న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
ఇండియన్ సూపర్ లీగ్ అంచనాలు
VS

Copa America: ఈ విజయం డీగో మారడోనాకు అంకితం: మెస్సీ

Argentina captain Lionel Messi dedicates Copa America victory to late Diego Maradona

బ్యూనెస్‌ ఎయిరెస్‌: ఆదివారం జరిగిన కోపా అమెరికా ఫైనల్లో బ్రెజిల్‌ను 1-0తో చిత్తు చేసిన అర్జెంటీనా 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆ కప్పును ముద్దాడింది. దీంతో ఆ జట్టు ప్లేయర్స్ ఆనందంలో మునిగిపోతున్నారు. ఇక అభిమానులు సంతోషంకు అడ్డేలేకుండా పోయింది. అర్జెంటీనా స్టార్‌, కెప్టెన్‌ లియొనల్‌ మెస్సీ కెరీర్‌లో అతిపెద్ద అంతర్జాతీయ టోర్నీ విజయం కావడం విశేషం. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించిన మెస్సీ జట్టు విజయాన్ని కరోనా బాధిత కుటుంబాలకు, గతేడాది మరణించిన దిగ్గజ ఫుట్‌బాల్‌ ప్లేయర్ డీగో మారడోనాకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు.

Sri Lanka vs India: శ్రీలంక-భారత్ మ్యాచ్‌ సమయాల్లో మార్పులు.. ఆలస్యంగానే ఆరంభం!!Sri Lanka vs India: శ్రీలంక-భారత్ మ్యాచ్‌ సమయాల్లో మార్పులు.. ఆలస్యంగానే ఆరంభం!!

'నేను ఈ విజయాన్ని నా కుటుంబసభ్యులకు, స్పేహితులకు, 45 మిలియన్ల అర్జెంటీనా ప్రజలకు, ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో బాధితులుగా మిగిలిన ప్రతి ఒక్కరికీ అంకితమిస్తున్నా. గతేడాది కన్నుమూసిన డీగో మారడోనాకు కూడా. ఆయన ఎక్కడున్నా మమ్మల్ని ప్రోత్సహిస్తుంటాడనే నమ్మకం ఉంది. ఈ విజయోత్సవాలను మరింత ఎక్కువగా జరుపుకునే క్రమంలో మనమంతా కూరోనా మహమ్మారి పూర్తిగా తొలగిపోలేదని మర్చిపోవద్దు. ఈ విజయంతో వచ్చిన సంతోషంతో బలం తెచ్చుకొని వైరస్‌పై కలిసికట్టుగా పోరాడుదాం. నాకు అన్ని ఇచ్చిన ఆ దేవుడికి ధన్యవాదాలు. నన్ను ఇక్కడ పుట్టించినందుకు కృతజ్ఞతలు' అని మెస్సీ పేర్కొన్నాడు.

ఆదివారం మరకాన స్టేడియంలో జరిగిన కోపా అమెరికా ఫైనల్‌లో అర్జెంటీనా 1-0తో బ్రెజిల్‌ను చిత్తుచేసి 1993 తర్వాత తొలి మేజర్‌ టైటిల్‌ దక్కించుకుంది. మ్యాచ్‌ 22వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్‌ రోడ్రిగో డీ పౌల్‌ అందించిన లాంగ్‌పాస్‌ను అంజెల్‌ డీ మారియా అద్భుతంగా వినియోగించుకున్నాడు. ఆ తర్వాత బ్రెజిల్‌ స్టార్‌ నేమార్‌ను అర్జెంటీనా విజయవంతంగా అడ్డుకోగలిగింది. అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీ 88వ నిమిషంలో వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. అయినా చివరి వరకు బ్రెజిల్‌ను గోల్ చేయనివ్వని అర్జెంటీనా విజేతగా నిలిచింది.

అర్జెంటీనా జూనియర్‌ జట్టుకు అండర్‌-20 ప్రపంచకప్‌ అందించాక.. 2006లో మెస్సీ సీనియర్‌ జట్టులో అడుగుపెట్టాడు. ఆ తర్వాతి ఏడాదే కోపా అమెరికా ఫైనల్‌లో బ్రెజిల్‌ చేతిలో ఓడింది. 2014 ప్రపంచకప్‌ ఫైనల్‌లోనూ జర్మనీ చేతిలో పరాజయం పాలైంది. బార్సిలోనా క్లబ్‌కు ఎన్నో టైటిళ్లు అందించిన మెస్సీ.. అర్జెంటీనా తరపున మాత్రం మంచి ప్రదర్శన చేయలేదన్న విమర్శలు వచ్చాయి. 2015, 2016 కోపా అమెరికా ఫైనల్స్‌లో రెండుసార్లు చిలీ చేతిలోనే ఓటమి పాలవ్వడంతో.. మెస్సీ జాతీయ జట్టుకు వీడ్కోలు చెప్పాడు. 2018 ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌ కోసం మళ్లీ బరిలోకి దిగాడు. చివరకు 34ఏళ్ల వయస్సులో కోపా టైటిల్‌ను అందుకున్నాడు.

Story first published: Monday, July 12, 2021, 21:50 [IST]
Other articles published on Jul 12, 2021
-
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X