న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

కరోనా ఎఫెక్ట్.. కూరగాయలు పండిస్తున్న మాజీ కెప్టెన్‌!!

 Organic Farming Keeping Former Footballer Gouramangi Singh Fresh During Coronavirus Lockdown

ఢిల్లీ: కరోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు మూడు నెలల పాటు క్రీడాలోకం నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ప్ర‌తిష్టాత్మ‌క ఒలింపిక్స్‌తో పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కూడా నిర‌వ‌ధిక వాయిదా ప‌డింది. వైరస్ వ్యాప్తి కారణంగా అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లు అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్‌లో ప్రస్తుత, మాజీ క్రీడాకారులు కొందరు సోషల్ మీడియా వేదికగా లైవ్ చాట్‌లు నిర్వహిస్తుంటే.. మరికొందరు వివిధ పనులతో బిజీగా గడుపుతున్నారు. భారత ఫుట్‌బాల్‌ జట్టు మాజీ కెప్టెన్‌ గౌర్‌మాంగీ సింగ్‌ వ్యవసాయం చేస్తున్నాడు.

 కూరగాయలు పండిస్తున్నాం:

కూరగాయలు పండిస్తున్నాం:

శారీరకంగా, మానసికంగా నూతనోత్సాహం పొందడానికి వ్యవసాయాన్ని మార్గంగా ఎంచుకున్నాడట ‌గౌర్‌మాంగీ సింగ్‌. ఈ విరామ సమయంలో ఇంఫాల్‌లోని తన సొంత స్థలంలో సోదరులతో కలిసి సేంద్రీయ సేద్యం చేస్తూ కూరగాయలు పండిస్తున్నాడు. 'ఏఐఎఫ్ఎఫ్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌర్‌మాంగీ మాట్లాడుతూ... 'మా ఇంటి నుంచి కొద్ది దూరంలో మాకు కొద్దిగా స్థలం (ఎకరం) ఉంది. గత రెండేళ్ల నుంచి అక్కడ కొన్ని కూరగాయలు పండిస్తున్నాం. ఈ లాక్‌డౌన్‌ వల్ల సమయం లభించడంతో మరింత దృష్టి పెట్టాం' అని తెలిపాడు.

వ్యవసాయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా:

'మా సోదరులతో కలిసి ఈ సారి మిరప, పసుపు, అల్లం, దోసకాయ, మొక్కజొన్న, గుమ్మడి, కాకరకాయ లాంటి విభిన్న రకాల పంటలను పెంచుతున్నాం. సేంద్రీయ పద్ధతుల్లో చేస్తున్న ఈ వ్యవసాయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నా. తోట (గార్డెన్)‌లో పని చేయడం ఎప్పుడూ సరదాగానే ఉంటుంది. రోజూ కొన్ని గంటల పాటు అక్కడే గడుపుతున్నా. చాలా బాగుంది. విత్తనాలు వేయడం దగ్గర నుంచి కూరగాయలు కోయడం వరకూ.. ఇలా అన్ని పనులు చేయడం మనసుకు ప్రశాంతతను ఇస్తోంది' అని గౌర్‌మాంగీ సింగ్ చెప్పాడు.

 స్నేహితులు వాటా అడుగుతున్నారు:

స్నేహితులు వాటా అడుగుతున్నారు:

'మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతున్నందుకు సంతృప్తిగా ఉంది. ఇప్పుడు అన్ని కూరగాయలు గార్డెన్నుంచి తెచ్చుకోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్‌లో ఈ వ్యవసాయాన్ని విస్తరించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నా. మా స్నేహితులు వాటా అడుగుతున్నారు' అని మాజీ డిఫెండర్ గౌర్‌మాంగీ చెప్పాడు. శారీరకంగా, మానసికంగా తాజాగా ఉండటానికి ఇది మంచి మార్గం అని అభిప్రాయపడ్డాడు. లాక్‌డౌన్ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి కూడా వీలు కల్పిస్తుందన్నాడు. గౌర్‌మాంగీ.. సెకండ్‌ డివిజన్‌ లీగ్‌ జట్టు బెంగళూరు ఎఫ్‌సీకి ప్రధాన కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 2013లో చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన గౌర్‌మాంగీ భారత్‌ తరఫున 71 మ్యాచ్‌లు ఆడాడు.

 ఓ గుణపాఠం నేర్పింది:

ఓ గుణపాఠం నేర్పింది:

కరోనా వైరస్ ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా అందరికి ఓ గుణపాఠం నేర్పిందని, జీవిత కాలానికి సరిపోయే ఎన్నో విషయాలను తెలియజేసిందని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తాజాగా తెలిపాడు. మహమ్మారి తనలో మానవత్వాన్ని తట్టిలేపిందని, అందుకే కొంత పొలం కొని, పేదల కోసం పంటలు పండించాలని అనుకుంటున్నాని చెప్పాడు. కేవలం డబ్బు సంపాదించడానికే మనం బతకడం లేదని, ఇతరులకు సాయం చేయడం కూడా మన బాధ్యత అని స్పష్టం చేశాడు.

కరోనా నెగటివ్‌ వస్తే.. ఉమ్మికి అనుమతించొచ్చు: అగార్కర్‌

Story first published: Tuesday, June 16, 2020, 9:39 [IST]
Other articles published on Jun 16, 2020
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X