ఐఎస్‌ఎల్‌ టైటిల్ విజేతగా బెంగళూరు: ఫైనల్లో గోవాపై 1-0తో విజయం

హైదరాబాద్: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌(ఐఎస్ఎల్) ఐదో సీజన్‌ టైటిల్ విజేతగా బెంగళూరు ఎఫ్‌సీ నిలిచింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో బెంగళూరు 1-0తో గోవా ఎఫ్‌సీని ఓడించింది. నిర్ణీత సమయంలో రెండు జట్లు గోల్స్‌ చేయలేక పోవడంతో అదనపు సమయానికి దారి తీసింది. అదనపు సమయంలో (116వ ని) రాహుల్‌ కొట్టిన గోల్‌తో బెంగళూరు విజేతగా నిలిచింది.

నెట్ ప్రాక్టీస్ లో అదర గొట్టిన ధోనీ: ఐపీఎల్ మ్యాచుల్లో బౌలర్లకు చుక్కలే!

డిమాస్‌ అందించిన కార్నర్‌ షాట్‌ను

డిమాస్‌ అందించిన కార్నర్‌ షాట్‌ను అందుకున్న రాహుల్‌.. తలతో బంతిని గోల్‌లోకి కొట్టేశాడు. ఐఎస్‌ఎల్‌ ఫైనల్లో ఒక భారత ఆటగాడు గోల్‌ చేయడం కూడా ఇదే తొలిసారి. మ్యాచ్‌‌లో అదనపు సమయం ముగియడానికి మరో నాలుగు నిమిషాల సమయమే ఉండడంతో మ్యాచ్‌ ఫలితం షూటౌట్‌కు దారి తీస్తుందని అంతా భావించారు.

గతంలో గోవాపై మెరుగైన ప్రదర్శన చేసిన బెంగళూరు

గతంలో గోవాపై మెరుగైన ప్రదర్శన చేసిన బెంగళూరు ఈమ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే, గోవా కూడా గట్టి పోటీ ఇచ్చింది. దీంతో తొలి అర్ధభాగంలో ఒక్క గోల్‌ నమోదు కాలేదు. ఇక, రెండో అర్ధభాగంలో 58వ నిమిషంలో లభించిన సువర్ణావకాశాన్ని గోవా చేజార్చుకుంది. బంతిని అందుకున్న గోవా ప్లేయర్‌ జాకీ చంద్‌ సింగ్‌.. గోల్‌ కీపర్‌ గుర్‌ప్రీత్‌ను తప్పించలేక పోయాడు.

సునీల్‌ ఛెత్రి గోల్‌ ప్రయత్నం విఫలం

81వ నిమిషంలో బెంగళూరు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి గోల్‌ ప్రయత్నం విఫలమైంది. తర్వాత ఇరు జట్లూ డిఫెన్స్‌కే పరిమితం కావడంతో గోల్‌ నమోదు కాలేదు. ఎక్స్‌ట్రా టైమ్‌ తొలి అర్ధభాగంలోనూ ఇరు జట్లూ రక్షణాత్మక ధోరణికే పరిమితమ్యాయి. 104వ నిమిషంలో బెంగళూరు.. గోవా గోల్‌ పోస్టుపై దాడి చేసినా గోల్‌ కీపర్‌ అడ్డుకున్నాడు.

పది మందితోనే ఆడడంతోనే ఆడిన గోవా

పది మందితోనే ఆడడంతోనే ఆడిన గోవా

ఇక, 106వ నిమిషంలో బెంగళూరు ఆటగాడు మికును గోవా ఆటగాడు జహూ దురుసుగా తోసేయడంతో రిఫరీ రెడ్‌కార్డు ఇచ్చి బయటకు పంపించాడు. దీంతో గోవా పది మందితోనే ఆడడంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాహుల్‌ గోల్‌ చేసి బెంగళూరుని గెలిపించాడు. ఐఎస్‌ఎల్‌లో బెంగళూరుకు ఇదే తొలి టైటిల్‌. గతేడాది ఈ జట్టు రన్నరప్‌గా నిలిచింది.

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

Story first published: Monday, March 18, 2019, 9:08 [IST]
Other articles published on Mar 18, 2019
+ మరిన్ని
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X