న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

బెంగళూరు హవా: ఎట్టకేలకు ఐఎస్ఎల్‌లో విజయం

By Nageshwara Rao

హైదరాబాద్: మూడు రోజుల క్రితం అంగరంగ వైభవంగా మొదలైన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో ఓ జట్టు విజయాన్ని నమోదు చేసింది. టోర్నీలో భాగంగా జరిగిన తొలి రెండు మ్యాచ్‌లు ఒక్క గోల్ కూడా నమోదు కాకుండా డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన రెండు మ్యాచ్‌లలో గోల్స్ నమోదయ్యాయి. ఎఫ్‌సీ గోవా-చెన్నయిన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా 3-2తో చెన్నయిన్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్దభాగం గోవా జట్టు తన హవాని కొనసాగించింది.

25వ నిమిషంలో ఫెరాన్‌ గోవా తరుపున తొలి గోల్ నమోదు చేశాడు. ఆ తర్వాత 14 నిమిషాల వ్యవధిలో మరో రెండు గోల్స్‌ చేసిన గోవా 3-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ఈ రెండు గోల్స్‌ను మాన్యువల్‌, మందర్‌రావు చేశారు. చివర్లో ఆట ముగుస్తుందనగా... చెన్నై రెండు గోల్స్‌ సాధించింది. చెన్నయిన తరుపున ఇనిగో కాల్‌డెరొన్‌ (70వ ని), రఫెల్‌ అగస్టో (84వ ని) గోల్స్‌ నమోదు చేశారు.

మరో మ్యాచ్‌లో బెంగళూరు 2-0తో ముంబైపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి అర్ధభాగంలో రెండు జట్లు గోల్ చేయలేదు. రెండో అర్ధభాగంలో 67వ నిమిషంలో ఎడు గర్సియా గోల్‌ చేయడంతో బెంగళూరు తొలి గోల్ నమోదు చేసింది. ఆ తర్వాత ఉదాంతాసింగ్‌ కార్నర్‌ నుంచి ఇచ్చిన పాస్‌ను గోల్‌పోస్ట్‌ ముందు అందుకున్న గర్సియా గోల్‌ చేశాడు.

ఆ తర్వాత స్కోరు సమం చేయడానికి ముంబై గట్టిగానే ప్రయత్నించింది. అయితే బెంగళూరు ఆటగాడు సునీల్ ఛెత్రి అందుకు అవకాశమివ్వలేదు. కీలక సమయంలో గోల్‌ చేసి ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఛెత్రి... 93వ నిమిషంలో గోల్‌ చేయడంతో బెంగళూరు 2-0తో విజయం సాధించింది.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, November 20, 2017, 10:16 [IST]
Other articles published on Nov 20, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X