పేరు పెట్టేశా, అంతటి గొప్పవాడైపోతాడు

Posted By:
Watch video - Kerala youth names newborn after Arsenals Mesut Ozil!

హైదరాబాద్: అభిమానం అవధులు దాటితే ఇలానే ఉంటదేమో.. ఎక్కడో ఫుట్‌బాల్ ఆటగాడంటే అభిమానం అని కన్న కొడుక్కి అతని పేరు పెట్టేశాడు. పోనీ అతనొక అమాయక చక్రవర్తా అంటే కాదు.. కేరళకు చెందిన ఇంజమామ్ ఉల్ హక్ అనే సివిల్ ఇంజినీర్. కేరళలోని మలప్పురం వాసి ఇంజమామ్ అతనికి జర్మనీకి చెందిన అర్సెనల్ జట్టు ఆటగాడు మిసట్ ఒజిల్ అంటే వీరాభిమానం. దీంతో అతని భార్య ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే అతను ఈ నిర్ణయం తీసుకున్నాడట.

 ఇందులో వింత ఉంది

ఇందులో వింత ఉంది

ఇదంతా సాధారణమైన విషయమే అనుకుంటాం. కానీ, ఇందులో వింత కూడా ఉంది. ఈ విషయం తెలుసుకున్న ఆ ఆటగాడు ఆ తల్లిదండ్రుల గురించి తెలుసుకొమ్మని కొందరిని కేరళలోని మలప్పురం ప్రాంతానికి పంపాడట. లండన్ లోని అర్సెనల్ నుంచి వచ్చి అతని అభిమానం గురించి ఓ వీడియో రూపంలో చిత్రీకరించి ఆ ఆటగాడి అభిమానులు క్రియేట్ చేసుకున్న మాధ్యమం ద్వారా అది అందరికీ తెలిసేలా పోస్టు చేశారు.

 ఒజిల్ పేరు పెట్టాలని ముందుగానే

ఒజిల్ పేరు పెట్టాలని ముందుగానే

పాకిస్థాన్ కెప్టెన్ పేరున్న అభిమాని అయిన ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ.. నా భార్య ప్రెగ్నెన్సీతో ఉండగానే అబ్బాయి పుడితే అర్సెనల్ జట్టు ఆటగాడైన ఒజిల్ పేరు పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నాం. రెండో ఛాయిస్‌గా ఈజిప్ట్ ఆటగాడైన మొహమ్మద్ ఎల్నెనీ పేరు అనుకున్నాం. కానీ, ఒజిల్ పేరును ఖరారు చేసేశాం.' అని తెలిపాడు.

ఎంతో నేర్పుతో ఎంచుకుంటాడు

ఆ వీడియోలో మాట్లాడుతూ.. గోల్ చేసేటప్పుడు ఒజిల్ మైదానంలోని ఖాళీ ప్రదేశాలను ఎంతో నేర్పుతో ఎంచుకుంటాడు. జట్టులోని మిగిలిన వాళ్లెవరికీ లేని ప్రత్యేకత అతనికి ఉంది. నా స్నేహితుల్లో కొందరు అర్సెన్ వెంజర్ అనే పేరును సూచించారు. కానీ, నేను స్వతహాగా కాస్త మతానికి సంబంధించిన పేరు కూడా కలిస్తే బాగుంటుందని ఆలోచించి ఒజిల్ పేరునే ఖరారు చేశాను. అసలు ఒజిల్ అంటే అర్థం సూచించేవాడని, జెన్యూన్ వ్యక్తి అని.

 ఫేమస్ ఆటగాడి పేరు పెట్టాను

ఫేమస్ ఆటగాడి పేరు పెట్టాను

ఇంజమామ్‌కు 2017 డిసెంబర్ 29న కొడుకు పుట్టాడు. ఆ చిన్నారికే ఇలా నామకరణం చేశాడు. కొడుకుకి అంతటి ఫేమస్ ఆటగాడి పేరు పెట్టాను. ఒకవేళ వాడు కోరుకుంటే ఫుట్‌బాల్ అంతటి ఆటగాడు అవడానికి తాను పూర్తిగా సహకరిస్తానని వివరించాడు.

Story first published: Monday, April 9, 2018, 18:28 [IST]
Other articles published on Apr 9, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి