67 రోజుల్లో సాకర్ సంరంభం: రష్యాకు లక్షపైనే కొరియా ఫ్యాన్స్ తాకిడి

Posted By:
Over 100,000 South Korean football fans expected at FIFA World Cup

మాస్కో: మరో 67 రోజుల్లో సాకర్ సంరంభం ప్రారంభం కానున్నది. ఆతిథ్య దేశం రష్యా జట్టుతో సౌదీ అరేబియా జట్టు జూన్ 14వ తేదీన ఢీకొనడంతో 'ఫిఫా-2018' ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానున్నది. ప్రారంభ మ్యాచ్ రష్యా రాజధాని మాస్కో నగరంలోనే జరుగనున్నది.

ఈ సందర్భంగా రష్యాలోని 11 నగరాలను చుట్టి వచ్చేందుకు లక్ష మందికి పైగా ఫుట్‌బాల్ అభిమానులు దక్షిణ కొరియా నుంచి రష్యాకు వస్తారని అంచనా. ఈ విషయాన్ని రష్యాలోని దక్షిణ కొరియా రాయబార కార్యాలయం కాన్సుల్ జనరల్ కిమ్ సాయి వూంగ్ ధ్రువీకరించారు.

రష్యాకు అభిమానుల తాకిడి పెరిగే చాన్స్ ఉన్నదన్న కొరియా రాయబారి

రష్యాకు అభిమానుల తాకిడి పెరిగే చాన్స్ ఉన్నదన్న కొరియా రాయబారి

రష్యాలోని సారాటోవ్ సిటీకి వచ్చేందుకు దక్షిణ కొరియా నుంచి 1,00,500 మంది దక్షిణ కొరియన్లు టిక్కెట్లు బుక్ చేశారని తెలిపారని ‘టాస్' వార్తాసంస్థ తెలిపింది. రష్యాకు వచ్చే ఫుట్ బాల్ అభిమానుల సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. గతేడాది డిసెంబర్ ఒకటో తేదీన 2018 ఫిఫా వరల్డ్ కప్ తుది డ్రాను మాస్కోలోని క్రెమ్లిన్ ప్యాలెస్‌లో తీశారు. చాంపియన్లు జర్మనీ, స్వీడన్, మెక్సికోలతోపాటు దక్షిణ కొరియా జట్టుకు గ్రూప్ ఎఫ్‌లో చోటు దక్కింది. మాస్కోలో ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభానికి మరో 67 రోజులు మాత్రమే ఉంది.

ఇమేజ్ ఆదాయం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రొనాల్డో పెట్టుబడులు

ఇమేజ్ ఆదాయం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో రొనాల్డో పెట్టుబడులు

రియల్ మాడ్రిడ్ స్టార్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డోపై ఉన్న పన్ను ఎగవేత కేసుల్లో ఒకదానిని ఉపసంహరించుకునే విషయాన్ని స్పెయిన్ పన్నులశాఖ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ క్రిస్టియానో రొనాల్డో జైలుశిక్షను అంగీకరిస్తేనని పన్ను అధికారులు చెబుతున్నారు. గతేడాది ఆయన 14.7 మిలియన్ల యూరోల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. తన ‘ఇమేజ్ (ఫొటో)' హక్కుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును రొనాల్డో.. పన్ను ఎగవేత దారులకు స్వర్గధామం బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్‌లో పెట్టుబడులు పెట్టారని వార్తలొచ్చాయి.

 రొనాల్డోపై కేసు ఉపసంహరణకు యత్నాలిలా

రొనాల్డోపై కేసు ఉపసంహరణకు యత్నాలిలా

కానీ తాను ఉద్దేశపూర్వకంగా పన్ను ఎగవేతకు పాల్పడలేదని రొనాల్డో తేల్చి చెప్పారు. స్వచ్ఛందంగానే పన్ను చెల్లింపులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. అయితే పన్ను శాఖ అధికారులతో తుది పరిష్కారం కోసం రొనాల్డో, ఆయన సలహాదారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రొనాల్డోపై క్రిమినల్ కేసుల నమోదును ఉపసంహరించేందుకు పొరపాటు జరిగిందని అంగీకరిస్తూ 3.8 మిలియన్ల యూరోలు చెల్లించాలని అర్జెంటీనా ఎస్టాటాల్ డీ అడ్మినిస్ట్రేషన్ ట్రిబుటేరియా (ఏఇఎటి) ప్రతిపాదించినట్లు సమాచారం. 3.4 మిలియన్ల యూరోల చెల్లింపు ప్రతిపాదనను ట్రెజరీ తిరస్కరించిందని తెలియ వచ్చింది. ఈ వార్తలను రొనాల్డో తిరస్కరించాడు. ఇంత జరిగిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన రొనాల్డో ‘బూటకపు వార్తలతో నా అందమైన జీవితాన్ని నాశనం చేయాలని చూడొద్దు' అని వ్యాఖ్యానించాడు.

Story first published: Saturday, April 7, 2018, 10:54 [IST]
Other articles published on Apr 7, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి