న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

చావోరేవో మ్యాచ్‌కు అర్జెంటీనా.. మెస్సీ రిటైర్‌మెంట్ ..??

 Lionel Messi says he does not want to retire from Argentina until he lifts Jules Rimet trophy

హైదరాబాద్: ఫిఫా ప్రపంచకప్‌లో అర్జెంటీనా చావోరేవో పోరుకి అర్జెంటీనా సిద్ధమైంది. టోర్నీ ఆరంభానికి ముందు టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అర్జెంటీనా.. గ్రూప్-డిలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేదు.ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌ను డ్రాగా ముగించిన అర్జెంటీనా....2వ గ్రూప్ మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో ఓడింది. టోర్నీలో ఒక డ్రా, ఒక ఓటమితో నాకౌట్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకున్న అర్జెంటీనా.. ఫిఫాలో నిలవాలంటే మంగళవారం నైజీరియాతో జరగనున్న మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది.

మరోవైపు నైజీరియా జట్టు తొలి మ్యాచ్‌లో క్రొయేషియా చేతిలో ఓడినా...2వ మ్యాచ్‌లో ఐస్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించి ప్రీ క్వార్టర్‌ఫైనల్ రేస్‌లో నిలిచింది. 2 మ్యాచ్‌ల్లో నెగ్గలేకపోయిన అర్జెంటీనా జట్టును చిత్తు చేసి చరిత్ర సృష్టించాలని నైజీరియా భావిస్తోంది.

క్రొయేషియా 6 పాయింట్లతో నాకౌట్ బెర్తుని ఖాయం:

క్రొయేషియా 6 పాయింట్లతో నాకౌట్ బెర్తుని ఖాయం:

గ్రూప్-డిలో ఇప్పటికే క్రొయేషియా 6 పాయింట్లతో నాకౌట్ బెర్తుని ఖాయం చేసుకోగా.. మిగిలిన ఒక బెర్తు కోసం నైజీరియా (3 పాయింట్లు), ఐస్‌లాండ్ (1 పాయింట్), అర్జెంటీనా (1 పాయింట్) పోటీపడుతున్నాయి. ఈ రేసులో అర్జెంటీనా ముందుకు వెళ్లాలంటే.. తొలుత నైజీరియాని ఓడించాలి. ఆ తర్వాత క్రొయేషియాని ఐస్‌లాండ్ ఓడించినా.. లేదా కనీసం డ్రాగా ముగించినా అర్జెంటీనాకి మార్గం సుగుమమవుతుంది.

 భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన లియోనల్ మెస్సీ

భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన లియోనల్ మెస్సీ

ప్రపంచకప్‌లోకి భారీ అంచనాల మధ్య అడుగుపెట్టిన లియోనల్ మెస్సీ వరుసగా విఫలమవుతుండటం అర్జెంటీనా విజయావకాశాల్ని దారుణంగా దెబ్బతీస్తోంది. ముఖ్యంగా.. ఐస్‌లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓ పెనాల్టీని మెస్సీ వృథా చేయడంతో ఆ మ్యాచ్‌ను అర్జెంటీనా డ్రాగా ముగించాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రొయేషియా జరిగిన మ్యాచ్‌లోనూ జట్టు మొత్తం సమష్టిగా విఫలమై 0-3 తేడాతో ఓడింది. దీంతో.. ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు కనీసం ఒక గోల్‌ కూడా నమోదు చేయని మెస్సీ.. నైజీరియాపై ఎలా ఆడతాడోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రపంచ కప్ గెలిచేవరకూ రిటైర్ అయ్యేది లేదని

ప్రపంచ కప్ గెలిచేవరకూ రిటైర్ అయ్యేది లేదని

స్టార్ స్ట్రైకర్ మెస్సీ ఒక్క మ్యాచ్‌లో కూడా స్కోర్ చేయలేకపోవడంతో పాటు, మిగతా స్టార్ ప్లేయర్స్ విఫలమవ్వడంతో 2014 ప్రపంచకప్ రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా టైటిల్ రేస్‌లో వెనుకబడింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో కూడా మెస్సీ ఫెయిలైతే.. అతను రిటైర్మెంట్‌ ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఒకసారి రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ.. ఆ తర్వాత మళ్లీ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. ఆదివారం పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న మెస్సీ.. ప్రపంచ కప్ గెలిచేవరకూ రిటైర్ అయ్యేది లేదని స్పష్టం చేశాడు.

ఆఖరి కీలక మ్యాచ్‌కు అర్జెంటీనా సిద్ధమై

ఆఖరి కీలక మ్యాచ్‌కు అర్జెంటీనా సిద్ధమై

ఫిఫా ప్రపంచకప్‌ గ్రూప్-డిలో ఆఖరి కీలక మ్యాచ్‌కు అర్జెంటీనా సిద్ధమైంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రైకర్‌గా వెలుగొందుతోన్న మెస్సీ మీదే అర్జెంటీనా జట్టు భారం వేసింది. మెస్సీ మ్యాజిక్ చేస్తే అర్జెంటీనాకు తిరుగుండదు. మరి మెస్సీ ఈ సారైనా టార్గెట్ మిస్ అవ్వకుండా తన జట్టును ప్రీ క్వార్టర్‌ఫైనల్ రౌండ్ చేరుస్తాడో లేదో మంగళవారం జరగనున్న మ్యాచ్‌లో తేలనుంది.

Story first published: Tuesday, June 26, 2018, 16:55 [IST]
Other articles published on Jun 26, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X