భారీ వ్యయంతో పాటు అందంగా: రష్యాలో ఫిఫా వరల్డ్‌కప్ జరిగే 12 స్టేడియాలివే

FIFA World Cup: Guide to the 12 stadiums across Russia

హైదరాబాద్: సాకర్ సంరంభానికి సర్వం సిద్ధమైంది. రష్యా వేదికగా 21వ ఫిఫా వరల్డ్ కప్ మరో ఆరు రోజుల్లో ఆరంభం కానుంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌. దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఇదొక సాధారణ టోర్నమెంట్ ఎంతమాత్రం కాదు. ఫిఫా వరల్డ్ కప్ అంటే అభిమానులకు ఫీవర్ వస్తోంది.

ఈ వరల్డ్ కప్ చూసేందుకు గాను ఖండాంతరాలను అభిమానులు వస్తారు. వరల్డ్‌కప్ పుట్‌బాల్ మ్యాచ్‌లను చూసేందుకు స్టేడియాలకు లక్షల్లో ప్రేక్షకులు వస్తారు. ఇక, టీవీల్లో చూసే వారి సంఖ్య గురించి చెప్పలేం. ఈ సంఖ్య కోట్లకుపైనే ఉంటుంది. ఈ వరల్డ్‌కప్ మ్యాచ్‌ల కోసం లెక్కచేయరు.

అంతటి మహత్యం ఈ ఫిఫా వరల్డ్ కప్‌కు మాత్రమే ఉంది. యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోన్న ఈ ఫిఫా వరల్డ్‌కప్ కోసం రష్యా సర్వం సిద్ధం చేసింది. ఫ్యాన్స్‌ను మైమరపించే ఈ టోర్నీ కోసం ఆతిథ్య రష్యా వేల కోట్ల రూపాయలు వెచ్చించి 12 స్టేడియాలను అత్యున్నతంగా తీర్చిదిద్దింది. ఆ వివరాలు మీకోసం...

స్టేడియం: లుజ్నికి, నగరం: మాస్కో

స్టేడియం: లుజ్నికి, నగరం: మాస్కో

ఇదే ప్రధాన స్టేడియం. 1950లోనే నిర్మించిన ఈ స్టేడియాన్ని పూర్తిగా ఆధునీకరించారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌ కోసం తయారు చేసిన అథ్లెటిక్‌ ట్రాక్‌ మార్చేసి పూర్తి ఫుట్‌బాల్‌ వేదికగా పునర్నిర్మించారు.
సామర్థ్యం: 81,006
వ్యయం: రూ.2,752 కోట్లు.
మ్యాచ్‌లు: 7
Thursday, June 14: Russia v Saudi Arabia (Group A) 4pm
Sunday, June 17: Germany vs Mexico (Group F) 4pm
Wednesday, June 20: Portugal vs Morocco (Group B) 1pm
Tuesday, June 26: Denmark vs France (Group C) 3pm
LAST 16 Sunday, July 1: 1B v 2A 3pm (Match 51)
SEMI-FINAL Wednesday, July 11: Winner match 59 v winner match 60 7pm
FINAL Sunday, July 15 4pm

స్టేడియం: స్పార్టక్, నగరం: మాస్కో

స్టేడియం: స్పార్టక్, నగరం: మాస్కో

రోమన్ల బానిసత్వంపై పోరాడిన యోధుడు స్పార్టకస్‌ పేరుతో నిర్మించిన ఈ స్టేడియాన్ని 2014లో అందుబాటులోకి తెచ్చారు. చాంపియన్స్‌ లీగ్, కాన్ఫెడరేషన్స్‌ కప్‌కు ఈ వేదిక ఆతిథ్యమిచ్చింది. రష్యాలో ప్రభుత్వేతర నిధులతో నిర్మించిన వరల్డ్‌కప్ స్టేడియం ఇదొక్కటే.
సామర్థ్యం: 43,298
వ్యయం: రూ. 1,680 కోట్లు.
మ్యాచ్‌లు: 5
Four group games, one last-16 game.
Saturday, June 16: Argentina vs Iceland (Group D) 2pm
Tuesday, June 19: Poland vs Senegal (Group H) 1pm
Saturday, June 23: Belgium vs Tunisia (Group B) 1pm
Tuesday, June 26: Serbia vs Brazil (Group C) 3pm
LAST 16 Tuesday, July 3: 1H v 2G 7pm (Match 56)

