మాడ్రిడ్: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. తాజాగా స్పెయినీష్ లీగ్ లాలీగా టోర్నమెంట్‌లో మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ సాధించడంతో.. పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సరసన నిలిచాడు. లాలీగా టోర్నీలో మెస్సీకి ఇది 34వ హ్యాట్రిక్. లాలీగా టోర్నమెంట్‌లో భాగంగా సెల్టా విగోతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా తరఫున ఆడుతున్న మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ చేసాడు.
కేపీఎల్ ఫిక్సింగ్.. అంతర్జాతీయ బుకీ అరెస్ట్!!
మెస్సీ హ్యాట్రిక్ గోల్స్‌తో అదరగొట్టడంతో బార్సిలోనా 4-1 తేడాతో సెల్టా విగోపై అద్భుత విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. మెస్సీ హ్యాట్రిక్ గోల్స్ కొట్టడంతో రొనాల్డో సరసన నిలిచాడు. ఓవరాల్ లాలీగా టోర్నమెంట్‌లో అత్యధికంగా హ్యాట్రిక్ గోల్స్ సాధించిన జాబితాలో ఇప్పటివరకూ రొనాల్డ్ ఉండగా.. తాజాగా ఆ జాబితాలో మెస్సీ కూడా చేరిపోయాడు.
తొలి అర్థ భాగంలో ఫ్రీకిక్ ద్వారా గోల్ సాధించిన మెస్సీ.. రెండో అర్థ భాగంలో మరో రెండు గోల్స్ సాధించి హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఇక గేమ్ చివర్లో సెర్గియో బస్య్కూట్ గోల్ సాధించడంతో.. బార్సిలోనా ఘన విజయం సాధించింది. అయితే చివరి మూడు గేమ్‌ల్లో బార్సిలోనాకు ఇది తొలి విజయం కావడం విశేషం. గత రెండు గేమ్‌ల్లో మెస్సీ రాణించలేకపోయాడు. ఎట్టకేలకు సత్తాచాటి బార్సిలోనాకు విజయాన్ని అందించాడు.
మూడు నెలల క్రితం లియోనల్ మెస్సీ 6వసారి ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ క్రమంలో లివర్ పూల్ డిఫెండర్ విర్గిల్ వాన్ డిజిక్, ఐదు సార్లు ఈ అవార్డు అందుకున్న క్రిస్టియానో రొనాల్డోలను లియోనల్ మెస్సీ అధిగమించాడు. చివరగా లియోనల్ మెస్సీ 2015లో ఉత్తమ ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు.
గత సీజన్‌లో బార్సిలోనా జట్టుతో కలిసి స్పానిష్ లాలిగా టైటిల్ లియోనల్ మెస్సీ నెగ్గిన సంగతి తెలిసిందే. అన్ని పోటీల్లో కలిపి లియోనల్ మెస్సీ మొత్తం 58 గేమ్స్ ఆడి 54 గోల్స్ సాధించడంతో యూరోపియన్ లీగ్ గోల్డెన్ బూట్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. క్రిస్టియానో రొనాల్డో 55 గేముల్లో 54 గోల్స్ చేయడం విశేషం.
మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి