న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

సాకర్ ముంగిట టాప్ జట్ల ర్యాంకుల్లో నో చేంజ్ !!

Top ten of global football teams unchanged in FIFA’s monthly World Ranking’s May edition

హైదరాబాద్: సాకర్ సంరంభానికి మరో 25 రోజులే మిగిలి ఉన్నది. ఆతిథ్య కమిటీ అందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇస్తున్న రష్యా ర్యాంకు ఏప్రిల్, మే నెలల్లో ఏ మాత్రం మారలేదు. మార్చి నెలలో స్థిర పడిన 66వ ర్యాంకు వద్దే రష్యా స్థిరపడింది. టాప్ టెన్ దేశాల జాబితాలో ఉన్న జట్ల ర్యాంకులు యధాతథంగానే ఉన్నాయి. అంతే కాదు టాప్ - 50 దేశాల జట్ల ర్యాంకులు కూడా అలాగే కొనసాగుతున్నాయని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది.

కొన్ని జట్ల ర్యాంకుల్లోనే మార్పు

కొన్ని జట్ల ర్యాంకుల్లోనే మార్పు

గత నెలాఖరులోగా అంతర్జాతీయంగా కేవలం ఏడు ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లు జరిగాయని ఫిఫా ఒక ప్రకటనలో తెలిపింది. కొన్ని జట్ల ర్యాంకులు మినహా మిగతా అన్ని ర్యాంకులు అలాగే ఉన్నాయని పేర్కొన్నది. జర్మనీ, బ్రెజిల్, బెల్జియం జట్లు మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయని వివరించింది.

టాప్ టెన్‌లో జర్మనీ తర్వాతీ స్థానంలో బ్రెజిల్.. ఆ పై బెల్జియం

టాప్ టెన్‌లో జర్మనీ తర్వాతీ స్థానంలో బ్రెజిల్.. ఆ పై బెల్జియం

ఫిఫా టాప్ టెన్ ర్యాంకుల్లో నిలిచిన వరల్డ్ చాంపియన్స్ జర్మనీ 1,544, బ్రెజిల్ 1384, బెల్జియం 1346, పోర్చుగల్ జట్టు 1306, అర్జెంటీనా 1254, స్విట్జర్లాండ్ 1,179, ఫ్రాన్స్ 1166, స్పెయిన్ 1162, చిలీ 1146, పోలండ్ 1128 పాయింట్లతో మొదటి స్థానాల్లో నిలిచాయి. సాకర్ సంరంభానికి ఆతిథ్యం ఇవ్వనున్న రష్యా గత నెలలో ఎటువంటి ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడలేదు. దీంతో 493 పాయింట్లతో 66వ ర్యాంకు వద్దే స్థిరపడింది. వాస్తవమేమిటంటే తొలి 47 ర్యాంకుల్లో ఎటువంటి మార్పు జరుగలేదు. కానీ 160వ ర్యాంకులో ఉన్న కువైట్ జట్టు.. పాలస్తీనా జట్టుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో 2 -0 స్కోర్ తో విజయం సాధించడంతో 16 ర్యాంకులు పెరిగిందని పేర్కొంది.

సెయింట్ పీటర్స్‌బర్గ్ ఫుట్‌బాల్ పార్క్ ప్రారంభం

సెయింట్ పీటర్స్‌బర్గ్ ఫుట్‌బాల్ పార్క్ ప్రారంభం

సెయింట్ పీటర్స్‌బర్గ్‌లోని ఫుట్‌బాల్ పార్క్‌ను సాకర్ రష్యా స్థానిక నిర్వాహక కమిటీ చైర్మన్ ఆర్కాడీ డ్వోర్కోవిచ్ ప్రారంభించారు. పైనెర్స్కాయా స్క్వేర్‌లోని సెయింట్ పీటర్స్ బర్గ్‌ ఫుట్ బాల్ పార్కును ప్రారంభించారు. తదుపరి దశలో కలినింగ్రాడ్‌లోని ఫుట్ బాల్ పార్క్ సందర్శకుల కోసం తెరువనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రష్యా సాకర్ కప్ మస్కట్ ‘జాబివాకా ది వోల్ప్' కూడా పాల్గొంది.

సందర్శనకు వచ్చిన చిన్నారులతో కలిసి:

సందర్శనకు వచ్చిన చిన్నారులతో కలిసి:

ఆర్కాడీ డ్వోర్కోవిచ్‌ మాట్లాడుతూ ఫార్వర్డ్ మాజీ ప్లేయర్ డిమిట్రీ స్యెచెవ్, రష్యా ప్రజల కళాకారులు వాసిలీ గెరెల్లో, అర్జెంటీనా ఫార్మర్ ఫార్వర్డ్ హెర్నాన్ క్రెస్పో తదితరులు ఈ పార్కును సందర్శించనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పార్కు సందర్శనకు వచ్చిన చిన్నారులతో కలిసి ఆడి పాడారు. ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పార్కులో గ్రూపు ‘డీ'లో భాగంగా నైజీరియా జట్టుతో అర్జెంటీనా జట్టు జూన్ 26వ తేదీన ఆడనున్నది.

Story first published: Wednesday, May 23, 2018, 14:21 [IST]
Other articles published on May 23, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X