బార్సిలోనాకు చిల్సీ డిఫెండర్ అలోన్సో.. స్వయంగా వెల్లడించిన మెస్సీ

Posted By:
La Liga: Messi tells Barcelona Chelsea’s player to sign

బార్సిలోనా: లియానెల్ మెస్సీ సారథ్యంలోని బార్సిలోనా క్లబ్‌లోకి మరో కీలక ఆటగాడు రానున్నాడు. ఈ విషయాన్ని లియానెల్ మెస్సీ స్వయంగా చెప్పాడు. చిల్సీ డిఫెండర్ మాక్రోస్ అలోన్సో త్వరలో బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ మేనేజ్‌మెంట్‌తో ఒప్పందంపై సంతకం చేయనున్నాడని మెస్సీ తెలిపాడు.

ప్రస్తుత సీజన్‌లో చిల్సీలో అలోన్సో మంచి ఫామ్‌లో ఉన్నాడని పేర్కొన్నాడు. ఆంటోనియో కాంటే సారథ్యంలోని జట్టు సభ్యుడిగా అలోన్సో కూడా చాంపియన్స్ లీగ్‌లో బార్సిలోనా చేతిలో ఓటమికి గురయ్యాడు. చెల్సియాతో జరిగిన మ్యాచ్‌లో బార్సిలోనా 3 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

అలోన్సో ఆటతీరుతో ముగ్ధుడైన లియానెల్ మెస్సీ

అలోన్సో ఆటతీరుతో ముగ్ధుడైన లియానెల్ మెస్సీ

చెల్సియాతో జరిగిన మ్యాచ్‌లో లియానెల్ మెస్సీ రెండు గోల్స్ చేయగా, ఒక గోల్ చేయడంతో చేయూతనిచ్చాడు. వరుసగా రెండు మ్యాచ్ ల్లో అలోన్సో ఆటతీరుతో మెస్సీ ముగ్ధుడయ్యాడని స్పానిష్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దీంతో చెల్సియా ఫుల్ బ్యాక్ డిఫెండర్‌గా ఉన్న అలోన్సోను జట్టులోకి తీసుకోవాలని బార్సిలోనా క్లబ్ యాజమాన్యానికి మెస్సీ విన్నవించారు.

జట్టు సభ్యులు బలహీన పడుతున్నారని మెస్సీ ఆందోళన

జట్టు సభ్యులు బలహీన పడుతున్నారని మెస్సీ ఆందోళన

లెఫ్ట్ బ్యాక్ వైపు జోర్డీ అల్బా స్థానే కొత్త ముఖాలను తీసుకోవాలని మెస్సీ కోరుతున్నాడు. జోర్బీ ఆల్బా బలహీన పడ్డారని, బ్యాకప్‌లో లుకాస్ డిగ్నే సరిపడినంత స్థాయిలో దూసుకెళ్లలేకపోతున్నారని మెస్సీ భావిస్తున్నాడు. ఇదిలా ఉంటే బార్సిలోనా కోచ్ ఎర్నెస్టో వాల్వర్డే ‘లా లీగ' టోర్నీలో రికార్డు నెలకొల్పడంపైనే ద్రుష్టి సారించాడు.

కల సాకారంలో గత బార్సిలోనా మేనేజర్లు విఫలం

కల సాకారంలో గత బార్సిలోనా మేనేజర్లు విఫలం

లాలీగా టోర్నమెంట్‌లో వరుసగా 38 మ్యాచ్‌ల్లో ఓటమెరుగని జట్టుగా బార్సిలోనా క్లబ్ ను నిలుపడమే ఎర్నెస్టో వాల్వర్డే లక్ష్యంగా కనిపిస్తున్నది. ఇంతకుముందు బార్సిలోనా కోచ్‌లుగా వ్యవహరించిన జొహన్ క్రుయ్ప్, పెపఎ గౌర్డెలా, లూయిస్ ఎన్రిక్యు ఆ పని చేయలేకపోయారు.

2012 నుంచి పరస్పరం పోటీ పడని మాడ్రిడ్ జట్లు

2012 నుంచి పరస్పరం పోటీ పడని మాడ్రిడ్ జట్లు

లా లీగా టోర్నీలో గతేడాది ఏప్రిల్ ఎనిమిదో తేదీన మలాగలో రియల్ సోషిడాడ్‌పై జరిగిన మ్యాచ్‌లో 2 - 0 స్కోర్ తేడాతో విజయం సాధించినప్పటి నుంచి బార్సిలోనా వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం అట్లెంటికో మాడ్రిడ్ జట్టు కంటే తొమ్మిది పాయింట్లు ఆధిక్యంలో నిలిచింది బార్సిలోనా. వచ్చే ఆదివారం రియల్ మాడ్రిడ్ జట్టుతో అట్లెంటికో మాడ్రిడ్ పోటీ పడనున్నది. పాయింట్ల పట్టికలో రియల్ మాడ్రిడ్ జట్టు మూడో స్థానంలో నిలిచినా.. ఆదివారం జరిగే మ్యాచ్ లో అట్లెంటికో మాడ్రిడ్ జట్టుపై విజయం సాధిస్తే ఒక పాయింట్‌తో రెండో స్థానంలోకి వస్తుంది. అయితే 2012 నుంచి ఈ రెండు జట్లు పరస్పరం పోటీ పడకపోవడం గమనార్హం.

గతవారం సెవిల్లాతో మ్యాచ్ డ్రా:

గతవారం సెవిల్లాతో మ్యాచ్ డ్రా:

గమ్మత్తేమిటంటే బార్సిలోనా 1980 నుంచి ప్రతియేటా విజయాలను సాధిస్తూ రికార్డు నమోదు చేయడానికి కొద్దిదూరంలో విఫలమవుతున్నారు. గతవారం జరిగిన మ్యాచ్‌లో సెవిల్లా రెండు గోల్స్ చేసినా లూయిస్ సూరజ్, లియానెల్ మెస్సీ చెరో గోల్ చేసి 2 -2 స్కోర్ తో డ్రా గా ముగించారు. ఇక బుధవారం చాంపియన్స్ లీగ్ సెమీ ఫైనల్స్ దశలోనూ ఆర్ఎస్ రోమా జట్టుపై 4 - 1 స్కోర్ తేడాతో విజయం సాధించింది.

సెమీ ఫైనల్స్‌లో రియల్ మాడ్రిడ్, వాలెంకాతో పోటీ పడనున్న బార్సిలోనా:

సెమీ ఫైనల్స్‌లో రియల్ మాడ్రిడ్, వాలెంకాతో పోటీ పడనున్న బార్సిలోనా:

బార్సిలోనా మిడ్ ఫీల్డర్ ఇవాన్ రాకిటిక్ మాట్లాడుతూ తాము ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధిస్తూ ముందుకు వెళుతున్నామని, ఇక నుంచి ఆసక్తికరంగానూ, కష్టంగానూ ఉంటుందని వ్యాఖ్యానించాడు. టాప్ - 8 జట్లలో మొదటి స్థానంలో ఉన్న బార్సిలోనా జట్టును లాలీగ టోర్నీలో ఏ జట్టు ఎదుర్కొనలేకపోయింది. తాజాగా సెమీ ఫైనల్స్ దశలో సొంత గడ్డపై చాంపియన్స్ రియల్ మాడ్రిడ్, నాలుగోస్థానంలో నిలిచిన వాలెంకాతో పోటీ పడాల్సి ఉంటుంది.

Story first published: Friday, April 6, 2018, 16:01 [IST]
Other articles published on Apr 6, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి