న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫాకు వేడికోళ్లు: ఫహాద్‌ను రిఫరీగా తొలగించాలని సౌదీ అప్పీల్

World Cup-bound referee Al Mirdasi handed life ban in Saudi Arabia

జెడ్డా: మరో 27 రోజుల్లో మాస్కో వేదికగా రష్యాలో నెల రోజుల పాటు సాగే సాకర్ సంరంభం కోసం ప్రపంచ దేశాల్లోని సాకర్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సాకర్ మ్యాచ్‌ల నిర్వహణ బాధ్యతల నుంచి రిఫరీ ఫహాద్ అల్ మిర్దాసీని తొలగించాలని 'ఫిఫా'ను సౌదీ అరేబియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఎస్ఎఎఫ్ఎఫ్) కోరింది.

ఇందుకు కారణం... ఒక మ్యాచ్ ఫలితాన్ని ప్రభావితం చేసేందుకు గాను రిఫరీ ఫహాద్ అల్ మిర్దాసీ ముడుపులు స్వీకరించడమే. దీంతో ఫహాద్ అల్ మిర్దాసీపై జీవిత కాలం నిషేధం విధిస్తూ ఎస్ఎఎఫ్ఎఫ్ నిర్ణయం తీసుకున్నది.

మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ముడుపులు తీసుకున్న ఫహాద్

మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ముడుపులు తీసుకున్న ఫహాద్

గత శనివారం సౌదీ అరేబియాలో అల్ ఇతిహాద్, అల్ ఫైసాలీ జట్ల మధ్య జరిగిన కింగ్స్ కప్ ఫైనల్స్ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడేందుకు ముడుపులు తీసుకున్న అల్ మిర్దాసీపై సాఫ్ సస్పెన్షన్ వేటు వేసింది. గమ్మత్తేమిటంటే ఫహాద్ అల్ మిర్దాసి ‘ఫిఫా' వరల్డ్ కప్ అధికారి. కానీ తాను తన జీవితంలో ఎటువంటి ఫుట్‌బాల్ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనలేదని మిర్దాసీ తెలిపాడు.

 ఫిఫాకు హమద్ అల్ సానియా లేఖ

ఫిఫాకు హమద్ అల్ సానియా లేఖ

మరోవైపు వచ్చే నెలలో రష్యాలో జరిగే సాకర్ కప్ టోర్నమెంట్ మ్యాచ్‌ల నిర్వహణ బాధ్యతల నుంచి అల్ మిర్దాసీని తొలగించి ఆయనపై విధించిన జీవిత కాల నిషేధాన్ని ఆమోదించాలని సాఫ్ కోరింది. ఈ మేరకు సౌదీ అరేబియా ఫుట్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు హమద్ అల్ సానియా ఫిఫాకు లేఖ రాశారు.

 ఇలా మిర్దాసీపై రుజువైన ఆరోపణలు

ఇలా మిర్దాసీపై రుజువైన ఆరోపణలు

అల్ మిర్దాసీ ముడుపులు తీసుకుంటున్నట్లు ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ ఆఫ్ సౌదీ అరేబియా, స్పోర్ట్స్ డైరెక్టరేట్ జనరల్ చైర్మన్, ఇతర దర్యాప్తు సంస్థలకు ఇతిహాద్ క్లబ్ అధ్యక్షుడు వాంగ్మూలం ఇచ్చారు. అల్ మిర్దాసీ ప్రస్తుతం సౌదీ అరేబియా కస్టడీలో ఉన్నాడు. ముడుపులు స్వీకరించిన విషయం తమ దర్యాప్తులో అంగీకరించాడని దర్యాప్తు సంస్థలు సౌదీ అరేబియా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి.

మెక్సికో, పోర్చుగల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో

మెక్సికో, పోర్చుగల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో

గతేడాది రష్యాలో జరిగిన కాన్ఫిడరేషన్స్ కప్‌లో రిఫరీగా వ్యవహరించిన అల్ మిర్దాసీ.. మెక్సికో, పోర్చుగల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో, 2016 ఒలింపిక్స్ గేమ్స్‌లోనూ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Story first published: Thursday, May 24, 2018, 11:02 [IST]
Other articles published on May 24, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X