న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

జర్మనీతోపాటు ఆ రెండు జట్లకే చాన్స్: భూటియా జోస్యం

Bhutia backs France, Germany or Spain to lift World Cup

ముంబై: రష్యాలో ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ ప్రారంభానికి మరో 28 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఫిఫాలో సభ్య దేశాలన్నీ టోర్నీకోసం సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ జట్టుతోపాటు ఫ్రాన్స్, స్పెయిన్ జట్లు రష్యా సాకర్ కప్‌ను ఎగరేసుకుపోతాయని భారత్ ఫుట్ బాల్ మాజీ సారధి బైచుంగ్ భూటియా జోస్యం చెప్పారు.

డార్క్ హార్స్‌గా బెల్జియం

డార్క్ హార్స్‌గా బెల్జియం

జూన్ 14వ తేదీ నుంచి ఫిఫా వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానున్నది. అయితే బెల్జియం జట్టు కూడా డార్క్ హార్స్‌గా బరిలో నిలిచే అవకాశం లేకపోలేదని బాయిఛుంగ్ భూటియా వ్యాఖ్యానించాడు. ‘ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే బెల్జియం జట్టుకు కూడా ప్రతిభ ఉంది. ప్రధాన జట్లు ఫ్రాన్స్, జర్మనీ ఫేవరెట్లుగా ఉంటాయి' అని భాయిఛుంగ్ భూటియా మీడియాతో అన్నాడు.

 స్పెయిన్ కప్ తీసుకెళ్లొచ్చునని భూటియా జోస్యం ఇలా

స్పెయిన్ కప్ తీసుకెళ్లొచ్చునని భూటియా జోస్యం ఇలా

ఒక కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆతిథ్యం ఇస్తున్నరష్యా జట్టు గ్రూపు దశలో అడుగు పెడుతుందని, కప్‌ను స్పెయిన్ తీసుకెళ్లవచ్చునని భూటియా జోస్యం చెప్పాడు. మెక్సికోలో జరిగిన 1986 ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో ఇంగ్లండ్ జట్టుపై జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా లెజెండ్ డియాగో మారడోనా గోల్ సాధించి ప్రపంచ కప్ టైటిల్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తాను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు ఇంగ్లండ్ జట్టుపై మారడోనా సాధించిన గోల్ మాదిరిగా ఇంతవరకు గోల్‌చేసిన ప్లేయర్ లేడని బాయిఛుంగ్ భూటియా చెప్పాడు.

అట్లెంటికో మాడ్రిడ్‌కు ఆంటోనీ గ్రైజ్మన్ టాటా

అట్లెంటికో మాడ్రిడ్‌కు ఆంటోనీ గ్రైజ్మన్ టాటా

యురోపా లీగ్ ఫైనల్స్ టోర్నీలో అట్లెంటికో మాడ్రిడ్ క్లబ్ కీలక ప్లేయర్ ఆంటోనీ గ్రైజ్మన్‌కు వీడ్కోలు తెలిపేందుకు సర్వం సిద్ధమైంది. బుధవారం లియాన్‌లో టైటిల్ పోరు జరుగనున్నది. అట్లెంటికో మాడ్రిడ్ జట్టు తరఫున గ్రైజ్మన్ గెలుచుకోకున్న తొలి టైటిల్ కానున్నది. లియాన్‌లో జరిగే మ్యాచ్ ఫలితం ఆంటోనీ గ్రైజ్మన్ భవితవ్యాన్ని ఖరారు చేయనున్నది. ఈ వేసవిలో లాలీగ జెయింట్ క్లబ్‌ల్లో మరొకటైన బార్సిలోనా క్లబ్‌లో గ్రైజ్మన్ చేరిపోతారని భావిస్తున్నారు.

గత వారమే గ్రైజ్మన్ బదిలీపై పుకార్లు

గత వారమే గ్రైజ్మన్ బదిలీపై పుకార్లు

అట్లెంటికో మాడ్రిడ్ జట్టు మరో ప్లేయర్ లూయిస్ సూరెజ్ గతవారమే ఆంటోనీ గ్రైజ్మన్.. బార్సిలోనాలో చేరిపోనున్నాడన్న విషయం తేల్చి చెప్పాడు. ఈ విషయాన్ని అట్లెంటికో మాడ్రిడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మిగౌల్ ఏంజిల్ గిల్ మారిన్ ధ్రువీకరించాడు. బార్సిలోనా క్లబ్ మేనేజ్మెంట్ తీరుతో తాము దిగ్భ్రాంతికి గురయ్యామని చెప్పాడు. అట్లెంటికో మాడ్రిడ్ జట్టు తరఫున నాలుగేళ్ల పాటు ఆడిన ఆంటోన గ్రైజ్మన్.. సక్సెస్ ఫుల్ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ సీజన్‌లో 52 మ్యాచ్‌ల్లో 30 గోల్స్ చేశాడు. లాలీగా టోర్నమెంటులో ఇప్పటివరకు 142 మ్యాచ్‌ల్లో 79 గోల్స్ చేసిన రికార్డు నెలకొల్పాడు.

100 మిలియన్ల యూరోలు చెల్లించిన అట్లెంటికో మాడ్రిడ్

100 మిలియన్ల యూరోలు చెల్లించిన అట్లెంటికో మాడ్రిడ్

ఆంటోనీ గ్రైజ్మన్ జట్టు కోసం అవసరమైన మేరకు పని చేశాడని సహచర స్ట్రైకర్ డియాగో కోస్టా చెప్పాడు. గతేడాదే అట్లెంటికో మాడ్రిడ్ జట్టు నుంచి మాంఛెస్టర్ యునైటెడ్ జట్టులో చేరతాడని చర్చ సాగిందని గుర్తు చేశాడు. ఇదిలా ఉంటే అట్లెంటికో మాడ్రిడ్ మేనేజ్మెంట్ తమ జట్టు నుంచి ట్రాన్స్‌ఫర్ల పై నిషేధం విధించడం ఆంటోనీ గ్రైజ్మన్ మరో క్లబ్‌లో చేరిపోవాలని నిర్ణయించుకోవడానికి కారణంగా తెలుస్తోంది. కానీ నూతన కాంట్రాక్టు అమలు దిశగా గ్రైజ్మన్ ముందడుగు వేయలేడని క్రీడా పండితులు భావిస్తున్నారు. అట్లెంటికో మాడ్రిడ్ జట్టు నుంచి వైదొలగడానికి ముందు జూలై ఒకటో తేదీ లోగా 100 మిలియన్ల యూరోలు చెల్లించాల్సి రావడమే దీనికి కారణం.

Story first published: Wednesday, May 16, 2018, 15:34 [IST]
Other articles published on May 16, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X