హోరాహోరీగా టాప్ 2 జట్ల మధ్య పోరాటానికి సిద్ధమైన ఇండియన్ సూపర్ లీగ్

Posted By: Subhan
ISL: Exciting top of the table clash awaits as Bengaluru FC visit Chennaiyin FC

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా బెంగుళూరు ఎఫ్‌సీ జట్టు చెన్నెయిన్ ఎఫ్‌సీ జట్టుతో మంగళవారం తలపడనుంది. లీగ్ జాబితాలో ఇప్పటికే టాప్ పొజిషన్‌లో ఉన్న బెంగుళూరు జట్టు 27 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. దాని తర్వాత చెన్నైయిన్ ఎఫ్‌సీ జట్టు 23పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది.

న్యూ ఢిల్లీలోని జవహర్ లాల్ స్టేడియంలో మంగళవారం ఇరుజట్లు తలపడి మొదటి స్థానాన్ని పొందడానికి పోటీపడనున్నాయి. బెంగుళూరు జట్టును సున్నా పాయింట్లతో ఓడిస్తేనే గానీ, చెన్నెయిన్ ఎఫ్‌సీ జట్టుకు మొదటి స్థానం దక్కేలా లేదు. కానీ, బెంగుళూరు జట్టును అంత సులువైన పనేం కాదు.

'సోమవారం జరిగిన మీడియా సమావేశంలో చెన్నయిన్ ఎఫ్‌సీ జట్టు కోచ్ పాల్గొని మాట్లాడుతూ.. ఇవాల్టి నుంచి కాదు. అసలు మ్యాచ్ రేపటి నుంచి మొదలుకానుంది. మనమెంత కష్టపడితే దానికి తగ్గట్లే ఫలితం ఉంటుంది. ఇదే ఫార్ములాతో మేము ప్రాక్టీస్ ను ముమ్మరం చేశాం. 17 రోజుల్లో ఐదు గేమ్‌లు ఆడి అలసిపోయాం. కొంచెం విరామం దొరికితే బాగుండేది.' అని వ్యాఖ్యానించాడు.

మ్యాచ్‌ను పరువుకు సంబంధించిన విషయంగా తీసుకున్న బెంగుళూరు జట్టు కోచ్ మంచి మెడికల్ సిబ్బందితో సహా సిద్ధమైయ్యాడు. జట్టుకు చెందిన ఆటగాళ్లందరినీ ఫిట్ నెస్ తో ఉండాలని సూచించాడు. అవసరాన్ని బట్టి ఏ క్రీడాకారుడ్ని తీసుకునైనా ఆడమని ఆదేశిస్తాను. అందుకే మీరంతా ముందే సిద్ధంగా ఉండాలంటూ కోరాడు.

మొదటి స్ఘనం కోసం kటీపడుతున్న ఇరుజ్లు:

Chennaiyin FC vs Bengaluru FC
Indian Super League
Live from JN Stadium
At 8 pm (Tuesday, February 6)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Tuesday, February 6, 2018, 16:06 [IST]
Other articles published on Feb 6, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి