ఫుట్‌బాల్‌లో కూడా ధోనీ నెంబర్ 1, ముంబై స్టేడియంలో ప్రాక్టీస్

Posted By:
 IPL 2018: Move aside Cristiano Ronaldo – MS Dhoni shows off his footballing skills in CSK training session

హైదరాబాద్: ఫుట్‌బాల్‌ అంటే ధోనీకి ఎంతో ఇష్టం. ఆ నైపుణ్యాన్ని ధోనీ మళ్లీ ఒకసారి చూపించాడు. ఐపీఎల్‌ కోసం ధోనీ సేన ఇప్పటికే ముంబైకి చేరుకుంది. గురువారం ఉదయం ప్రాక్టీస్‌లో భాగంగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు వాంఖడే మైదానంలో కసరత్తులు చేశారు.

మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గొనే ధోనీ ఈ సారి జట్టు మొత్తాన్ని సరదాగా ఆడించాడు. ఈ క్రమంలో ధోనీ.. జట్టు ఫిజియో టామీతో కలిసి ఫుట్‌బాల్‌ ఆడుతూ కనిపించాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

ధోనీనా.. ఫుట్‌బాల్ ప్లేయరా:

‘మేము చూస్తుంది ధోనీనా.. ఫుట్‌బాల్‌ దిగ్గజం రొనాల్డొనా' అని అభిమానులు తెగ కామెంట్లు పెడుతున్నారు. చిన్నతనంలో ఫుట్‌బాల్‌ ఆడే ధోనీ ఆ తర్వాత క్రికెటర్‌గా మారిన విషయం మనకు తెలిసిందే. తాజాగా మరోసారి ధోనీ తన ఫుట్‌బాల్‌ స్కిల్స్‌ను చూపించాడు.

రెచ్చిపోయి ఆడిన రొనాల్డొ:

మంగళవారం జ్యూవెంటస్ జట్టుతో ఆడిన రియల్ మాడ్రిడ్ జట్టు 3-0 తేడాతో గెలుపొందింది. ఈ జట్టులో రొనాల్డొ ఒక్కడే రెండు గోల్స్ సాధించడం చెప్పుకోదగ్గ విషయం. మొదటి గోల్ సాధారణంగానే చేసినా, రెండో గోల్ బై సైకిల్ కిక్‌తో అదరగొట్టాడు. అతను కొట్టిన గోల్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవ్వడమే కాక, అందరి మన్ననలు పొందుతుంది.

తొలి మ్యాచ్‌లో అదరగొట్టాలని:

తొలి మ్యాచ్‌లో అదరగొట్టాలని:

ఏప్రిల్ 7 శనివారం ఐపీఎల్‌ 11వ సీజన్‌ ప్రారంభంకానుంది. టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో చెన్నై సూపర్‌కింగ్స్‌ తలపడనుంది. ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారనుంది.

అదే రోజు ప్రారంభోత్సవం కూడా:

అదే రోజు ప్రారంభోత్సవం కూడా:

క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్‌గా పేరుగాంచింది ఐపీఎల్. ఇప్పుడు ప్రారంభోత్సవాన్ని కూడా అదే స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సినీ తారలతో ముంబై వాంఖడే స్టేడియం ఏప్రిల్ 7వ తేదీ రంగులీనేందుకు సిద్దంగా ఉంది.

Story first published: Thursday, April 5, 2018, 17:03 [IST]
Other articles published on Apr 5, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి