న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

ఏకధాటిగా గోల్స్ చేస్తూ.. 20-2తో గెలిచిన బేయర్న్ మునిచ్

Bayern Munich showed no mercy obliterating an amateur club 20-2 in a pre-season friendly

హైదరాబాద్: పుట్‌బాల్ మ్యాచ్‌లో ఏ జట్టు అయినా ఆరుకు మించి గోల్స్ చేయడం చాలా కష్టం. సాధారణంగా ఒకే ఒక్క గోల్ సాధించి విజయం సాధించిన మ్యాచ్‌లే ఎక్కువగా కనిపిస్తాయి. అలా కాదనుకుంటే.. చాలా మ్యాచ్‌ల్లో రెండు జట్లు కలిపి సాధించిన గోల్స్‌ పదిలోపే ఉంటాయి. కొన్ని మ్యాచ్‌ల్లో అయితే ఏ జట్టు ఒక్క గోల్‌ కూడా చేయకపోవడంతో పెనాల్టీ షూటౌట్‌ను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇటువంటి ఘటనలు అంతర్జాతీయ జట్లు తలపడినప్పుడు ఎక్కువ సార్లు చూశాం.

కానీ, ఇప్పుడు ఈ మ్యాచ్‌ ఫలితం పూర్తి విభిన్నంగా ఉంది. నిర్ణీత 90 నిమిషాల సమయంలో ఒకే జట్టు ఏకంగా 20 గోల్స్‌ చేసింది. జర్మనీలో గత బుధవారం బెఎర్న్‌ మునిచ్‌-రొటాచ్‌ ఎగర్న్‌ జట్ల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో మునిచ్‌ జట్టు ఆటగాళ్లు గోల్స్ మీద గోల్స్‌ నమోదు చేశారు. మ్యాచ్‌ తొలి అర్ధభాగం ముగిసే సమయానికి 7 గోల్స్‌ నమోదు చేసిన మునిచ్‌ ఆ తర్వాత మ్యాచ్‌ అయిపోయే సమయానికి మొత్తం 20 గోల్స్‌ సాధించింది.

ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లు ఏ సమయంలోనూ మునిచ్ ఆటగాళ్లు కొట్టే గోల్స్‌ను అడ్డుకోలేకపోయారు. ఎగర్న్‌ జట్టు మొత్తం 2 గోల్స్‌ మాత్రమే సాధించింది. 88 నిమిషాల్లోనే మునిచ్‌ జట్టు 20 గోల్స్‌ నమోదు చేయడం విశేషం. దీంతో ఎగర్న్‌ జట్టు 2-20తో మ్యాచ్‌ను చేజార్చుకుంది. మునిచ్‌ జట్టులోని ముగ్గురు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించగా పది మంది ఆటగాళ్లు గోల్స్‌ నమోదు చేశారు. మునిచ్‌ ఆటగాళ్ల గోల్స్‌ కొట్టిన వీడియోను అభిమానులు తెగ చూసేస్తున్నారు. పెద్ద ఎత్తున లైక్‌లు కొట్టేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మ్యాచ్ ముగిసే ముందు పదిహేను నిమిషాల సమయం ఉందనగా కూడా.. బేయర్న్ 16-2 గోల్స్‌తోనే జట్టు పోరాడింది. కానీ, ఆ ఆఖరి నిమిషాల్లో కూడా వదిలి పెట్టకుండా గోల్స్ చేయడంతో.. బేయర్న్ మునిచ్ జట్టు ఇసుమంతైనా జాలి చూపించకుండా దాడి చేసిందంటూ నెటిజన్లు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

Story first published: Friday, August 10, 2018, 14:50 [IST]
Other articles published on Aug 10, 2018
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X