న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

వరల్డ్‌కప్ ఓటమి ఎఫెక్ట్: స్పెయిన్‌కు కొత్త కోచ్ నియామకం

By Nageshwara Rao
Luis Enrique named Spain’s national football coach

హైదరాబాద్: బార్సిలోనా మాజీ కోచ్ లూయిస్ ఎన్రిక్ స్పెయిన్ జాతీయ ఫుట్‌బాల్ జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడితో రెండేళ్ల పాటు ఒప్పందం చేసుకున్నట్లు స్పానిష్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ లూయిస్ రుబియెల్స్ సోమవారం అధికారిక ప్రకటన చేశారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ఏకగ్రీవంగా జరిగింది. అతని నిబద్ధత అంటే చాలా ఇష్టం. మా ఫెడరేషన్ నిర్దేశించుకున్న అన్ని అర్హతలు అతనిలో ఉన్నాయి. స్పెయిన్‌కు కోచ్‌గా అతనే సరైన వ్యక్తి అని భావిస్తున్నాం" అని అన్నారు.

2014 నుంచి 2017 మధ్య కాలంలో రియల్ మాడ్రిడ్, బార్సిలోనా జట్లకు కోచ్‌గా ఉన్న లూయిస్ ఎన్రిక్ రెండు లా లిగా టైటిళ్లతో పాటు ఒక ఛాంపియన్ లీగ్, మూడు కింగ్స్ కప్‌ను ఆయా జట్లు గెలవడంలో కీలకంగా వ్యవహారించాడు.

ఫిఫా వరల్డ్ కప్ ఆరంభానికి ముందు రియల్ మాడ్రిడ్‌తో ఒప్పందం చేసుకోవడంతో స్పెయిన్ కోచ్ జులెన్ లొపెతెజ్‌ను స్పానిష్ ఫెడరేషన్ తప్పించింది. అతని స్థానంలో తాత్కాలిక కోచ్‌గా ఫెర్నాండోను నియమించారు. ఇప్పుడు ఫెర్నాండో నుంచి ఎన్రిక్ బాధ్యతలు స్వీకరించనున్నాడు.

రష్యాలో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్‌లో నాకౌట్‌లో రష్యాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ షూటౌట్లో ఓడిన స్పెయిన టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలో స్పెయిన్ విఫలమవడంతో 48 ఏళ్ల ఎన్రిక్ భవిష్యత్‌లో కీలక సవాళ్లను ఎదుర్కొనున్నాడు.

Story first published: Tuesday, July 10, 2018, 15:45 [IST]
Other articles published on Jul 10, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X