600వ గోల్‌తో అటు మ్యాచ్, ఇటు రికార్డు రెండూ..మెస్సీ సొంతం

Posted By:
Barcelona 1 Atletico 0: Messi's 600th goal sends Barca 8 points clear in La Liga

హైదరాబాద్: అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనెల్‌ మెస్సీ మరో ఘనతను అందుకున్నాడు. ముప్పై ఏళ్లకే ప్రపంచం కంటే ముందుగా దూసుకెళ్తున్న మెస్సీ తన ఫుట్‌బాల్ ప్రొఫెషనల్ కెరీర్‌లో 600 గోల్‌ను పూర్తి చేసి అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. లా లిగా ఈవెంట్‌లో భాగంగా అట్లెటికో మాడ్రిడ్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మెస్సీ చేసిన ఏకైక గోల్‌ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఒక్క గోల్ కొట్టి తన బార్సిలోనా జట్టును 1-0తో గెలిపించాడు.

తన జట్టుకు విజయాన్ని అందించడంతో పాటు 30 ఏళ్ల మెస్సీ అరుదైన '600' గోల్స్‌ క్లబ్‌లో చేరాడు. క్రికెట్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఎలా అయితే పరుగుల యంత్రంగా పేర్కొంటామో.. అలానే ఫుట్‌బాల్ గేమ్‌లో మెస్సీ తనదైన శైలిలో గోల్‌లను తన ఖాతాలో వేసుకుంటుూనే ఉంటాడు.

మెస్సీ తన కెరీర్‌లో40 సంవత్సరాల పాత రికార్డులను సైతం తిరగరాశాడు. జర్మన్ లెజండ్ గెర్డ్ ముల్లర్ అత్యధిక గోల్స్ చేసి 91 పాయింట్లతో ఉన్న రికార్డును 2012లోనే మెస్సీ 96 గోల్స్‌తో చెరిపేశాడు. 2012-13 సంవత్సరానికి గాను 21 గేమ్స్‌లో ఆడి స్పానిష్ లీగ్ లా లిగాను అదరగొట్టాడు. ప్రీమియర్ లీగ్‌లో అతనికంటే ఎక్కువ రికార్డు సంపాదించడానికి జామీ వార్డీ 2015 వరకు కష్టపడ్డాడు.

లియోనల్ మెస్సీ అర్జెంటీనా 2008లో గెలుచుకున్న గోల్డ్ మెడల్‌తో పాటు అతని కెరీర్‌లో మరెన్నో విజయాలు దాగున్నాయి. మొదటి మ్యాచ్ బార్సిలోనా ప్రాంతంతో 2004 సంవత్సరంలో ఆడిన మెస్సీ మొత్తం 30 ట్రోఫీల వరకు గెలుచుకున్నాడు.
అందులో..
ఛాంపియన్ లీగ్ ట్రోఫీలు 4
లా లీగ్ టైటిళ్లు 8
కొపా డెల్ రేస్ 5
స్పానిష్ సూపర్ కప్స్ 7
యూఈఎఫ్ఏ సూపర్ కప్స్ 3

వీటితో పాటుగా అండర్ 20 వరల్డ్ కప్ గెలుచుకున్న చరిత్ర సైతం మెస్సీ ఖాతాలో ఉంది. ఫుట్‌బాల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే బాలోన్ డీ ఆర్ అవార్డులను ఐదింటిని మెస్సీ సొంతం చేసుకున్నాడు. ఫుట్‌బాల్ క్రీడలో ఓటింగ్ ద్వారా మెస్సీనే బెస్ట్ ఫుట్‌బాలర్‌గా మెస్సీనే గెలుపొందాడు.

Read more about: lionel messi football
Story first published: Tuesday, March 6, 2018, 11:48 [IST]
Other articles published on Mar 6, 2018
+ మరిన్ని
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి