పుట్‌బాల్ అంటే ప్రాణం: వద్దన్నందుకు రెండు రోజులు అన్నం తినలేదు

Posted By:

హైదరాబాద్: జీక్సన్‌ సింగ్‌.. ఫిఫా అండర్-17 వరల్డ్ కప్‌లో భారత్ తరుపున ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న అండర్‌-17 వరల్డ్ కప్‌లో తొలి గోల్‌ నమోదు చేసిన ప్లేయర్‌గా జీక్సన్‌ తౌనోజామ్‌ చరిత్ర సృష్టించాడు. టోర్నీలో భాగంగా కొలంబియాతో జరిగిన మ్యాచ్‌లో జీక్సన్‌ హెడ్డర్‌తో గోల్‌ చేసిన సంగతి తెలిసిందే.

మణిపూర్‌కు చెందిన జీక్సన్‌కు ఫుట్‌బాల్‌ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టం. ఒకసారి ఇంట్లోవాళ్లు పుట్ బాల్ వద్దని, చదువుపై దృష్టిపెట్టమని గట్టిగా మందలిస్తే.. రెండు రోజులపాటు అన్నం తినలేదట. అయితే తన కొడుక్కి ఇంత పేరు రావడం చూసి ఉబ్బితబ్బిబ్బవుతున్న జీక్సన్‌ తల్లి కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

రెండు రోజుల పాటు ఏమీ తినలేదు

రెండు రోజుల పాటు ఏమీ తినలేదు

జీక్సన్‌ తల్లి బిలాషిని దేవి, తండ్రి దేబెన్‌ సింగ్‌లు తమ కొడుకు ప్రభుత్వ అధికారి కావాలని అనుకుంటే.. అతడు మాత్రం ఫుల్‌బాల్‌ వైపే ఆకర్షితుడయ్యాడు. అంతకాదు గతంలో ఓసారి పుట్‌బాల్‌ ఆడొద్దన్నందుకు గాను జీక్సన్‌ రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉండిపోయినట్లు ఆమె వెల్లడించింది.

 జీక్సన్‌ ఐఏఎస్‌ అధికారి కావాలని మేం కోరుకున్నాం

జీక్సన్‌ ఐఏఎస్‌ అధికారి కావాలని మేం కోరుకున్నాం

'జీక్సన్‌ చిన్నతనంలో ప్రథమస్ధానంలో నిలిచేవాడు. జీక్సన్‌ అన్నయ్య అమర్‌జీత్‌ (భారత జట్టు కెప్టెన్‌) రెండో స్థానంలో నిలిచేవాడు. జీక్సన్‌ ఐఏఎస్‌ అధికారి కావాలని మేం కోరుకున్నాం. అతను నాలుగేళ్ల వయసు నుంచే ఫుట్‌బాల్‌ ఆడటం మొదలుపెట్టాడు. మా ఇంటి ముందు ఉన్న చిన్న మైదానంలో రోజంతా ఫుట్‌బాల్‌ ఆడుతుండేవాడు' అని ఆమె చెప్పింది.

 జీక్సన్‌ తండ్రి కూడా ఫుట్‌బాలరే

జీక్సన్‌ తండ్రి కూడా ఫుట్‌బాలరే

'ఆటలో పడి తిండి తినడం కూడా మరిచిపోయేవాడు. ఒక సమయంలో ఫుట్‌బాల్‌ ఆపేసి, చదువు మీద దృష్టిపెట్టమని అన్నందుకు రెండు రోజుల పాటు ఏమీ తినకుండా ఉన్నాడు. ఆ తర్వాత మేమెప్పుడూ అతడికి అడ్డు చెప్పలేదు. జీక్సన్‌ తండ్రి కూడా ఫుట్‌బాలరే కావడంతో ఆటలు వద్దంటూ అతన్ని ఒత్తిడి చేయలేదు' అని ఆమె తెలిపింది.

 రెండేళ్ల క్రితం జీక్సన్ తండ్రి దేబెన్‌కు గుండెపోటు

రెండేళ్ల క్రితం జీక్సన్ తండ్రి దేబెన్‌కు గుండెపోటు

మణిపూర్‌ పోలీస్‌ క్లబ్‌ తరఫున దేబెన్‌ మ్యాచ్‌లు ఆడేవాడు. రెండేళ్ల క్రితం దేబెన్‌కు గుండెపోటు రావడంతో బిలాషిని దేవి దుస్తులు అమ్మి కుటుంబాన్ని షోషిస్తోంది. తమది పేద కుటుంబమని, కొడుకు కనీస అవసరాలు కూడా తీర్చలేని దుస్థితిలో ఉన్నామని ఆమె ఎంతో ఆవేదనతో వెల్లడించింది.

చివరి లీగ్ మ్యాచ్‌లో ఘనాను ఓడిస్తాం

చివరి లీగ్ మ్యాచ్‌లో ఘనాను ఓడిస్తాం

ఇదిలా ఉంటే ఫిఫా అండర్‌-17 వరల్డ్ కప్‌లో భాగంగా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఘనాను ఓడించగలమన్న నమ్మకం తమకుందని జీక్సన్‌ సింగ్‌ ధీమా వ్యక్తం చేశాడు. 'ఘనాను ఓడించగలమన్న నమ్మకం మాకుంది. మేం సమష్టిగా ఆడి.. విజయం కోసం పోరాడతాం. కొలంబియాపై గోల్‌ సాధించినందుకు చాలా ఉద్వేగంగా ఉంది. ఆ మ్యాచ్‌లో మేం గెలవడానికి అర్హులం. కానీ ఓటమి పాలవడం నిరాశ కలిగించింది' అని జీక్సన్‌ అన్నాడు.

Story first published: Wednesday, October 11, 2017, 12:25 [IST]
Other articles published on Oct 11, 2017
Please Wait while comments are loading...
POLLS