న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఒక్క ఛాన్స్: ఒకప్పటి పుట్‌బాలర్ ఇప్పుడు టీ అమ్ముకుంటోంది

Kalpana Roy, who played football for India, now runs tea stall to earn livelihood

హైదరాబాద్: పదేళ్ల క్రితం భారత మహిళల ఫుట్‌బాల్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన 26 ఏళ్ల కల్పనా రాయ్‌ ప్రస్తుతం జీవనోపాధి కోసం రోడ్డు పక్కన టీస్టాల్‌ పెట్టుకుని జీవనం సాగిస్తోంది. తనలో ఇంకా ఆడాలనే తపన ఇంకా ఉందని, అవకాశం లభిస్తే జట్టు తరఫున బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.

పుట్‌బాల్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్: ఫ్యాన్స్ ఆశ్చర్యం, వీడియో వైరల్పుట్‌బాల్ మ్యాచ్‌లో లవ్ ప్రపోజల్: ఫ్యాన్స్ ఆశ్చర్యం, వీడియో వైరల్

ఇందులో భాగంగా ఫిట్‌నెస్‌ను కాపాడుకునేందుకు చిన్నారులకు ఫుట్‌బాల్‌ కోచింగ్‌ కూడా ఇస్తోంది. పుట్‌బాల్‌లో ఫార్వర్డ్‌ ప్లేయర్‌ అయిన కల్పన రాయ్ భారత్ తరుపున అండర్‌-19 జట్టులో నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ఆడింది. 2013లో భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య నిర్వహించిన ఓ లీగ్‌లో కల్పన కుడి కాలికి తీవ్ర గాయమైంది.

 కాలి గాయం నుంచి కోలుకునేందుకు ఏడాది

కాలి గాయం నుంచి కోలుకునేందుకు ఏడాది

ఆ తర్వాత నుంచి కల్పనను దురదృష్టం వెంటాడుతోంది. కాలి గాయం నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టిందని బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురికి చెందిన కల్పనా రాయ్ తెలిపింది. ఈ సందర్భంగా కల్పన మాట్లాడుతూ "కాలి గాయం బాధ నుంచి కోలుకునేందుకు ఏడాది పట్టింది. చికిత్స చేయించుకోవడానికి ఎవరూ ఆర్థిక సహాయం చేయలేదు" అని తెలిపింది.

 టీ స్టాల్‌ నడుపుతున్నా

టీ స్టాల్‌ నడుపుతున్నా

"అప్పటి నుంచి టీ స్టాల్‌ నడుపుతున్నా. సీనియర్‌ నేషనల్స్‌ కోసం ట్రయల్స్‌కు రావాల్సిందిగా ఆహ్వానం అందినా ఆర్థిక పరిస్థితుల కారణంగా వెనుకంజ వేశా. ఎందుకంటే కోల్‌కతాలో ఉండేందుకు నాకు చోటు లేదు. అదీగాకుండా నేనక్కడికి వెళితే కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? మా తండ్రి ఆరోగ్యం కూడా సరిగా లేదు" అని కల్పన పేర్కొంది.

నాలుగేళ్ల క్రితమే కల్పన తల్లి మృతి

నాలుగేళ్ల క్రితమే కల్పన తల్లి మృతి

ఐదుగురు ఆడ సంతానం కలిగిన కుటుంబంలో కల్పన చిన్నమ్మాయి కావడం విశేషం. తల్లి నాలుగేళ్ల క్రితమే మరణించింది. ఒక అక్క తనతోపాటే ఉంటోంది. టీ స్టాల్‌ను నడపడంతో పాటు ప్రతీ రోజూ ఉదయం, సాయంత్రం 30 మందికి పైగా పిల్లలకు కోచింగ్‌ ఇస్తోంది. ఇందుకుగాను ఆ పిల్లలు ఆడే క్లబ్‌ కల్పనకు నెలకు రూ.3 వేలు ఇస్తోంది.

 అవకాశమిస్తే కోచ్‌గా రాణించేందుకు సిద్ధం

అవకాశమిస్తే కోచ్‌గా రాణించేందుకు సిద్ధం

ఈ డబ్బుతోనే కల్పన తన కుటుంబాన్ని పోషిస్తోంది. ఈ క్రమంలో తనకు ఒక్క అవకాశమిస్తే క్రీడాకారిణిగానే కాకుండా కోచ్‌గా కూడా రాణించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కల్పన తెలిపింది.

Story first published: Wednesday, October 31, 2018, 14:49 [IST]
Other articles published on Oct 31, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X