంద్ర సింగ్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ శనివారం జపాన్‌తో తమ జట్టు తలపడే మ్యాచ్ పూర్తిగా కొత్త అనుభూతులను పంచుతుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా సహజమైన ఆటతీరుతోనే ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా పోరాడాలని తమ జట్టు ఆటగాళ్లకు దిశానిర్దేశం చేసినట్టు తెలిపాడు.

పాకిస్తాన్‌తో మ్యాచ్ అనే సరికి ఇరు జట్లు ప్రాక్టీసును తీవ్రతరం చేశాయి. అయితే ఇప్పటి వరకూ ఆడిన జట్ల కంటే పాకిస్తాన్ పటిష్టంగా ఉండటంతో భారత ప్లేయర్లు మరింత సీరియస్‌గా ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు.

Story first published: Sunday, October 28, 2018, 15:33 [IST]
Other articles published on Oct 28, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X