న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఫిఫా గెలిచింది మేమే: కిరణ్ బేడి

Kiran Bedi’s Tweet On France’s FIFA World Cup Vctory Gets Trolled On The Internet
Kiran Bedi tweet on France’s FIFA World Cup win draws flak on the Internet

హైదరాబాద్: ప్రపంచ విజేత ఫ్రాన్స్ ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి ప్రపంచ కప్ గెలుచుకుని వీక్షకులందరినీ ఔరా అనిపించింది. దాని సంగతి అటుంచితే.. క్రొయేషియా.. 41 లక్షల జనాభా ఉన్న దేశం కూడా ఫైనల్ వరకూ ఫిఫా బరిలో మేము సైతం అనే రీతిలో పోరాట పటిమ చూపించింది. ఆఖరి సమరంలో విశ్వవిజేతపై ఓడిపోయేటప్పుడు ఖాళీ చేతుల్తో సరిపుచ్చుకోలేదు. ప్రత్యర్థిపై కేవలం రెండు గోల్‌ల తేడాతో కప్‌కు దూరమైంది.

అయితే.. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ జట్టు విజయం సాధించిన నేపథ్యంలో అభినందనలు వెల్లువలా మొదలైయ్యాయి. ఫుట్‌బాల్‌పై ఆసక్తి అంతగా లేకపోయినా.. ప్రపంచ కప్ అనేసరికి దేశమంతా ఉత్కంఠగా వీక్షించారు. ఈ క్రమంలో.. జగజ్జేత ఫ్రాన్స్‌కు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారిణి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి చేసిన ట్వీట్ ట్రోలింగ్‌గా మారింది.

ఫ్రాన్స్‌ జట్టు రెండోసారి విజయం సాధించి సాకర్‌ జగజ్జేతగా విజేతగా నిలచిన నిలచిన నేపథ్యంలో కిరణ్‌బేడి 'మేము పుదుచ్చేరియన్లం (అప్పటి ఫ్రెంచ్ భూభాగం) ప్రపంచ కప్పు గెలుచుకున్నాం. స్నేహితులందరికీ అభినందనలు' అంటూ ట్వీట్ చేశారు.

1
958085

దీనిపై నెటిజన్లు పలు వ్యాఖ్యలు చేశారు. తాము భారతీయులమని, ఇలాంటి పబ్లిసిటీ స్టంట్లు ఆపండి మేడమ్ అంటూ ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. కిరణ్ బేడి చేసిన ట్వీట్ పై కొందరు నెటిజన్లు ఎగతాళి చేశారు. మొత్తంమీద సాకర్ విజయాన్ని పుదుచ్చేరియన్ల విజయంగా కిరణ్ బేడీ చేసిన ట్వీట్ అంతర్జాలంలో హల్ చల్ చేస్తోంది.

Story first published: Monday, July 16, 2018, 10:28 [IST]
Other articles published on Jul 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X