 స్టేడియం: సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, నగరం: సెయింట్‌ పీటర్స్‌బర్గ్

స్టేడియం: సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌, నగరం: సెయింట్‌ పీటర్స్‌బర్గ్

ఈ పీటర్స్‌బర్గ్‌ ఎరీనా స్పేస్‌షిప్‌ను తలపిస్తుంది. ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చారు. కాన్ఫెడరేషన్స్‌ కప్‌ పోటీలు జరిగాయి. రష్యాలోని వరల్డ్‌కప్ నిర్మాణ పనుల్లో మొత్తం 17 మంది మరణిస్తే, ఈ ఒక్క స్టేడియం నిర్మాణ పనుల్లో 8 మంది చనిపోయారు.
సామర్థ్యం: 68,134
వ్యయం: రూ. 4,935 కోట్లు
మ్యాచ్‌లు: 7
Friday, June 15: Morocco vs Iran (Group B) 4pm
Tuesday, June 19: Russia vs Egypt (Group A) 7pm
Friday, June 22: Brazil vs Costa Rica (Group E) 1pm
Tuesday, June 26: Nigeria vs Argentina (Group D) 7pm
LAST 16 Tuesday, July 3: 1F v 2E 3pm (Match 55)
SEMI-FINALS Tuesday, July 10: Winner match 57 v winner match 58 7pm
THIRD-PLACE PLAY-OFF Saturday, July 14 3pm

స్టేడియం: ఫిష్ట్, నగరం: సొచీ

స్టేడియం: ఫిష్ట్, నగరం: సొచీ

సొచీ వింటర్‌ ఒలింపిక్స్‌ కోసం నిర్మించిన ఈ స్టేడియాన్ని ఫుట్‌బాల్‌ వరల్డ్ కప్ కోసం నవీకరించారు. రష్యా డోపింగ్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఇక్కడే.
సామర్థ్యం: 47,700
వ్యయం: రూ. 2,686 కోట్లు.
మ్యాచ్‌లు: 6
Friday, June 15: Portugal vs Spain (Group B) 7pm
Monday, June 18: Belgium vs Panama (group G) 4pm
Saturday, June 23: Germany vs Sweden (Group F) 4pm
Tuesday, June 26: Australia vs Peru (Group C) 3pm
LAST 16 Saturday, June 30: 1A v 2B 7pm (Match 49)
QF Saturday, July 7: Winner match 51 v winner match 52 7pm (Match 59)

స్టేడియం: కజన్‌ ఎరీనా, నగరం: కజన్

స్టేడియం: కజన్‌ ఎరీనా, నగరం: కజన్

రష్యా కొత్త తరం ఫుట్‌బాల్‌ స్టేడియం ఇది. 2013లో అందుబాటులోకి తెచ్చారు. కొత్త కొత్త స్టేడియాలకు ఇదో నమూనాగా నిలిచింది. నాలుగు లీగ్‌ మ్యాచ్‌లు, రెండు నాకౌట్‌ పోటీలు జరుగుతాయి.
సామర్థ్యం: 44,779
వ్యయం: రూ. 1,680 కోట్లు.
మ్యాచ్‌లు: 6
Saturday, June 16: France vs Australia (Group C) 11am
Wednesday, June 20: Iran vs Spain (Group B) 7pm
Sunday, June 24: Poland vs Colombia (Group H) 7pm
Wednesday, June 27: South Korea vs Germany (Group F) 3pm
LAST 16 Saturday, June 30: 1C v 2D 3pm (Match 50)
QF Friday, July 6: Winner match 53 v winner match 54 7pm (Match 58)

