న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

మెస్సీ చిరునవ్వులు: పుట్‌బాల్‌లో ఇలా కూడా బంతిని అడ్డుకోవచ్చా?

Injured Barcelona star Lionel Messi amused at inventive block by Inter Milan’s Marcelo Brozovic from Luis Suarez

హైదరాబాద్: సాకర్‌లో ఇప్పటివరకు మనం అనేక గోల్స్‌ను చూసుంటాం. కానీ, బంతిని గోల్‌పోస్ట్‌కు వెళ్లకుండా ఇలా కూడా అడ్డుకోవచ్చా? అని ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పకుండా అనుకుంటారు. సాధారణంగా ఫ్రీకిక్ కొట్టే ముందు ప్రత్యర్థి జట్టులోని ఆటగాళ్లంతా గోల్‌ను ఆపేందుకు గోల్ పోస్ట్ ముందు నిలబడతారు.

వినూత్నంగా ఆలోచించిన మార్సెలో బ్రోజోవిక్

బంతిని చేత్తో ఆపితే పౌల్ అవుతుందని కాబట్టి.. శరీరంలోని మిగతా భాగాలతో ఆపే అవకాశం ఆటగాళ్లకు ఉంటుంది. తాజాగా బార్సిలోనా-ఇంటర్‌మిలాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మార్సెలో బ్రోజోవిక్ అనే ప్లేయర్ వినూత్నంగా ఆలోచించి బంతిని అడ్డుకున్నాడు.

బంతిని అడ్డుకోవడానికి గోడలా నిలబడ్డ ఆటగాళ్లు

తన సహచర ఆటగాళ్లు బంతిని అడ్డుకోవడానికి గోడలా నిలబడితే అతడు మాత్రం వాళ్ల వెనుక వెళ్లి అడ్డంగా పడుకున్నాడు. సరిగ్గా బార్సిలోనా ప్లేయర్ సురెజ్ ఫ్రీకిక్ కొట్టే సమయంలోనే బ్రోజోవిక్ ఇలా చేశాడు. అతడు ఊహించినట్లే బంతి మిగతా ప్లేయర్స్ అందరినీ దాటేసినా.. అతన్ని తగిలి బంతి గ్రౌండ్ బయటకు వెళ్లిపోయింది.

ఆశ్చర్యానికి లోనైన మెస్సీ

ఈ సన్నివేశాన్ని చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆశ్చర్యానికి లోనైన వాళ్లలో అర్జెంటీనా సూపర్ స్టార్, బార్సిలోనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీ కూడా ఉన్నాడు. మెస్సీ చేయి విరగడంతో కొన్ని వారాల పాటు ఫుట్‌బాల్‌కు దూరమయ్యాడు. దీంతో ఈ మ్యాచ్‌ను స్టాండ్స్‌లో తన కొడుకుతో కలిసి చూశాడు.

చిరునవ్వులు చిందించిన మెస్సీ

బ్రోజోవిక్ బంతిని అడ్డుకున్న తీరుపై మెస్సీ చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ మ్యాచ్‌లో చివరికి బార్సిలోనానే 2-0 గోల్స్ తేడాతో ఇంటర్‌మిలాన్‌ జట్టుపై విజయం సాధించింది.

Story first published: Thursday, October 25, 2018, 18:41 [IST]
Other articles published on Oct 25, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X