న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

India vs Bangladesh FIFA 2022 World Cup Qualifiers: ఎప్పుడు, ఎక్కడ, ఎలా వీక్షించాలి!

India vs Bangladesh FIFA 2022 World Cup Qualifiers: When, where and how to watch

హైదరాబాద్: ఫిపా వరల్డ్‌కప్ ఆసియా క్వాలిఫయిర్స్‌లో భాగంగా మంగళవారం సునీల్ ఛెత్రి సారథ్యంలోని భారత పుట్‌బాల్ జట్టు బంగ్లాదేశ్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌కి కోల్‌కతాలోని వివేకానంద యువ భారతి క్రీడాప్రాంగణం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోయాయి.

మొత్తం ఐదు జట్లు ఉన్న గ్రూప్ ఈలో భారత పుట్‌బాల్ జట్టు నాలుగో స్థానంలో కొనసాగుతోంది. క్వాలిఫయిర్స్ టోర్నీలో భాగంగా భారత జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో ఓడిపోగా... మరొక మ్యాచ్‌ని డ్రా చేసుకుంది. గౌహతి వేదికగా ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-2తేడాతో ఓడిపోయింది.

700వ గోల్ చేసిన రొనాల్డోకు ఒక పక్క సంతోషం, మరోవైపు బాధ!700వ గోల్ చేసిన రొనాల్డోకు ఒక పక్క సంతోషం, మరోవైపు బాధ!

ఆ తర్వాత ఖతార్‌తో జరిగిన రెండో మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. ఖతర్‌తో మ్యాచ్‌కు దూరమైన సునీల్‌ ఛెత్రి తిరిగి జట్టులోకి రావడం భారత్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం భారత్‌ 104వ ర్యాంకులో ఉండగా... బంగ్లాదేశ్‌ 207 ర్యాంకులో ఉంది. ఛెత్రి, బల్వంత్‌ సింగ్, మన్వీర్‌ సింగ్‌లతో కూడిన అటాకింగ్‌ చెలరేగితే భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించినట్లే.

ఇక, మిడ్‌ఫీల్డ్‌లో ఉదాంత సింగ్, ఆశికి కురునియన్‌‌లు అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్ సందర్భంగా ఛెత్రి మాట్లాడుతూ "ఇది ఛెత్రికి, బంగ్లాదేశ్‌కు మధ్య జరిగే మ్యాచ్‌ కాదు. భారత్‌కు బంగ్లాదేశ్‌కు మధ్య జరిగేది. నేను జట్టులో ఒక సభ్యుడిని మాత్ర మే. జట్టుకు విజయాన్ని అందించే ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు" అని మీడియా సమావేశంలో ఉన్నాడు.

India vs Bangladesh World Cup Qualifier మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుంది?
October 15, సాల్ట్ లేక్ స్టేడియం కోల్‌కతా

India vs Bangladesh World Cup Qualifier మ్యాచ్ ఎన్నిగంటలకు ప్రారంభం?
భారత కాలమానం ప్రకారం మంగళవారం రాత్రి 07:30 గంటలకు

India vs Bangladesh World Cup Qualifier మ్యాచ్‌ని ఏ టీవీ ఛానెల్ ప్రసారం చేస్తోంది?స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్

India vs Bangladesh World Cup Qualifier మ్యాచ్‌ని ఆన్ లైన్‌లో ఎలా వీక్షించాలి?
హాట్ స్టార్ యాప్‌లో

ఇరు జట్లు
భారత్: గుర్ప్రీత్ సింగ్ సంధు, అమృందర్ సింగ్, కమల్జిత్ సింగ్, ప్రీతమ్ కోటల్, రాహుల్ భేకే, ఆదిల్ ఖాన్, నరేందర్, సర్తక్ గోలుయ్, అనాస్ ఎదతోడికా, మందార్ రావు దేశాయ్, సుభాషిష్ బోస్, ఉదంత సింగ్, నిఖిల్ పూజరీ, వినిద్ రాయ్ , రేనియర్ ఫెర్నాండెజ్, బ్రాండన్ ఫెర్నాండెజ్, లల్లియన్‌జులా చాంగ్టే, ఆశిక్ కురునియాన్, సునీల్ ఛెత్రి, బల్వంత్ సింగ్, మన్వీర్ సింగ్.

బంగ్లాదేశ్: అష్రఫుల్ ఇస్లాం ఫ్రాగ్, అనిసూర్ రెహ్మాన్ జికో, షాహిదుల్ యూసుఫ్ సోహెల్, బిశ్వనాథ్ ఘోష్, రహమత్ మియా, యేసిన్ ఖాన్, టుతుల్ హుస్సేన్ బాద్షా, రియాదుల్ హసన్ రఫీ, యేసిన్ అరాఫత్, రైహాన్ హసన్, జమాల్ భుయుల్ (కెప్టెన్) కప్ప, ఆరిఫూర్ రెహ్మాన్, మమునుల్ ఇస్లాం, మహ్మద్ ఇబ్రహీం, ఎఫ్‌డబ్ల్యు- తౌహిదుల్ ఆలం సాబుజ్, నబీబ్ న్యూయాజ్ జిబోన్, మోటిన్ మియా, మహబూబర్ రెహ్మాన్ సుఫిల్, జ్యువెల్ రానా, సాద్ ఉద్దీన్.

Story first published: Tuesday, October 15, 2019, 13:52 [IST]
Other articles published on Oct 15, 2019
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X