న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

షాంఘై షెన్హువాతో కార్లోస్ తెవెజ్ బంధం

అర్జెంటీనా ఇంటర్నేషనల్ కార్లోస్ టెవెజ్ ప్రస్తుతం తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బోకా జూనియర్స్ నుంచి చైనీస్ సూపర్ లీగ్ (సిఎస్ఎల్) ఫ్రాంచైసీ షాంఘై షెన్హువాలో చేరాడు.

By Nageshwara Rao

షాంఘై: అర్జెంటీనా ప్లేయర్, మాంఛెస్టర్ యునైటెడ్ అండ్ మాంఛెస్టర్ సిటీ మాజీ ప్లేయర్ కార్లోస్ తెవెజ్ చైనాకు చెందిన క్లబ్‌తో సంతకం చేశాడు. చైనా సూపర్ లీగ్ (సిఎస్ఎల్)కు చెందిన ఫ్రాంచైసీ షాంఘై షెన్హువాతో గురువారం ఒప్పందంపై సంతకాలు చేశాడు. కార్లోస్ తెవెజ్‌కు షాంఘై షెన్హువా ఫ్రాంచైసీ యాజమాన్యం భారీ మొత్తంలో నిధులు ముట్టజెప్పింది.

బ్యైనోస్ ఎయిర్స్‌కు చెందిన బొకా జూనియర్స్ ప్లేయర్ కార్లోస్ తెవేజ్ (32)ను తీసుకోవడం గొప్ప విస్తరణ అని షెన్హువా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. కార్లోస్ తెవెజ్ రాకతో గ్రీన్ లాండ్ షెన్హువాతోపాటు చైనాలోని ఇతర క్లబ్ లు, ఆసియా ఖండ టోర్నీల్లో తమ జట్టుకు కలిసి వస్తుందని షాంఘై షెన్హువా భావిస్తోంది.

తెవెజ్‌ను రెండేళ్ల పాటు తమ జట్టులో కొనసాగించేందుకు షాంఘై షెన్హువా 84 మిలియన్ల డాలర్ల ఒప్పందంతో సంతకం చేసుకున్నట్లు అర్జెంటీనా మీడియా వార్తాకథనాలు ప్రచురించింది. ఇది ఇంతకుముందు కార్లోస్ పొందిన రెమ్యునరేషన్ కంటే 20 రెట్లు అధికం. జపాన్ లోని ఒకినావా ద్వీపంలో ప్రాక్టీస్ లో పాల్గొంటున్న షాంఘై షెన్హువా జట్టుతో త్వరలో కార్లోస్ తెవెజ్ కలువనున్నాడు.

Carlos Tevez signs for Chinese Super League club Shanghai Shenhua

షాంఘై ఎస్ఐపిజి కోచ్ ఆండ్రె విల్లాస్ బోయాస్.. చెల్సియా మిడ్ ఫీల్డర్ ఆస్కార్ కోసం 73 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు గతవారం ధ్రువీకరించారు. చైనాను ఫుట్ బాల్ కు పుట్టినిల్లుగా తీర్చిదిద్దేందుకు 400 మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేయండని అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ పిలుపునిచ్చిన నేపథ్యంలో చైనాలోని వివిధ ఫుట్ బాల్ క్లబ్‌లు యూరప్ యూనియన్ పరిధిలోని క్లబ్‌లకు చెందిన పేరొందిన అంతర్జాతీయ ప్లేయర్లతో కాంట్రాక్టులు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పది రోజుల వ్యవధిలోనే వచ్చే జనవరి, ఫిబ్రవరి నెలల్లో ట్రాన్స్‌ఫర్ విండోలో పలువురు ప్లేయర్లను తీసుకునేందుకు క్లబ్‌లు ప్రయత్నాలు చేస్తోంది. బ్రెజిల్ హుల్క్ గత జూలైలో 55.8 మిలియన్ డాలర్ల మేరకు ఒప్పందంపై సంతకాలు చేశాడు.

సివిల్లా వైపు మాంఛెస్టర్ యునైటెడ్ 'ఆంటోనీ మార్షల్' చూపు
జట్టు భవిష్యత్‌లో ఆడేందుకు గల అవకాశాలు లేకపోవడంతో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇపిఎల్) ఫ్రాంచైసీ మాంచెస్టర్ యునైటెడ్ ఫార్వర్డ్ ప్లేయర్ అంటోనీ మార్షల్ ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నాడు. సివిల్లా టీంలోకి మారేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాడని ఆంటోనీ ఏజెంట్ ఫిలిప్పీ లాంబోలే ధ్రువీకరించాడు.

సివిల్లాలో చేరేందుకు గల అవకాశాలు సవివరంగా అధ్యయనం చేస్తున్నామని లాంబోలే ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. 'సివిల్లా చాలా గొప్ప క్లబ్, లా లీగ లీగ్‌లోనూ మంచి స్థానంలోనే ఉంది. చాంపియన్స్ లీగ్‌లోనూ ఆడుతున్న ఈ క్లబ్‌కు గొప్ప కోచ్ ఉన్నాడు. అదే విషయం మీకు నేను చెప్పదల్చుకున్నా' అని తెలిపాడు.

ప్రస్తుతం మాంఛెస్టర్ యునైటెడ్ ఎఫ్‌సి జట్టులో ఆడేందుకు తనకు చాలా పరిమితులు ఉన్నాయని గుర్తించినట్లు ఆంటోనీ మార్షల్ తెలిపాడు. తనకు కేటాయించిన స్థానంలో ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇది తన ముందు ఉన్న పరీక్ష అని, మానసికంగా ప్లేయర్ తన ఫామ్ పెంచుకున్నా కొద్దీ ఎదుగుదల సాధించొచ్చని, అందుకు మార్గాలు ఏర్పడతాయని అన్నాడు. 'మిమ్మల్ని బెంచ్‌కే పరిమితం చేసినప్పుడు, ఏం చేయాలన్నది మీరు నిర్ణయించుకోవడం కష్ట సాధ్యంగా ఉంటుంది' అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:19 [IST]
Other articles published on Nov 13, 2017
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X