స్టేడియం: సమర ఎరెనా, నగరం: సమర

స్టేడియం: సమర ఎరెనా, నగరం: సమర

నగర శివారులో వోల్గా నదికి సమీపంలో ఈ స్టేడియాన్ని కొత్తగా నిర్మించారు. రష్యా స్పేస్‌ చరిత్రకు తగ్గట్టుగా దీని నిర్మాణం ఉంటుంది. ప్రిక్వార్టర్స్, క్వార్టర్స్‌తో పాటు ఆరు మ్యాచ్‌లు ఇక్కడ జరుగనున్నాయి.
సామర్థ్యం: 44,807
వ్యయం: రూ. 2,081 కోట్లు.
మ్యాచ్‌లు: 6
Four group games (including Russia's third and final group match), one last-16 game, one quarter-final.
Sunday, June 17: Costa Rica vs Serbia 1pm
Thursday, June 21: Denmark vs Australia (Group C) 4pm
Monday, June 25: Uruguay vs Russia (Group A) 3pm
Thursday, June 28:Senegal vs Colombia (Group H) 3pm
LAST 16 Monday, July 2: 1E v 2F 3pm (Match 53)
QF Saturday, July 7: Winner match 55 v winner match 56 3pm (Match 60)

స్టేడియం: నిజ్ని నోవ్‌గోరోడ్, నగరం: నిజ్ని నోవ్‌గోరోడ్‌

స్టేడియం: నిజ్ని నోవ్‌గోరోడ్, నగరం: నిజ్ని నోవ్‌గోరోడ్‌

ఓకా, వోల్గా నదుల సంగమం వద్ద ఈ స్టేడియాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రపంచకప్‌ ఆతిథ్య వేదికల్లో డిజైనింగ్‌తో ఆకట్టుకునే స్టేడియం ఇదే.
సామర్థ్యం: 45 వేలు
వ్యయం: రూ. 2,060 కోట్లు.
మ్యాచ్‌లు: 6
Monday, June 18: Sweden vs South Korea (Group F) 1pm
Thursday, June 21: Argentina vs Croatia (Group D) 7pm
Sunday, June 24: England vs Panama (Group G) 1pm
Wednesday, June 27: Switzerland vs Costa Rica (Group E) 7pm
LAST 16 Sunday, July 1: 1D v 2C 7pm (Match 52)
QUARTER-FINAL Friday, July 6: Winner match 49 v winner match 50 3pm (Match 57)

స్టేడియం: రొస్తోవ్‌ ఎరీనా, నగరం: రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌

స్టేడియం: రొస్తోవ్‌ ఎరీనా, నగరం: రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌

దక్షిణ రష్యా ప్రాంతమైన ఇక్కడ ఉక్కపోత పెద్ద సమస్య. రష్యాలోని మిగతా వేదికల్లో చల్లచల్లగా ఆడిన ఆటగాళ్లకు రొస్తోవ్‌ ఆన్‌ డాన్‌ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయి. డాన్‌ నదికి చేరువగా ఉంటుందీ స్టేడియం.
సామర్థ్యం: 45,145,
వ్యయం: రూ. 2,215 కోట్లు
మ్యాచ్‌లు: 5
Sunday, June 17: Brazil vs Switzerland (Group E) 7pm
Wednesday, June 20: Uruguay vs Saudi Arabia (Group A) 4pm
Saturday, June 23: South Korea vs Mexico (Group F) 7pm
Tuesday, June 26: Iceland vs Croatia (Group D) 7pm
LAST 16 Monday, July 2: 1G v 2H 7pm (Match 54)

స్టేడియం: వొల్గోగ్రాడ్‌ ఎరీనా, నగరం: వొల్గోగ్రాడ్‌

స్టేడియం: వొల్గోగ్రాడ్‌ ఎరీనా, నగరం: వొల్గోగ్రాడ్‌

రెండో ప్రపంచ యుద్ధానికి ఇదో స్మారక నగరం. అందుకే ఇక్కడ స్టేడియాన్ని నిర్మించే సమ యంలో వందల సంఖ్యలో వీర మరణం పొందిన సైనికుల అస్థికలు, ఆనవాళ్లు బయటపడ్డాయి. స్టేడియం అద్భుతంగా కనిపిస్తుంది.
సామర్థ్యం: 45 వేలు
వ్యయం: రూ. 2,014 కోట్లు
మ్యాచ్‌లు: 4
Monday, June 18: Tunisia vs England (Group G) 7pm
Friday, June 22: Nigeria vs Iceland (Group D) 4pm
Monday, June 25: Saudi Arabia vs Egypt (Group A) 3pm
Thursday, June 28: Japan vs Poland (Group H) 3pm

