న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మొహమ్మద్ సలాహ్‌ను వరించిన 'ప్లేయర్ ఆఫ్ ద ఇయర్' అవార్డు

Kevin De Bruyne says player of the year award rival Mohamed Salah is having unbelievable season

హైదరాబాద్: మొహమ్మద్ సలాహ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకునేందుకు అన్ని విధాల అర్హుడని మాంచెస్టర్ సిటీ మిడ్ ఫీల్డర్ కెవిన్ డే బ్రూనె అభిప్రాయపడ్డాడు. ఆ అవార్డు తనకే వస్తుందని ఆశపడ్డ బ్రూనె ఈ ఏడాది అసాధారణ ప్రతిభ చూపించిన సలాహ్‌కి చెందుతుందనే విషయంలోనూ హర్షం వ్యక్తం చేశాడు. లివర్‌పూల్ ఈజిప్ట్‌కు చెందిన సలాహ్ ఒక్క ఏడాదిలో 37గోల్‌లు సాధించాడు.

ఈ సందర్భంగా కెవిన్ డే బ్రూనె మాట్లాడుతూ.. ఒక్క సీజన్‌లో అంతటి స్కోరును సాధించడమనేది నమ్మశక్యం కాని విషయం. బుధవారం లివర్‌పూల్ జట్టు ఎట్టకేలకు గెలిచి ఫైనల్‌కు చేరింది. ఈ జట్టుకు చెందిన సలాహ్ మ్యాచ్‌లో కీలకంగా వ్యవహరించి గెలిచేలా చేశాడు. ఇదే సీజన్‌లో 42 ప్రదర్శనలు చేసి 37గోల్‌లు చేశాడు.

మాంచెస్టర్ యునైటెడ్ జట్టు సహ యజమాని పెప్ గార్డియోలా మాట్లాడుతూ.. చిల్సీ జట్టులో ఉన్న రోజుల్లో సలాహ్ అంతగా ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ, ఇప్పడు ప్రతి ఆటలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. జట్టు యజమాని జర్గెన్ ఆడాలనే ఆసక్తి ఉన్న ఆటగాళ్లను ఒడిసిపట్టుకుంటాడు' అని కొనియాడాడు.

డె బ్రూనె మాట్లాడుతూ.. 'సలాహ్ ఇప్పుడు అందరికీ ఓ కాంపిటేషన్‌లా మారాడు. ఈ పోటీని తట్టుకోవడం చాలా కష్టంగా మారింది. కప్ గెలుచుకోవడం ఎంత ముఖ్యమో.. అతనికంటే మెరుగ్గా ఆడటం అంత కష్టంగా మారింది' అని వ్యాఖ్యానించాడు.

Story first published: Wednesday, April 4, 2018, 17:21 [IST]
Other articles published on Apr 4, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X