న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

అనుకోకుండా గోల్ చేశాడని తుపాకీతో కాల్చి చంపేశారు

FIFA World Cup moments: How Colombias Andres Escobars own goal against USA cost him his life in 1994

హైదరాబాద్: అనుకోకుండా గోల్ చేశాడు. అదీ సెల్ప్ గోల్ చేయడంతో అతని ద్వారానే ప్రత్యర్థి జట్టుకు ఒక పాయింట్ వచ్చి చేరింది. ఇది 1994 ప్రపంచ కప్ మ్యాచ్‌లో విషయం. కొలంబియా ఫుట్‌బాలర్ ఆండ్రెస్ ఎస్కోబార్ చేసిన పొరపాటు ఏకంగా అతని ప్రాణాలనే బలిగొంది. 1994 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్లుగా అమెరికాలో అడుగిడిన కొలంబియా జట్టుకు తొలిమ్యాచ్‌లో రొమేనియా షాకిచ్చింది.

ఆ పరాజయంతో కొలంబియా కూలబడి.. యూఎస్‌తో జరిగే రెండోమ్యాచ్‌లో విజయం కోసం ఆరాటపడింది. ఇది గెలిచి రెండోరౌండ్‌కు చేరాలన్న కొలంబియా ఆశ నీరుగారింది. అమెరికాతో జరిగిన మ్యాచ్ ప్రథమార్ధం 34వ నిమిషంలో కొలంబియా డిఫెండర్ ఎస్కోబార్ తీవ్ర తప్పిదం చేశాడు. గోల్‌పోస్ట్ సమీపంలో జాన్‌హార్కర్ క్రాస్ ఆపే ప్రయత్నంలో తడబడి సొంత గోల్‌పోస్టులోకి బంతిని పంపాడు.

అతని కారణంగా అమెరికాకు అనుకోకుండా ఒక పాయింట్ వచ్చి చేరడంతో.. 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు ఈ మ్యాచ్‌లో 2-1 గోల్స్‌తో అమెరికా విజయం సాధించి రెండోరౌండ్ చేరగా..కొలంబియా జట్టు ఓడిపోయి ఇంటికి చేరింది. ఈ ఓటమితో కొలంబియా గెలుస్తుందని పెద్ద మొత్తంలో డబ్బును బెట్టింగ్ కట్టింది ఓ మాఫియా ముఠా.

తీవ్రంగా నష్టపోవడంతో మ్యాచ్ ముగిసిన కొన్నాళ్లకు క్లబ్‌కు వెళ్లి తిరిగొస్తున్న ఎస్కోబార్‌ను పార్కింగ్ ప్రదేశంలో ఆరు సార్లు తుపాకీతో కాల్చారు. ఆ ఫైరింగ్ జరుగుతుండా హంతకులు గోల్.. గోల్.. నువ్వు తప్పు గోల్ చేయడమే దీనికి కారణమనుకుంటూ హత్య చేశారు. ఇది ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత విషాదకరమై ఘటనగా మిగిలిపోయింది.

Story first published: Thursday, May 31, 2018, 10:51 [IST]
Other articles published on May 31, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X