
హైదరాబాద్: బ్రెజిల్‌ను వరల్డ్‌కప్ టోర్నీలో రెండుసార్లు విశ్వవిజేతగా నిలిపిన మాజీ కెప్టెన్ కేఫు ఇంట్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కేఫు 30 ఏళ్ల కుమారుడు డానిలో ఫెలిసియానో డి మోరేస్ ఇంట్లో ఫుట్‌బాల్ ఆడుతుండగా గుండెపోటుతో మరణించాడు.
రిటైర్మెంట్ అనంతరం కేఫు బ్రెజిల్‌లోని సావో పాలోలో తన కుటుంబ సభ్యులతో నివసిస్తున్నాడు. కేఫు కుమారుడు డానిలో బుధవారం ఇంట్లోనే ఫుట్‌బాల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు.
కేపు కుమారుడి మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా అతడి అభిమానులు... రియల్ మాడ్రిడ్, ఇంటర్ మిలన్, బ్రెజిల్ మాజీ జట్టు ఎఎస్ రోమా కేపు కుమారుడికి తమ సంతాపాన్ని తెలియజేశాయి. "యూఈఎఫ్‌ఏలో ఉన్న ప్రతి జట్టు తరుపున మీ కుమారుడి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాం'' అని యూఈఎఫ్‌ఏ ట్వీట్ చేసింది.
ఈ విషాద సమయంలో ఫుట్‌బాల్ ప్రపంచం మొత్తం మీ కుటుంబసభ్యులకు అండగా ఉంటుందని యూఈఎఫ్‌ఏ తన ట్విట్టర్‌లో పేర్కొంది. కేఫు 1990 నుంచి 2006 వరకు బ్రెజిల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 1994, 2002 ప్రపంచకప్‌లలో విజేతగా నిలిచిన బ్రెజిల్ జట్టుకు కేఫు కెప్టెన్‌గా వ్యవహారించాడు.
కేపు కెప్టెన్సీలో మూడుసార్లు ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్న బ్రెజిల్ జట్టు రెండు సార్లు విశ్వ విజేతగా నిలించింది. పుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కేఫు ప్రస్తుతం ఫిఫా తరపున 2022లో ఖతార్ వేదికగా జరగనున్న పుట్ బాల్ వరల్డ్‌కప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహారిస్తున్నాడు.