న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

'జెరూసలెంలో ఆడితే దుస్తులు కాల్చేస్తాం'

Palestinian soccer chief urges fans to burn Messi posters if he plays in Israel

హైదరాబాద్: జూనె రెండో వారంలోని శనివారం అర్జెంటీనా, ఇజ్రాయెల్ మధ్య జరగబోయే వరల్డ్‌కప్ వార్మప్ మ్యాచ్ రాజకీయ రంగు పులుముకుంది. ఈ మ్యాచ్ జెరూసలెంలో జరగనుంది. ఈ విషయాన్ని పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ ఆడితే.. అతని జెర్సీలు తగలబెట్టండి అని అసోసియేషన్ చీఫ్ జిబ్రిల్ రజౌబ్ అభిమానులను కోరిన విషయం వివాదానికి దారి తీసింది.

ఈ మ్యాచ్‌కు వేదికగా జెరూసలెంలోని టెడ్డీ కొలెక్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే ఈ వార్మప్ మ్యాచ్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ ఆడుతుండటంతో మ్యాచ్‌కు ఎక్కడి లేని క్రేజ్ వచ్చింది.

రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని:

రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారని:

ఇజ్రాయెల్ అభిమానులు మెస్సీ కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ను ఇజ్రాయెల్ తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని విమర్శిస్తూ పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ చీఫ్ జిబ్రిల్.. అర్జెంటీనా అసోసియేషన్ చీఫ్ క్లాడియో తపియాకు ఓ లేఖ రాశారు.

జెరూసలెంను రాజకీయ రాజధానిగా

జెరూసలెంను రాజకీయ రాజధానిగా

పాలస్తానియన్లు ఎప్పటి నుంచో తూర్పు జెరూసలెంను రాజకీయ రాజధానిగా చేసుకోవాలని భావిస్తున్నారు. నిజానికి ఈ మ్యాచ్ హైఫాలో జరగాల్సి ఉన్నా.. ఇజ్రాయెల్ అధికారులు మ్యాచ్‌ను జెరుసలెంకు తరలించేలా ఒత్తిడి తీసుకొచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇజ్రాయెల్ రాజధానిగా జెరుసలెంను గుర్తించినప్పటి నుంచీ పాలస్తీనియన్లు రగిలిపోతున్నారు. ఇప్పటికే అమెరికా ఎంబసీని కూడా జెరూసలెంకు తరలించారు.

ఇజ్రాయెల్ 70వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్

ఇజ్రాయెల్ 70వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్

మ్యాచ్ ఆ వివాదాన్ని మరింత పెద్దది చేసేలా ఉంది. ఓ సాధారణ మ్యాచ్‌ను ఇజ్రాయెల్ తమ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నదని, ఇజ్రాయెల్ 70వ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో భాగంగా ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నారని పాలస్తీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ చీఫ్ రజౌబ్ ఆరోపించారు.

అర్జెంటీనా, మెస్సీలకు వ్యతిరేకంగా ప్రచారం

అర్జెంటీనా, మెస్సీలకు వ్యతిరేకంగా ప్రచారం

ఆదివారం నుంచి అర్జెంటీనా టీమ్, మెస్సీలకు వ్యతిరేకంగా ఆయన ప్రచారం మొదలుపెట్టారు. అతనికి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉందని అందుకే అతన్ని వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నామని ఆయన చెప్పారు. మెస్సీ రాడనే అనుకుంటున్నామని, వస్తే మాత్రం అతని ఫొటోలు, జెర్సీలు తగలబెడతామని హెచ్చరించారు.

Story first published: Monday, June 4, 2018, 15:36 [IST]
Other articles published on Jun 4, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X