రష్యా ఫిఫా టోర్నీ వైపు చూడొద్దు: సాకర్ అభిమానులకు అమెరికా ఆదేశాలు

Posted By:
Trump official: football fans should think twice about Russia World Cup

వాషింగ్టన్: వచ్చే జూన్ 14వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రష్యాలో జరిగే ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను వీక్షించేందుకు వెళ్లే ఫుట్‌బాల్ అభిమానులు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని అమెరికా హితవు చెప్పింది.రష్యాకు, పశ్చిమ దేశాలకు మధ్య దౌత్య సంక్షోభం సాగుతున్న తరుణంలో మ్యాచ్‌లు వీక్షించేందుకు వెళ్లడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని ఆ వైట్ హౌస్ అధికారి సూచించారు.

 రష్యా, పశ్చిమ దేశాలు పరస్పరం దౌత్యవేత్తల బహిష్కారం

రష్యా, పశ్చిమ దేశాలు పరస్పరం దౌత్యవేత్తల బహిష్కారం

సాలిస్‌బరిలోని ఒక నగరంలో మాజీ గూడచారి సెర్గెయి స్క్రిపాల్, ఆయన కూతురు యూలియా స్క్రైపాల్‌లపై విష ప్రయోగం జరిగిందని బ్రిటన్, దానికి తోడుగా యూరోపియన్ యూనియన్ (ఈయూ), అమెరికా దేశాలు మూకుమ్మడిగా రష్యా దౌత్యవేత్తలను బహిష్కరించాయి. దానికి ప్రతిగా అంతే సంఖ్యలో ఆయా దేశాల దౌత్యవేత్తలను రష్యా కూడా బహిష్కరించింది. ఇదే సంగతిని గుర్తు చేశారు వైట్ హౌస్ అధికారి.

 జూన్ 14 నుంచి రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం

జూన్ 14 నుంచి రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం

పశ్చిమ దేశాలకు, రష్యాకు మధ్య దౌత్య సంక్షోభం నూతన ప్రచ్ఛన్నయుద్ధం తరహా పరిస్థితులకు మారిన తరుణంలో జూన్ 14వ తేదీ నుంచి రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ జరుగనున్నది. 1936లో బెర్లిన్ ఒలింపిక్ గేమ్స్ సమయంలో అడాల్ఫ్ హిట్లర్ మాదిరిగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యవహరించవచ్చునని బ్రిటన్ విదేశాంగశాఖ మంత్రి బోరిస్ జాన్సన్ హెచ్చరించారు.

దౌత్యవేత్తలు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆందోళన

దౌత్యవేత్తలు లేకపోవడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని ఆందోళన

అమెరికా పౌరులను కాపాడుకోవడం తమ విధి అని వైట్ హౌస్ అధికారి పేర్కొన్నారు.ఇంతకుముందు నిరంతరం దౌత్యవేత్తలు పని చేస్తుండటంతో తమ దేశ పౌరులను కాపాడుకోగలిగే వాడినని, కానీ దౌత్య సంక్షోభం వల్ల ఆ పని చేయలేకపోతున్నామని, ఇతర దేశాల పౌరులకూ అదే పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. 2014లో బ్రెజిల్‌లో ఫిఫా టోర్నమెంట్ జరిగినప్పుడు బ్రిటన్ నుంచి 20 వేల మంది ఫుట్‌బాల్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు.వారందరికీ బ్రెజిల్‌లోని బ్రిటన్ దౌత్య కార్యాలయం అండగా ఉండేది. కానీ ప్రస్తుతం రష్యాలో పరిస్థితి చాలా భిన్నంగా ఉన్నదని వైట్ హౌస్ అధికారి చెప్పారు.

ఫిఫా టిక్కెట్లపై అన్ని రకాల సెక్యూరిటీ ఫీచర్లు

ఫిఫా టిక్కెట్లపై అన్ని రకాల సెక్యూరిటీ ఫీచర్లు

గతవారం ఫిఫా వచ్చే జూన్ నుంచి జరిగే రష్యా వరల్డ్ కప్ టిక్కెట్లను ఖరారు చేసింది. ఇందులో తప్పనిసరిగా వ్యక్తిగత సమాచారం, హోలోగ్రామ్స్, ప్రత్యేక బార్ కోడ్‌తో కూడిన సెక్యూరిటీ ఫీచర్లు చేర్చారు. అలాగే మ్యాచ్ సంబంధ సమాచారంలో తేదీ, స్టేడియం, టైం కూడా ప్రతి టిక్కెట్ పైనా ముద్రిస్తారు. అంతేకాదు ప్రతి టిక్కెట్‌పై సీట్ ఏర్పాట్లు కూడా ఉంటాయి. టిక్కెట్ కొనుగోలు దారు పేరు కూడా ఉంటుంది. కనుక ఫుట్ బాల్ అభిమానులు.. మ్యాచ్ చూడటానికి వచ్చేవారు రిజిస్టర్డ్ సంస్థ ద్వారా కొన్న టిక్కెట్, ఫాన్ ఐడీ అన్ని వివరాలు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుందని నిర్వాహకులు తేల్చి చెప్పారు.

18 నుంచి చివరి దశ ఫిఫా టిక్కెట్ల విక్రయం

18 నుంచి చివరి దశ ఫిఫా టిక్కెట్ల విక్రయం

నకిలీ టిక్కెట్ల బెడదను అరికట్టేందుకు అదనంగా ఎలక్ట్రానిక్ టిక్కెట్ వాల్యుడేషన్ కూడా అమలు చేస్తారు. టోర్నమెంట్ ప్రారంభానికి కొన్ని వారాల ముందే టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి ఉచితంగా బట్వాడా చేసే ప్రక్రియనూ ఫిఫా వరల్డ్ కప్ నిర్వాహకులు చేపట్టారు. చివరిక్షణంలో టిక్కెట్లు కొనుగోలు చేసే వారికి ఫిఫా వెన్యూ టిక్కెటింగ్ సెంటర్ల వద్ద ఈ నెల 18 నుంచి విక్రయిస్తారు.

‘ఫిఫా డాట్ కాం/టిక్కెట్స్‌'లో అందుబాటులోనూ టిక్కెట్లు రెడీ

‘ఫిఫా డాట్ కాం/టిక్కెట్స్‌'లో అందుబాటులోనూ టిక్కెట్లు రెడీ

తమ అధికారిక వెబ్ సైట్ నుంచి కొనుగోలు చేసిన టిక్కెట్లు మాత్రమే చెల్లుబాటవుతాయని ఫిఫా తేల్చేసింది. ఇతర మార్గాల్లో కొనుగోలు చేసిన టిక్కెట్లు ఎంతమాత్రమూ చెల్లబోవని పేర్కొన్నది. ఈ మేరకు టిక్కెటింగ్ వెబ్ సైట్ నిర్వాహక సంస్థ వియాగోగోకు ప్రాథమికంగా నిషేధాజ్ఞలు కూడా జారీ చేసింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మాస్కోలోనూ, ‘ఫిఫా డాట్ కాం/టిక్కెట్స్‌'లో అందుబాటులో ఉంటాయి. కనుక అభిమానులు తమ ఫాన్ ఐడీ కార్డును గుర్తు పెట్టుకుని పేర్లు నమోదు చేసుకోవాలి.

Story first published: Thursday, April 12, 2018, 11:27 [IST]
Other articles published on Apr 12, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి