న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

పుట్‌బాల్ మ్యాచ్‌లకు అనుమతి: సౌదీ మహిళలకు రాజు మరో వరం

By Nageshwara Rao
Saudi Arabia to allow women to watch football matches in stadiums from January 12

హైదరాబాద్: ఏంటో! ఈ మధ్య కాలంలో సౌదీ ప్రభుత్వం అక్కడి మహిళలకు వరాలను ప్రకటిస్తోంది. మొన్నటికి మొన్న మహిళలు కారు డ్రైవింగ్ నేర్చుకోవచ్చని చెప్పిన ప్రభుత్వం తాజాగా స్టేడియాలకు వెళ్లి పుట్‌బాల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు గాను అనుమతి ఇచ్చింది.

ఈ మేరకు అక్కడి ప్రభుత్వం సోమవారం (జనవరి 8) అధికారిక ప్రకటన చేసింది. శువారం (జనవరి 12)న ఆల్-అహీ vs ఆల్-బతిన్ జట్ల మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌ని మహిళలు వీక్షించేందుకు అనుమతి ఇచ్చారు. తొలి మ్యాచ్‌కి సౌదీ రాజధాని రియాథ్‌ ఆతిథ్యమిస్తోంది.

ఆ మరుసటి రోజే జరిగే రెండో మ్యాచ్‌కి జెడ్డా ఆతిథ్యమిస్తోండగా, జనవరి 18న జరగనున్న మూడో మ్యాచ్‌కి ఈస్ట్రన్ సిటీ అయిన దమ్మమ్ ఆతిథ్యమిస్తోంది. నిజానికి సౌదీలో మహిళల పట్ల కఠిన ఆంక్షలు ఉంటాయి. గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా సౌదీ అరేబియా నేషనల్ డే రోజున మహిళలను రియాధ్‌లోని స్పోర్ట్స్ స్టేడియంలోపలికి అనుమితిచ్చారు.

సౌదీ రాజుగా మహ్మమద్ బిన్ సల్మాన్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే అక్కడి మహిళలు ఈ మాత్రం స్వేచ్ఛను అన్నా పొందగలుగుతున్నారు. అంతకముందు మహిళల పట్ల ఆంక్షలు మరింత కఠినంగా ఉండేవి.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, January 9, 2018, 13:24 [IST]
Other articles published on Jan 9, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X