ఫుట్‌బాల్‌కు దూరమై.. మనస్తాపంతో మేనేజర్ ఆత్మహత్య

Posted By:
Dermot Drummy: Former football boss took own life

హైదరాబాద్: క్రీడలంటే ఆసక్తి కాదు అంతకంటే ఎక్కువగా భావించి బతికేవాళ్లుంటారు. ఒక్కోసారి అలాంటి ఆట దూరమైతే ఎంతటికైనా వెళ్లే అభిమానులు ఉంటారు. కానీ, మరీ దారుణంగా 56ఏళ్ల వయస్సులో కూడా ఫుట్‌బాల్‌కు దూరమైయ్యాడని ఆత్మహత్య చేసుకున్నాడు చిల్సీ జట్టు మాజీ మేనేజర్. డెర్మాట్ డ్రమ్మీ అనే వ్యక్తి గతేడాది మే నెలలో ఓ ప్రైవేటు కంపెనీతో చేసుకున్న ఒప్పందం ముగియడంతో మేనేజర్ పదవి నుంచి వైదొలిగాడు. ఆ తర్వాత నుంచి అతని మానసికంగా కుదురుకోలేదు.

కొన్ని రోజుల తర్వాత ఇంటి నుంచి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు పోలీసులను సంప్రదించడంతో దర్యాప్తు మొదలైంది. ఈ నేపథ్యంలో నవంబరు 27వ తేదీ నిర్జీవంగా దొరికాడు. అతని అసిస్టెంట్ హెర్ట్‌ఫోర్డ్ ఎడ్వర్ట్ సహాయంతో శవాన్ని గుర్తించారు.

సూసైడ్ లెటర్‌లో:
దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఉడ్‌ల్యాండ్ ప్రాంతంలో సరిగ్గా 12:29 నిమిషాలకు అతని శవం కనిపించింది. ఆయన దుస్తుల్లో ఓ లెటర్‌ను గమనించారు. అందులో 'మీరు నన్ను క్షమిస్తారని ఆశపడుతున్నాను' అని రాసి ఉంది. అతని సన్నిహిత వ్యక్తి డెట్ కాన్ ఆడమ్స్ దీనిని గురించి మాట్లాడుతూ.. ఏ కారణం లేకుండా ఇలా జరగడం చాలా బాధాకరంగా ఉందని తెలిపాడు.

డ్రమ్మీ ఎవరు:
డ్రమ్మీ అర్సెనల్ జట్టు మాజీ ఆటగాడు. చిల్సీ అకాడమీ యజమానిగా కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించాడు. అనుకోని కారణాల రీత్యా తర్వాత మేనేజర్‌గా మారాడు. దానికంటే ముందు అంతర్జాతీయ జట్టుకు ఫుట్‌బాల్ ప్రధాన కోచ్‌గా వ్యవహరించాడు.

Story first published: Friday, April 6, 2018, 16:30 [IST]
Other articles published on Apr 6, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి