న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

భిన్నంగా ఫిఫా వరల్డ్ కప్‌కు: 82 ఏళ్ల కిందటి ట్రాక్టర్‌తో అభిమాని

By Nageshwara Rao
German Man Travels to Russia on 1936 Tractor to Cheer for His Team in World Cup

హైదరాబాద్: ఫిఫా వరల్డ్ కప్‌కు ఉన్న ప్రత్యేకత వేరు. ఈ మెగా టోర్నీలోని మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలని సగటు పుట్‌బాల్ అభిమానికి ఉంటుంది. ఇందుకోసం సప్తసముద్రాలు దాటి ఈ ఫిఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగితే అక్కడకు వెళ్తుంటారు. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో రష్యాకు తరలి వస్తున్నారు.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

తాజాగా 70 ఓళ్ల ఓ అభిమాని కూడా ఇలానే చేశాడు. జర్మనీకి చెందిన 70 ఏళ్ల హుబర్ట్‌ విర్త్‌ మాత్రం భిన్నంగా ట్రాక్టర్‌‌ను వాహనంగా ఎంచుకుని జర్మనీ నుంచి రష్యా చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. వివరాల్లోకి వెళితే... జర్మనీలోని ఫోర్చియిమ్‌కు చెందిన హుబర్ట్‌కు ఫుట్‌బాల్‌ అంటే అమితమైన ఇష్టం.

German Man Travels to Russia on 1936 Tractor to Cheer for His Team in World Cup

దీంతో రష్యా ఆతిథ్యమిస్తోన్న 21వ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించాలనుకున్నాడు. వెంటనే తన దగ్గర ఉన్న 82 ఏళ్ల క్రితం నాటి ట్రాక్టర్‌ను బయటకు తీసి మరమ్మతులు చేయించాడు. వెనక ట్రక్కు స్థానంలో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేసుకున్నాడు. తనకు కావాల్సినవన్నీ అందులో సర్దుకున్నాడు.

తనతో పాటు తన పెంపుడు కుక్కుని కూడా రష్యాకి తీసుకొచ్చాడు. రోజుకు 100 కిలోమీటర్ల ప్రయాణించి పోలాండ్‌, బెలారస్‌ మీదుగా రష్యాకు చేరుకున్నాడు. జర్మనీ నుంచి రష్యాకు హుబర్ట్‌ విర్త్‌ ప్రయాణించిన 82 ఏళ్ల కిందటి ట్రాక్టర్‌ను చూసేందుకు పెద్దఎత్తున పుట్‌బాల్ అభిమానులు అక్కడికి చేరుకున్నారు.

Story first published: Tuesday, June 19, 2018, 16:24 [IST]
Other articles published on Jun 19, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X