స్టేడియం: ఎకతెరీన్‌బెర్గ్‌ ఎరీనా, నగరం: ఎకతెరీన్‌బర్గ్‌

స్టేడియం: ఎకతెరీన్‌బెర్గ్‌ ఎరీనా, నగరం: ఎకతెరీన్‌బర్గ్‌

జనాభా పరంగా రష్యాలో నాలుగో పెద్ద నగరం ఎకతెరీన్‌బర్గ్‌. ఇక్కడ వృత్తంతో కప్పేసినట్లు అద్భుత మైన నిర్మాణశైలితో కొత్తగా ఎకతెరీన్‌బర్గ్‌ స్టేడియాన్ని రూపొందించారు. ప్రేక్షకుల రద్దీని బట్టి 12 వేల సీట్ల సామర్థ్యాన్ని తాత్కాలికంగా పెంచుకోవచ్చు.
సామర్థ్యం: 35,696
వ్యయం: రూ. 1,476 కోట్లు
మ్యాచ్‌లు: 4
Friday, June 15: Egypt vs Uruguay (Group A) 1pm
Thursday, June 21: France vs Peru (Group C) 1pm
Sunday, June 24: Japan vs Senegal (Group H) 4pm
Wednesday, June 27: Mexico vs Sweden (Group F) 3pm

స్టేడియం: మార్దోవియా ఎరీనా, నగరం: శరన్స్క్‌

స్టేడియం: మార్దోవియా ఎరీనా, నగరం: శరన్స్క్‌

కేవలం 3 లక్షల మంది ఉన్న శరన్స్క్‌ నగరాన్ని ఫిఫా వేదికను చేయడం ఆశ్చర్యకరం. మాస్కోకు చాలా దూరంగా ఉంటుంది. మిగతా 11 ఆతిథ్య నగరాలతో పోల్చితే చాలా చిన్న నగరం.
సామర్థ్యం: 44,442,
వ్యయం: రూ. 1,980 కోట్లు
మ్యాచ్‌లు: 4
Saturday, June 16: Peru vs Denmark (Group C) 5pm
Tuesday, June 19: Colombia vs Japan (Group H) 4pm
Monday, June 25: Iran vs Portugal (Group B) 7pm
Thursday, June 28: Panama vs Tunisia (Group G) 7pm

స్టేడియం: కలినిన్‌గ్రాడ్, నగరం: కలినిన్‌గ్రాడ్‌

స్టేడియం: కలినిన్‌గ్రాడ్, నగరం: కలినిన్‌గ్రాడ్‌

కలినిన్‌గ్రాడ్‌ నగరం రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జర్మనీ భూభాగం. అందుకే రష్యా భూభాగానికి వేరుపడినట్లు ఉంటుంది. ఇక్కడ కాంపాక్ట్‌ స్టేడియాన్ని సాధారణ నమూనాతో నిర్మించారు. కేవలం ఈ ఫిఫా ప్రపంచకప్‌ కోసమే దీనిని చాలా వేగంగా నిర్మించారు.
సామర్థ్యం: 35,212,
వ్యయం: రూ. 2,014 కోట్లు.
మ్యాచ్‌లు: 4
Saturday, June 16: Croatia vs Nigeria (Group D) 8pm
Friday, June 22: Serbia vs Switzerland (Group E) 7pm
Monday, June 25: Spain vs Morocco (Group B) 7pm
Thursday, June 28: England vs Belgium (Group G) 7pm

For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  మైఖేల్‌లో ఫాంటసీ పుట్‌బాల్ ఆడండి. బహుమతులు గెలవండి

  Story first published: Saturday, June 9, 2018, 13:34 [IST]
  Other articles published on Jun 9, 2018
  + మరిన్ని
  POLLS

  Get breaking news alerts from myKhel

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Mykhel sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Mykhel website. However, you can change your cookie settings at any time. Learn more