న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

జట్టుకు యజమానిలా కాదు ఓ పెద్దన్నలా ఉన్నా: మినెర్వా ఎఫ్‌సీ

Minerva FC owner Ranjit Bajaj carries water for players, takes motivational classes

హైదరాబాద్: అందరి యజమానుల్లా ఆజ్ఞలు జారీ చేసి మీరిది చేయాల్సిందే అని చెప్పే మనిషి కాదు. జట్టుకు ఓ పెద్దన్నలా ఉంటాడు. నీళ్లు అందిస్తాడు. ఆరోగ్యం బాగుండకపోతే ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఖాళీ సమయాల్లో ప్రేరణాత్మకమైన తరగతులు చెబుతాడు. జట్టు విజయం కోసం ఏదైనా చేయడానికి సిద్ధం అంటున్నాడు. ఈ మినెర్వా జట్టు యజమాని రంజిత్ బజాజ్.

జట్టు స్థాపకుడు, ముఖ్య కార్య నిర్వహణాధికారి అయిన రంజిత్ బజాజ్ తన జట్టుతోనే నడుస్తానంటున్నాడు. ఈ విధంగా చేయడం ద్వారానే అంతకుముందు సీజన్‌లో ఉన్న తొమ్మిదో ర్యాంకును ప్రస్తుత సీజన్ భారత ఫుట్‌బాల్ క్లబ్‌లో టాప్ పొజిషన్ తీసుకురాగలిగానని అంటున్నాడు.

పంజాబ్ కు చెందిన ఈ జట్టు ఐలీగ్ తొమ్మిదో స్థానంలో ఉంది. అలాంటిది జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ లీగ్‌లో టాప్ పొజిషన్‌కు చేరింది. ఈ విజయానికి కారణం ఏంటి అని అడిగితే యజమాని ఇలా స్పందించాడు. తను జట్టులా చూడనని ఒక కుటుంబంలా చూసుకుంటానని బదులిచ్చాడు.

"క్రితం మ్యాచ్ లో మాకు ప్రిపేర్ అవడానికే సమయం లేదు. కేవలం 12రోజులే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న లీగ్ కోసం మేము మూడు నెలల ముందు నుంచే సిద్ధమయ్యాం. నేను నా జట్టు దగ్గరగా ఉంటాను. ప్రతి ఒక్కరి ఆటతీరు పరిశీలిస్తుంటాను. వారి లోపాలను అధిగమించేలా వారిని ప్రోత్సహిస్తుంటాను. మైదానంలో ఆడుతున్నప్పుడు వారికి అవసరమైతే మంచినీళ్ల బాటిల్ ఇవ్వడానికైనా సిద్ధంగా ఉంటాను." తన ఆనందాన్ని వెలిబుచ్చాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Friday, December 15, 2017, 12:26 [IST]
Other articles published on Dec 15, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X