'మనస్సు లేకుండా సెక్స్ చేసినట్లుంది మీ తీరు'

Posted By:
VAR like sex without pleasure: ex-French international Lizarazu

హైదరాబాద్: ఆట ఓడిపోవడానికి కారణాలు ఎత్తి చూపడంలో విమర్శకులు ముందుంటారు. గెలిస్తే పరవాలేదు. కానీ, ఓడితే మాత్రం ప్రతి విషయం ఎత్తి చూపాలని ఆరాటపడుతుంటారు. ఇదే తరహాలో ఫ్రెంచ్ ఆటగాడైన బిక్సెంటె లిజరజు పారిస్ సెయింట్ జర్మన్ ఓటమికి వీఏఆర్ ఆటతీరు కారణమంటూ ఇలా పేర్కొన్నాడు. మనసు లేకుండా సెక్స్ చేసినట్లుందంటూ ఎద్దేవా చేస్తున్నాడు. వరుసగా ఐదో సారి జరుగుతోన్న లీగ్‌లో పారిస్ సెయింట్ జర్మైన్(పీఎస్‌జీ) జట్టు వివాదాస్పదంగా గోల్‌ను కోల్పోయింది.

మొనాకో జట్టు 3-0 స్కోరు తేడాతో పీఎస్‌జీ జట్టును ఓడించడంలో ఈ (వీఏఆర్) వీడియో అసిస్టెన్స్ రిఫరీ కీలక పాత్ర పోషించింది. చాలా సుదూరమైన రివ్యూ పరిశీలించిన అనంతరం ఎడిన్‌సన్ కావని మొనాకో జట్టుకు రెండు గోల్స్ సాధించడానికి కారణమైయ్యాడు. ఈ రివ్యూలో ఆటతీరును చూసిన క్లెమెంట్ టర్పిన్ మొదటి నిర్ణయాన్ని ఖరారు చేశాడు.

ఇలా జరగడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన బేయరన్ మునిచ్ ఆటగాడైన లిజరజు ఇలా వ్యాఖ్యానించాడు. 'వీఏఆర్ ఓ సెక్స్ చేసినట్లుగా అనిపిస్తోంది. అది మనసుపెట్టకుండా ముగించేసినట్లుగా అనిపిస్తోంది.'అని తన భావాన్ని వ్యక్తపరిచాడు. మొనాకో జట్టు అభిమానులు సైతం ఫాల్కో గోల్ ను చూసి ఆశ్యర్యాన్ని వ్యక్తం చేశారు.

కొన్ని సార్లు మనకి నచ్చకపోయినా చేయాల్సిన పనులుకొన్ని ఉంటాయని వాటిలో తప్పక పాల్గొనాల్సి ఉంటదని పేర్కొన్నాడు. ఇలాంటి వీడియో క్వాలిటీ లేని రివ్యూ సిస్టమ్ లతో చాలా నష్టముంటుందని, క్రీడాకారులకు సరైన న్యాయం జరగదని తెలిపాడు. ఈ విషయాన్ని టెలివిజన్ వీక్షకులకు, స్టేడియంలోని ప్రేక్షకులకు తెలియజేయాల్సిన అవసరముందని వివరించాడు.

Story first published: Monday, April 2, 2018, 13:20 [IST]
Other articles published on Apr 2, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి