AIFF President Elections : అధ్యక్ష పదవి కోసం రాజకీయ నాయకుల, మాజీ ప్లేయర్ల పోటీపోటీ

ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (AIFF) అధ్యక్షుడి స్థానం కోసం మాజీ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ఆటగాళ్లు, రాజకీయ నాయకులు ఘోరంగా పోటీకి సిద్ధమయ్యారు. ఈ స్థానం కోసం హెవీ కాంపిటేషన్ నెలకొంది. ఆగస్టు 28న జరగనున్న AIFF అధ్యక్ష ఎన్నికలకు ఏడుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. టీమిండియా మాజీ కెప్టెన్ భైచుంగ్ భూటియా (45), అలాగే మాజీ ప్లేయర్ మోహన్ బగాన్, మాజీ ఈస్ట్ బెంగాల్ గోల్‌కీపర్‌ మరియు రాజకీయ నాయకుడు కళ్యాణ్ చౌబే (45) ఈ స్థానం కోసం మల్లగుల్లాలు పడుతూ టాప్ కంటెండర్ రేసులో ఉన్నారు.

మమతా బెనర్జీ సోదరుడు సైతం..

మమతా బెనర్జీ సోదరుడు సైతం..

ఆ తర్వాత మాజీ కేంద్ర మంత్రి దివంగత జస్వంత్ సింగ్ కుమారుడు, రాజస్థాన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (RFA) అధ్యక్షుడు అయిన కాంగ్రెస్ నాయకుడు మన్వేంద్ర సింగ్ కూడా బరిలోకి దిగాడు. ఫుట్‌బాల్ విశ్లేషకుడు, ఢిల్లీ ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు షాజీ ప్రభాకరన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సోదరుడు అజిత్ బెనర్జీ, కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే N.A. హరీస్ సైతం ఈ స్థానం కోసం అర్రులు చాచుతున్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వలంకా నటాషా అలెమావో అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన ఏకైక మహిళా అభ్యర్థిగా నిలిచింది.

ఆగస్టు 3న సుప్రీంకోర్టు ఆదేశాలు

ఆగస్టు 3న సుప్రీంకోర్టు ఆదేశాలు

ఎఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నియమించేందుకు కోర్టు నియమించిన కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఏవో) ఎన్నికలు నిర్వహించాలని ఆగస్టు 3న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. ట్రెజరర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల స్థానాలతో కూడిన ప్యానెల్ కోసం ఓటింగ్ ఆగస్టు 28న షెడ్యూల్ అయింది. ఎగ్జిక్యూటివ్ కమిటీలో స్థానం కోసం పోటీలో ఉన్నవారిలో మాజీ భారత మిడ్‌ఫీల్డర్ యూజెనెసన్ లింగ్‌డో (36) ఉన్నాడు. మావ్‌ఫ్లాంగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే అతను.

2009నుంచి ప్రపూల్ పటేలే..

2009నుంచి ప్రపూల్ పటేలే..

AIFF అధ్యక్ష పదవిని ఈ ఏడాది మే వరకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) ఎంపీ ప్రఫుల్ పటేల్ నిర్వర్తించారు. 2009లో తొలిసారిగా ఈ పదవికి ఎన్నికైన పటేల్.. 2012లో, 2016లో మళ్లీ ఎన్నికయ్యారు. 2017లో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న నిర్ణయాన్ని పేర్కొంటూ 2020లో తన పదవీకాలం ముగిసినప్పటికీ ఈ ఏడాది ఆరంభం వరకు పదవిలో కొనసాగారు. ఇక ఏఐఎఫ్ఎఫ్‌లో అతి రాజకీయం పెరిగిపోవడడంతో.. FIFA గవర్నింగ్ బాడీ.. ఆగస్టు 15న AIFFని నిరవధికంగా సస్పెండ్ చేసింది. రాజకీయ పరంగా అనవసరమైన జోక్యం బాగా పెరిగిపోయిందని కూడా పేర్కొంది.

అంతర్జాతీయ పోటీలకు భారత జట్టు అనర్హత

అంతర్జాతీయ పోటీలకు భారత జట్టు అనర్హత

దీంతో నిషేధం కారణం.. భారత ఫుట్ బాల్ జట్లు ఏ అంతర్జాతీయ పోటీలో పాల్గొనలేవు. సస్పెన్షన్‌ను ఎత్తివేయకుంటే.. అక్టోబర్ 11న ప్రారంభం కానున్న ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వలేకపోవచ్చు. గత వారం దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని పలు విషయాల మీద ఆదేశించింది. AIFF‌పై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయవడడానికి తగిన"ప్రోయాక్టివ్ చర్యలు" కేంద్రం తీసుకోవాలని పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ సోమవారం జరగనుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Sunday, August 21, 2022, 18:43 [IST]
Other articles published on Aug 21, 2022

Latest Videos

  + More
  + మరిన్ని
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Yes No
  Settings X