న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Fifa World Cup 2022: కోస్టారికాను చిత్తు చేసినా.. కలిసి రాని అదృష్టం.. వరల్డ్ కప్ నుంచి జర్మనీ అవుట్..!

Germany crash out of Fifa World Cup despite thrashing Costa Rica in their final group match

ఫిఫా వరల్డ్ కప్‌ 2022‌లో అభిమానులకు షాకింగ్ ఫలితం వచ్చింది. నాలుగు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జర్మనీ జట్టు అంచనాలను తలకిందులు చేస్తూ గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో కోస్టారికాను 4-2 తేడాతో చిత్తు చేసినా వాళ్ల తలరాత మారలేదు. మరో మ్యాచ్‌లో స్పెయిన్‌ను ఓడించిన జపాన్ సంచలనం సృష్టించడంతో ఈ ప్రభావం జర్మనీపై పడింది. దీంతో జర్మనీ అభిమానుల గుండె బద్దలైంది.

జర్మనీ దూకుడు..

జర్మనీ దూకుడు..

అల్ బయత్ స్టేడియం వేదికగా కోస్టారికాతో జరిగిన మ్యాచ్‌ను జర్మనీ జట్టు హైనోట్‌లో ప్రారంభించింది. నాకౌట్ రేసులో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. మ్యాచ్ మొదలైన ఏడో నిమిషంలోనే గోల్ చేసినంత పని చేసింది. ఆ అవకాశం మిస్ అయినా ఆ తర్వాత పదో నిమిషంలోనే జర్మనీ జట్టు తొలి గోల్ చేసింది.

కోస్టారికా ఎదురు దాడి..

కోస్టారికా ఎదురు దాడి..

స్కోర్లు సమం చేసేందుకు కోస్టారికా చేసిన ప్రయత్నాలకు జర్మనీ గోల్‌కీపర్ నూయర్ అడ్డుకట్ట వేశాడు. అయితే 58వ నిమిషంలో కోస్టారికా ప్లేయర్ యెల్టిన్ టజేడా తనకు వచ్చిన ఈజీ ఛాన్స్ ఉపయోగించుకొని స్కోర్లు సమం చేశాడు. ఆ తర్వాత జర్మనీ జట్టు జోరు పెంచినా వెంటనే మరో గోల్ చేయలేకపోయింది. ఈ క్రమంలో కోస్టారికా ప్లేయర్ జువాన్ పాబ్లో వర్గాస్.. తనకు వచ్చిన ఫ్రీ కిక్‌ను గోల్‌గా మలచడంతో ఆ జట్టు 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.

చివర్లో చెలరేగిన జర్మనీ..

చివర్లో చెలరేగిన జర్మనీ..

ఇక జర్మనీ పని అయిపోయినట్లే అనుకుంటుండగా.. కాయ్ హావెర్జ్ అద్భుతమైన ఆటతీరుతో అదరగొట్టాడు. వరుసగా 73, 85వ నిమిషాల్లో రెండు గోల్స్ చేశాడు. దీంతో జర్మనీ 3-2తో పైచేయి సాధించింది. నిక్లాస్ ఫుల్‌క్రగ్ మరో గోల్ చేసి జర్మనీ ఆధిక్యాన్ని 4-2కు పెంచాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించినా.. జపాన్ చేతిలో స్పెయిన్ ఓడిపోవడంతో జర్మనీ ఇంటి దారి పట్టాల్సి వచ్చింది.

మండిపడుతున్న ఫ్యాన్స్..

మండిపడుతున్న ఫ్యాన్స్..

ఇలా తమ జట్టు గ్రూప్ దశలోనే నిష్క్రమించడంపై జర్మనీ అభిమానులు మండి పడుతున్నారు. జర్మనీ మేనేజర్ హాన్సీ ఫ్లిక్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వరల్డ్ కప్‌లో కూడా జర్మనీ ఇలాగే గ్రూప్ దశలోనే ఇంటి దారి పట్టింది. గతంలో నాలుగు సార్లు వరల్డ్ కప్ గెలిచిన జర్మనీ.. ఇలా వరుసగా 2018, 2022 రెండుసార్లు కనీసం నాకౌట్స్ కూడా చేరలేకపోవడాన్ని వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. వీళ్లు ఉన్న గ్రూప్-ఈలో అత్యంత ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు జరగడంతో దీన్ని 'గ్రూప్ ఆఫ్ డెత్'గా పిలవడం మొదలు పెట్టారు ఫ్యాన్స్. ఈ గ్రూప్ నుంచి జపాన్, స్పెయిన్ ముందడుగు వేశాయి.

Story first published: Friday, December 2, 2022, 7:55 [IST]
Other articles published on Dec 2, 2022
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X