మ్యాచ్ సగమైంది, 64 మంది చనిపోయారని..

Posted By:
Fans in Russia stay silent in tribute to victims of Kemerovo fire

హైదరాబాద్: మంచి స్కోరుతో దూసుకెళ్తున్న జట్టు అనుకోకుండా ఒక్కసారిగా ఆగిపోయింది. అంతేకాదు. అంతా ఒక్కచోటుకు చేరి మౌనంగా ఉండిపోయారు. ముందు ఆశ్చర్యం వేసినా.. విషయం తెలిసిన తర్వాత అందరూ విషాదంలోకి వెళ్లిపోయారు. రష్యాలోని దేశీవాలీ ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జరిగిన సంఘటన ఇది. స్పార్టాక్ మాస్కో జట్టు, అర్సెనల్ తులా జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది.

దాదాపు మ్యాచ్ సగం సమయం పూర్తయిపోయింది. స్పార్టాక్ మాస్కో జట్టు 2-1 స్కోరుతో ఆధిక్యంలో ఉంది. అయితే అనుకోకుండా స్థానికంగా ఉన్న షాఫింగ్ కాంప్లెక్స్ లో అగ్ని ప్రమాదం జరిగిందనే విషయం తెలిసింది. ఆ ప్రమాదంలో 64మంది వరకు చనిపోయారని, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారని తెలియడంతో ఆ జట్టు మ్యాచ్ ఆపేసింది. కాసేపు అంతా ఒక చోటకు చేరి మౌనంగా నిలిచిపోయారు.

ఈ విషయం గురించి స్పార్టాక్ మాస్కో కెప్టెన్ డెనిస్ గ్లుషకొవ్ మాట్లాడుతూ.. 'మొదటి భాగం కష్టపడి ఆడాం. రెండో భాగం ఆడేందుకు మా మనసు సహకరించలేదు. అలాగే గుండె నిబ్బరంతో ఆడాం. ఎట్టకేలకు శనివారం మ్యాచ్ ను గెలవగలిగాం.' అని తెలిపాడు.

ఓటమికి గురైన అర్సెనల్ తులా జట్టు కెప్టెన్ మాట్లాడుతూ.. చనిపోయిన వారికి గౌరవార్థం మ్యాచ్ ను కాసేపు ఆపేసి మళ్లీ మొదలుపెట్టాం. చాలా జట్లు ఈ ఘటనకు స్పందించాయి. క్రీడాకారులంతా మ్యాచ్ జరిగినంతసేపు మౌనంగానే ఆడారు' అని తెలిపాడు.

Story first published: Monday, April 2, 2018, 17:08 [IST]
Other articles published on Apr 2, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి