గోవాను ఓదార్చిన కోహ్లీ, చెన్నెయిన్ జట్టు ఫైనల్‌కు

Posted By:
ISL: Chennaiyin FC outsmart FC Goa,set up final with Bengaluru FC

హైదరాబాద్: ఇండియన్ సూపర్ లీగ్‌లో భాగంగా పది క్లబ్బులు తమ జట్లతో హోరాహోరీగా ఫైనల్ వరకు పోరాడాయి. చెన్నయిన్‌ ఎఫ్‌సీ జట్టు మంగళవారం జరిగిన పోరుతో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫైనల్‌కు దూసుకెళ్లింది. 32 పాయింట్లతో చెన్నై జట్టు రెండో స్థానంలో ఉండగా దానికంటే ముందుగా బెంగుళూరు జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది.

మంగళవారం జరిగిన రెండో అంచె సెమీఫైనల్లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. చెన్నయిన్‌ ఎఫ్‌సీ గోవా జట్టును 3-0 తేడాతో ఓడించింది. అత్యంత కీలక సమయం కావడంతో జట్టు ఓపెనర్‌గా నిలిచిన జేజె జట్టుకు పూర్తి సహకారాన్ని అందించాడు. తనదైన శైలిలో ఆడి మొత్తం సాధించిన మూడు గోల్స్‌లో రెండు అతనే సాధించాడు.

ఓటమికి గురైన గోవా జట్టును సహ యజమాని అయిన విరాట్ కోహ్లీ ఓదార్పుగా ట్వీట్ చేశాడు. ట్వీట్‌లో బాగానే కష్టపడ్డారు. ఫైనల్స్‌కు చేరుకోలేకపోయినందుకు నిరుత్సాహంగా ఉంది. కానీ, ఈ సీజన్‌లో మంచి ప్రదర్శనే ఇచ్చారు' అని పేర్కొన్నాడు.

చెన్నై.. గోవాను విన్నై:
జెజె 26 వ నిమిషంలో, 90వ నిమిషంలో రెండు గోల్స్‌ చేయగా ధన్‌పాల్‌ గణేశ్‌ ఓ గోల్‌ 29వ నిమిషంలో గోల్ చేసి మ్యాచ్‌ను మూడు గోల్స్ ఆధిక్యంతో గెలిపించారు. మొత్తంగా 4-1 ఆధిక్యంతో చెన్నయిన్‌ జట్టు ముందంజ వేసింది. రెండు జట్ల మధ్య ఇంతకుముందు జరిగిన రౌండ్‌లో సెమీఫైనల్‌ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ విజయంతో చెన్నై జట్టు సంబరాల్లో మునిగి తేలుతుంది. ఫైనల్‌కు సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొంది.

Story first published: Wednesday, March 14, 2018, 11:55 [IST]
Other articles published on Mar 14, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి