న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

చెవిటి పిల్లి ఓటు రష్యాకే: ఆరంభ మ్యాచ్‌లో గెలుపెవరిది?

By Nageshwara Rao
Fifa World Cup 2018 : Cat, Predicts The Winner For World Cup Opener
Fifa World Cup oracle Achilles the cat predicts Russia to win first match

హైదరాబాద్: ఫిఫా వరల్డ్‌కప్‌కు సర్వం సిద్ధమైంది. గురువారం మాస్కోలోని లుజ్నికి స్టేడియంలో జరిగే ఆరంభ వేడుకతో సాకర్ సంరంభం అధికారికంగా ప్రారంభమవుతుంది. ఆరంభ వేడుకల అనంతరం ఇదే స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య రష్యా, సౌదీ అరేబియాతో తలపడనుంది.

వరల్డ్ కప్‌లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్‌ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్

అయితే, ఈ ఆరంభ మ్యాచ్‌లో గెలుపెవరిది? అంటే.. ఆతిథ్య జట్టుకే తన ఓటు అంటోంది రష్యాకు చెందిన చెవిటి పిల్లి అచిల్లె. ఇక్కడ విశేషం ఏంటంటే గత ఎనిమిది నెలలుగా రష్యా ఒక్క విజయం కూడా సాధించలేదు. వరల్డ్ కప్ మ్యాచ్ ఫలితాలను అంచనా వేయడానికి అచిల్లెకు ప్రత్యేక శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే.

 రష్యా పతాకాన్ని ఎంచుకున్న పిల్లి

రష్యా పతాకాన్ని ఎంచుకున్న పిల్లి

రెండు దేశాల జాతీయ జెండాలను ముందుంచితే, రష్యా పతకాన్ని పిల్లి ఎంచుకుంది. ఇక.. జర్మనీలోని చెమ్‌నిట్జ్‌ పార్క్‌కు చెందిన ఓలోజ అనే పులి మాత్రం తొలి పోరు ఫలితాన్ని భిన్నంగా ఊహించింది. రెండు దేశాల జెండాల బాక్స్‌లను ముందుంచగా.. దేనిని ముట్టుకోకుండా తన ఫలితాన్ని పరోక్షంగా డ్రాగా నిర్ధారించింది.

అచిల్లె అంచనా ఎంతవరకు నిజమౌతుందో

అచిల్లె అంచనా ఎంతవరకు నిజమౌతుందో

అచిల్లె అంచనా ఎంతవరకు నిజమౌతుందో తెలియాలంటే మ్యాచ్‌ అయ్యేవరకు వేచి చూడాల్సిందే. 2010 వరల్డ్ కప్ సమయంలో ఆక్టోపస్‌ పాల్‌ ఇదే విధంగా మ్యాచ్‌ ఫలితాలను అంచనా వేసింది. ఫైనల్‌ విజేతతో పాటు అది చెప్పిన మ్యాచ్ ఫలితాలన్నీ సరిగానే వచ్చిన సంగతి తెలిసిందే.

మాస్కో వేదికగా గురువారం సాకర్ సంరంభం మొదలు

మాస్కో వేదికగా గురువారం సాకర్ సంరంభం మొదలు

రష్యా వేదికగా గురువారం సాకర్ సంరంభం మొదలుకానుంది. అనేక అవాంతరాలను దాటొచ్చిన రష్యా ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది 21వ ఫిఫా వరల్డ్ కప్ కావడం విశేషం. మొత్తం 32 జట్లు ఎనిమిది గ్రూలుగా విడిపోయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఆతిథ్య జట్టు హోదాలో రష్యా గ్రూప్‌-ఎలో బరిలో నిలిచింది.

జూన్ 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు

జూన్ 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు

జూన్ 28వ వరకు గ్రూప్‌ దశ పోటీలు ఉంటాయి. ఎనిమిది గ్రూప్‌ల్లోని నాలుగేసి జట్లు... మిగతా మూడు జట్లతో ఒక్కో మ్యాచ్‌లో పోటీ పడతాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2 జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి. 30 నుంచి నాకౌట్‌ దశ మొదలవుతుంది. జూలై 15న జరిగే తుదిపోరుతో టోర్నీ ముగుస్తుంది.

మొత్తం 64 మ్యాచ్‌లు

మొత్తం 64 మ్యాచ్‌లు

మెగా టోర్నీ కోసం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన 11 నగరాల్లోని 12 స్టేడియాల్లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు మాస్కోలోని లుజ్నినికి స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. 2022 టోర్నీలో 48 జట్లను ఆడించాలని ఫిఫా భావిస్తున్న నేపథ్యంలో 32 జట్ల ఫార్మాట్‌ ఈ సారే ఆఖరిదయ్యే అవకాశం కనిపిస్తోంది.

Story first published: Thursday, June 14, 2018, 12:19 [IST]
Other articles published on Jun 14, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X