న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

డిమాండ్ బాగానే ఉంది: పుట్‌బాల్ కోచ్ పదవికి వెల్లువెత్తిన దరఖాస్తులు

More than 250 applicants for Indian football team coach’s job

హైదరాబాద్: సునీల్ ఛెత్రి నాయకత్వంలోని భారత పుట్‌బాల్ జట్టు ఈ మధ్య కాలంలో మంచి విజయాలను నమోదు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 'ఫిఫా' ర్యాంకింగ్స్‌లో భారత జట్టు 103వ స్థానంలో కొనసాగుతోంది. ఎఎఫ్‌సి ఆసియా కప్‌లో భారత జట్టు నాకౌట్‌ దశకు చేరలేదు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

 స్టీఫెన్‌ కాన్‌స్టాంటైన్‌ రాజీనామా

స్టీఫెన్‌ కాన్‌స్టాంటైన్‌ రాజీనామా

ఇందుకు బాధ్యత వహిస్తూ కోచ్‌ స్టీఫెన్‌ కాన్‌స్టాంటైన్‌ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్‌) కోచ్‌ పదవి కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. అయితే, ఈ కోచ్ పదవికి సుమారు 250 మంది దరఖాస్తు చేసుకోవడం విశేషం. మార్చి 29తో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది.

యూరప్‌కు చెందిన పలువురు ప్రముఖ కోచ్‌లు కూడా

యూరప్‌కు చెందిన పలువురు ప్రముఖ కోచ్‌లు కూడా

అయితే, భారత పుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా వ్వవహారించడానికి యూరప్‌కు చెందిన పలువురు ప్రముఖ కోచ్‌లు కూడా తమ దరఖాస్తులను పంపడం విశేషం. దరఖాస్తు చేసుకున్నవారిలో ఇండియన్‌ సూపర్‌ లీగ్, ఐ లీగ్‌లలో కోచ్‌లుగా వ్యవహరించినవారు కూడా ఉన్నారు.

కోచ్ రేసులో ఆల్బర్ట్‌ రోకా ముందంజలో

కోచ్ రేసులో ఆల్బర్ట్‌ రోకా ముందంజలో

గియోవానీ బియాసీ (ఇటలీ), హాకెన్‌ ఎరిక్సన్‌ (స్వీడన్‌), రేమండ్‌ డామ్‌నెక్‌ (ఫ్రాన్స్‌), స్యామ్‌ అలార్డీస్‌ (ఇంగ్లండ్‌) తదితరులు ఈ జాబితాలో ఉన్నారు. అయితే, ఈ కోచ్ రేసులో ఆల్బర్ట్‌ రోకా ముందు వరుసలో ఉన్నారు. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఈయన బెంగళూరు ఎఫ్‌సీ జట్టుకు కోచ్‌గా ఉన్నారు.

ఐఎస్ఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న బెంగళూరు

ఐఎస్ఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న బెంగళూరు

ఆల్బర్ట్‌ రోకా సారథ్యంలోని బెంగళూరు ఎఫ్‌సీ జట్టు ఈ ఏడాది ఐఎస్ఎల్ టైటిల్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పైనల్లో గోవా ఎఫ్‌సి జట్టుపై విజయం సాధించింది. మరోవైపు పేరు ప్రఖ్యాతులకంటే భారత జట్టు అవసరాలకు అనుగుణంగా కోచ్‌ను ఎంపిక చేస్తామని ఏఐఎఫ్‌ఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కుశాల్‌ దాస్‌ వెల్లడించారు.

Story first published: Thursday, April 4, 2019, 14:50 [IST]
Other articles published on Apr 4, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X