డబ్బుతో అత్యాచార ఆరోపణలు పక్కదారి: రొనాల్డోపై మోర్గాన్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: పోర్చుగల్ దిగ్గజ ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రోనాల్డో ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో ఒకడు కాదు అని అమెరికా మహిళల జాతీయ జట్టు కెప్టెన్ అలెక్స్ మోర్గాన్ పేర్కొంది. సెప్టెంబర్ 23న మిలన్‌లో ప్రదర్శించబోయే ఫిఫా 'ది బెస్ట్' గాలాకు ముగ్గురు ఉత్తమ ఆటగాళ్ళ నామినీలలో అలెక్స్ మోర్గాన్ కూడా ఎంపికయింది. ఈ సందర్భంగా యుఎస్ కెప్టెన్ మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక పార్టీ.. బ్రావోతో కలిసి లుంగీ డ్యాన్స్‌ చేసిన షారుక్‌ ఖాన్‌!!

అలెక్స్ మోర్గాన్ మాట్లాడుతూ... 'నేను మిలాన్‌లో కలుసుకోబోతున్న వారికంటే భిన్నంగా క్రిస్టియానో రొనాల్డోను సంప్రదించాలని నేను అనుకోవట్లేదు. ఈ రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో మాట్లాడుతున్నారు. మహిళలకు మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. ప్రస్తుతం చాలా మంది ఎవరు ఒప్పో, ఎవరు తప్పో అని ప్రశ్నిస్తున్నారు. రొనాల్డో విషయాన్నే తీసుకుంటే.. అతనిపై వచ్చిన క్రిమినల్ ఆరోపణలు కప్పిపుచ్చబడ్డాయి. చివరకు డబ్బు ఏదైనా చేయిస్తోంది. కేసు లేనందున అతడు ఆటలో కొనసాగుతున్నాడు' అని మోర్గాన్ తెలిపారు.

'క్రిస్టియానో రోనాల్డో ప్రపంచంలోని అత్యుత్తమ ఫుట్ బాల్ ఆటగాళ్ళలో ఒకడు అని నేను అనుకోను. అతడు మైదానంలో ప్రజలను అలరించడం తప్ప ఒక వ్యక్తిగా ఏమీ చేయలేదు' అని మోర్గాన్ పేర్కొన్నారు. రొనాల్డోపై వచ్చిన అత్యాచారం అభియోగం కొద్ది యేళ్ల క్రితం సాకర్ ప్రపంచంలో ప్రకంపనలు రేపింది. గత సంవత్సరం అమెరికాకు చెందిన ఒక మోడల్ రోనాల్డో తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది. అది కూడా పదేళ్ల క్రితం తనను రొనాల్డో అత్యాచారం చేశాడని చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. ఈ మేరకు ఆ మోడల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐతే ఆ మోడల్‌కు రొనాల్డో అప్పట్లోనే భారీగా డబ్బులు ఇచ్చి ఈ వ్యవహారం బయటకు రాకుండా సెటిల్ చేసుకున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Tuesday, September 10, 2019, 14:27 [IST]
Other articles published on Sep 10, 2019
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X