న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పుట్‌బాల్ చరిత్రలొనే తొలిసారి: 1-0తేడాతో ఇరాక్‌పై నెగ్గిన భారత్

By Nageshwara Rao
Watch: Indian Under-16 Football Team Stun Asian Champions Iraq

హైదరాబాద్: అమ్మాన్ వేదికగా జరుగుతున్న ఆసియా అండర్-16 ఛాంపియన్‌షిప్‌లో భారత పుట్‌బాల్ జట్టు అద్భుతం చేసింది. పుట్‌బాల్ చరిత్రలోనే తొలిసారి ఆసియా ఛాంపియన్‌ అయిన ఇరాక్‌ను 1-0తో ఓడించింది. పుట్‌బాల్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా వయసు పరంగా చూసినప్పటికీ ఇరాక్‌పై భారత్‌ గెలవడం ఇదే తొలిసారి.

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో చివరి నిమిషంలో భువనేశ్‌ హెడర్‌ గోల్‌ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. కాగా, టోర్నీలో భాగంగా అంతకు ముందు జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 1-2తో ఒడినప్పటికీ, ఇరాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్లు ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగారు.

దీంతో ఈ మ్యాచ్ ఆద్యంతం అధ్బుత ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు ప్రత్యర్ధి జట్టుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. మ్యాచ్ అనంతరం జాతీయ జట్టు ప్రధాన కోచ్‌ బిబియానో ఫెర్నాండెస్‌ మాట్లాడుతూ ఈ విజయాన్ని ఏఐఎఫ్‌ఎఫ్‌ అకాడమీకి రాకముందు కుర్రాళ్లకు శిక్షణనిచ్చిన కోచ్‌లకు అంకితం చేస్తున్నట్టు తెలిపారు.

తమపై నమ్మకం ఉంచిన భారత్‌ ఫుట్‌బాల్‌ అభిమానులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇరాక్‌పై తొలి విజయం సాధించడంపై స్పందిస్తూ "ఫైనలైనా స్నేహపూర్వక మ్యాచైనా చివరి నిమిషంలో గోల్‌ చేయడం ఎప్పుడూ ప్రత్యేకమే" అని ఆయన తెలిపారు.

Story first published: Tuesday, August 7, 2018, 12:31 [IST]
Other articles published on Aug 7, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X